నందమూరి నట సింహం బలకృష్ణ గారు అంటే ఎవరికైనా గుర్తొచ్చేది ఆయన ముక్కుసూటి తనం. ఆయన సినిమాల్లో సింహం లాగ ఎలా అయితే కనిపిస్తుంటారో నిజ జీవితం లో కూడా అలాగే ఉంటాడు. ఏది ఐన దాచిపెట్టకుండా మాట్లాడుతాడు. అది ఎవరైనా సరే ఎదురుగా ఎంత పెద్ద వ్యక్తయినా ఉండని, తప్పు చేస్తే బాలయ్య ఎవరిని వదలడు.
ముక్కుసూటిగా మరియు కుండా బద్దలు కొట్టినట్లుగా మాట్లాడడం తెలుగు చిత్ర పరిశ్రమలో బాలయ్య బాబు తరువాతే ఎవరైనా. ఎన్నో ఇంటర్వ్యూలలో ఎంతో మందిని ఎటువంటి సంకోచం లేకుండా మందలించడం చూసాం.
ఎంతో మంది స్టార్ హీరోలను సహితం బహిరంగంగానే విమర్శించడం చూసాం. అందుకే బాలయ్య కంట పడకుండా చాలా మంది నటులు జాగ్రత్త పడుతుంటారు. అంతే కాదు బాలయ్య గారికి చాలా కోపం అన్నవిషయం కూడా తెలిసిందే, ఆలా అతను తన కోపం తో తన అభిమానులను చాలా సార్లు కొట్టిన సందర్భాలు , తిట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయ్.
కానీ బాలయ్య మంచి తనానికి తన అభిమానులు అతను కొట్టిన తిట్టిన కూడా వాటిని బ్లెస్సింగ్స్ లాగా భావిస్తుంటారు. అతను కొట్టినా కూడా అందులో తమ తప్పు ఉంది కాబట్టే అతను కొట్టాడు అంటూ వారి అభిమాన నటుడిని సమర్ధించుకుంటారు. బాలయ్య బాబు కూడా అలాంటి విషయాల పై రియాక్ట్ అవుతూ అది తన అభిమానులకు తనకు మధ్య ఉన్న స్పెషల్ ఎఫక్షన్ అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే ఇటీవలే నటుడు సమీర్ బాలయ్య బాబుతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు.బాలయ్య ధైర్య సాహసాలు మరియు సమానత్వ ఆలోచనల గురించి అతను ఆ ఇంటర్వ్యూ లో వివరిస్తూ.. బాలయ్య జీవితం లో జరిగిన ఒక సంఘటను వివరించారు. లెజెండ్ సినిమా సక్సెస్ మీట్ కోసం వారు ఒక బస్సు లో కలిసి వెళుతూ ఉండగా ఒక ఊరిలో జనం బస్సు కి అడ్డుగా వచ్చారు. అప్పుడు అందులో నుండి ఒక తాగుబోతు ఆ బస్సు పై రాళ్లతో దాడి చేసాడంట.” అయితే బస్సు ముందటి అద్దం పగిలి డైరెక్టర్ బోయపాటి శ్రీను కి గాయాలు అయ్యాయి. అప్పుడు ఆ బస్సు డ్రైవర్ కిందకి దూకి పారిపోయాడు. దాంతో బాస్ లో ఉండే మేమంతా తెగ బయపడిపోయాం కానీ ఆ టైం లో బాలయ్య గారిని చూసి షాక్ అయ్యాను.
అసలు తాను ఎంత దర్జాగా , ధైర్యంగా ఉన్నాడంటే, అసలు అక్కడ ఏం జరగలేదు అన్నట్లు గా కనిపించారాయన. తరువాత అందరూ అభిమానులు ఆ తాగుబోతును కొడుతూ ఉంటె బాలయ్య బాబే మల్లి వాళ్ళను తిట్టి అతను తాగేసి ఉన్నాడు అతన్ని కొట్టకండి అని వారిని ఆపాడు. అప్పుడు అతని మంచితనం ఏంటో మరోసారి చూసే అదృష్టం దొరికింది”, అంటూ సమీర్ అన్నాడు. ” బాడీ గార్డ్స్ ఉన్న కూడా నాకు చాలా బయమేసింది .
బాలయ్య బాబుతో ఇంత మంది లో నుండి ఎలా వెళతావ్ అన్నాను. అప్పుడు బాలయ్య నవ్వుతూ ఎలా వెళతానో చూడు అంటూ నన్ను ఆ జనాల్లో కి నెట్టేశాడు. నన్ను అందరూ నలిపేసారు. కాసేపటివరకు నాకు ఊపిరి కూడా ఆడలేదు. కానీ బాలయ్య బాబు బస్సు దిగగానే జనాలు రెండుగా విడిపోయి అతనికి దారి ఇచ్చారు. ఆ దారిలో నిజంగానే సింహం లా నడుచుకుంటూ వచ్చాడు. ఆ సీన్ నేను జీవితాంతం మర్చిపోలేనని” అన్నారు సమీర్ .