balakrishna-jabardasth-show

జబర్దస్త్ షో కి జడ్జిగా వస్తానంటున్న బాలకృష్ణ

Uncategorized

బాలకృష్ణ గారి మ్యానేరిజం కి పడి పోని వారు ఉంటారా? ఏ హీరో అభిమాని అయిన బాలయ్యను ఇష్టపడుతునే ఉంటారు.
ఆయన సినిమాల్లో ఎల కనిపిస్తుంటారో నిజ జీవితం లో కూడా అదే రీతిగా ఉంటారు. బాలయ్య నిజ జీవితంలో కల్మషం లేని మనిషి గా కనిపిస్తుంటారు. లోపల ఒక లాగా బయట ఒకలాగా ప్రవర్తించే మనస్తత్వం బాలయ్య ది కానేకాదు కోపం వస్తే కోప్పడ్డం, ప్రేమ కలిగితే ప్రేమించడం మాత్రమే బాలయ్యకు తెలుసు.

ఏ విషయానికైన జంకకుండా సూటిగా మాట్లాడే ప్రవర్తన అనేక మంది ప్రేక్షకులను ఆకట్టుకుని బాలయ్య అంటే అభిమానాన్ని కలిగించింది.

అయితే ఈ ముక్కుసూటి ప్రవర్తన గల బాలకృష్ణ ఒక వేళ వెండి తెరపై కాకుండా బుల్లి తెరపై కనిపిస్తే ఎలాగ ఉంటది అనే ఆలోచనతో ప్రస్తుతం ఆయన గురించే కొన్ని కొత్త షోలు ప్రసారం కానున్నాయి.

ఎంతో మంది హీరోలు యాంకర్లుగా, హోస్ట్ లగా షో ని నిర్వహించడం చూశాము. అయితే ఆ హీరో ల మధ్య వ్యత్యాసం అంత పెద్దగా కనిపించదు అదే బాలకృష్ణ గారి విషయానికొస్తే ఆయన మాట్లాడే తీరు ఆయన ప్రవర్తించే రీతి మిగతా హీరోలకు భిన్నంగా ఉంటుంది . ఈ ఆలోచనే ఎంతోమంది నిర్మాతలను ఆకర్షించే ఆయన కొరకే కొన్ని షో లను రచించేలా చేసింది.

balakrishna-jabardasth-show

తాజా సమాచారం ప్రకారం ఆహా ఓటీటీ ప్లాట్ లో ‘అన్‌స్టాపబుల్‌’ విత్ ఎన్.బి.కె కార్యక్రమానికి బాలకృష్ణ గారు ఓకే చెప్పారు ఇక నవంబర్ 4వ తారీఖు నుండి ఈ షో ప్రారంభం కానుంది.

బాలయ్య గారు ‘అన్‌స్టాపబుల్‌’ ఈవెంట్ లో మాట్లాడుతూ ఒక రాయి శిల్పం కావాలంటే ఎన్నో ఉలి దెబ్బలు తిన్నాలి . అదే రీతిగా మనిషి తన జీవితంలో గమ్యం చేరాలంటే ఎన్నో ఎత్తు పళ్ళు ఉంటాయి వాటిని అధిగమించి చేరాలి దాన్నే ‘అన్‌స్టాపబుల్‌’ అంటారని అని బాలయ్య చెప్పారు

ఇక ఒక సందర్భంలో రోజా గారు జబర్దస్త్ షో నుండి బాలకృష్ణ గారికి ఫోన్ చేయగా, బాలకృష్ణ గారు నమస్కారాలతో రోజా గారిని పలకరించి తన నమస్కారాన్ని చూపించారు . రోజా గారు నేను జబర్దస్త్ ప్రోగ్రాం లో ఉండి మీకు ఫోన్ చేస్తున్నాను మీరు ఏం చేస్తున్నారండి అని బాలకృష్ణ అడుగగా, బాలకృష్ణ గారు ప్రస్తుతం అఖండ షూటింగ్ లో ఉన్నానని సమాధానం ఇచ్చారు, అయితే రోజా గారు మళ్ళీ మనిద్దరం కలిసి ఎప్పుడు నటిద్దాం, భైరవ ద్వీపం 2 చేస్తారా బొబ్బిలి సింహం 2 చేస్తారని అభిమానులు అడుగుతున్నారని రోజా అనగా.

బాలకృష్ణ గారు నవ్వుతూ అవును మన కాంబినేషన్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు కలిసి సినిమా మాత్రమే కాదు జబర్దస్త్ షోకి జడ్జిగా కూడా వస్తాను అని సమాధానమిచ్చారు. ఇక రోజా థాంక్యూ సార్ అనేసింది. బాలయ్య గారు ఇంకా మాట్లాడుతూ జబర్దస్త్ లోని కొంతమంది ఆర్టిస్టులను గుర్తుచేసి ఎలా ఉన్నారని రోజు అని అడిగగా సదరు ఆర్టిస్టులు ఆ మాట విని గొప్ప పేరున్న బాలయ్య గారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారని ఆనందపడ్డారు.

మరియు బాలయ్య గారి ఈ మాటల ద్వారా తాను ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం లో కూడా చూస్తారు అని తెలిసేలా చేశారు. అలాగే వరుస పరిణామాలు చూస్తుంటే బాలయ్య గారు త్వరలో ఏదో ఒక షో లో వ్యాఖ్యాతగా కనిపించనున్నారు అని కన్ఫామ్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *