ఎవరికీ భయపడని బాలకృష్ణ కి అతనంటే మాత్రం చాలా భయమట..!

News Trending

టాలీవుడ్ లో బాక్గ్రౌండ్ తో వచ్చి తమ సొంత టాలెంట్ తో పైకి వచ్చిన వారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు అలంటి వారిలో బాలకృష్ణ కూడా ఒక్కరు. టాలెంట్ లేకపోతే ఎంతటి గొప్ప బాక్గ్రౌండ్ ఐన ఉండని ప్రజలు ఆదరించరు, ఈ విషయం ఎంతో మంది బడా హీరోల కొడుకుల జీవితాలలో నెరవేరడం మనం చూసాం.సో పెద్ద హీరో కొడుకుగా పుట్టినంత మాత్రాన గొప్ప నటుడు అవుతారని చెప్పడం చాలా కష్టం.

అలాంటిది ఓ పాపులర్ హీరో కడుపునా పుట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు నట సింహం బాలకృష్ణ. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించాడు బాల కృష్ణ.అయితే బాలకృష్ణ గురించి మనందరికీ తెలిసిందే.. అతనికి చాలా కోపం అని అంతేకాకుండా ఉన్నదీ ఉన్నట్లు కుండా బద్దలు కొట్టినట్లు మొఖం మీదే మాట్లాడేస్తుంటాడని.. అతను మనసులో ఒకటి ఉంచుకొని బయటికి ఇంకోటి మాట్లాడడం మనం ఎప్పుడు బహుశా చూసి ఉండక పోవచ్చు. టాలీవుడ్ లో బాలయ్యకు ముక్కుసూటి మనిషి అని పేరు కూడా ఉందట.

ఎవరైనా తప్పు చేస్తే చాలు వారు ఎవరైనా సరే ఎంతటి పద్ధ వ్యక్తి ఐన సరే వారిని అసలు విడిచిపెట్టకుండా గట్టిగ వార్నింగ్ ఇస్తుంటాడు బాలయ్య. ఎన్నో సందర్బాలలో మనం చూసాం కూడా. ఇలా ముక్కుసూటిగా మాట్లాడడం మరియు కుండా బద్దలు కొట్టినట్లు సమాధానం ఇవ్వడం లో టాలీవుడ్ మొత్తం లో బాలకృష్ణ గారి తర్వాతే ఎవరైనా అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇంతటి ధైర్యవంతుడైన బాలకృష్ణ మాత్రం ఒకాయనకి చాలా బయపడతారట.

Sv Krishna reddy
Sv Krishna reddy

అతను ఇంకెవరో కాదు ఎస్వీ కృష్ణారెడ్డి. మనందరికి తెలుసు ఎస్వీ కృష్ణ రెడ్డి ఎంతటి పేరు ఉన్న డైరెక్టరో అని. అయితే అతను బాలకృష్ణ తో టాప్ హీరో మూవీ తీస్తున్న టైం లో బ్రేక్ టైం లో బాల కృష్ణ అతని సన్నిహితులతో పేకాట ఆడుతూ కనిపించారట. అయితే అప్పుడు అక్కడికి ఎస్వీ కృష్ణారెడ్డి వచ్చినప్పుడు వెంటనే బాలకృష్ణ బయపడి,లేచి చేతులు కట్టుకొని నిలబడ్డాడట. అప్పుడు ఆ డైరెక్టర్ అయ్యో ఎందకు నిలబడ్డారు కూర్చోండి అని అన్నప్పుడు , బాలకృష్ణ లేదు మీరు గొప్ప డైరెక్టర్ మీ ముందు పేకాట ఆడడం తప్పు కదా అని సమాధాన ఇచ్చాడంటా. ఆలా ఎవరికీ భయపడని బాలయ్య ఎస్వీ కృష్ణ రెడ్డి కి బయపడతారని అర్ధం అయ్యింది అందరికి.

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ AKhanda లో పని చేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి బ్యాంక్రోల్ చేసిన ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. నటుడు ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు కనిపిస్తాడు, అందులో అతను విభిన్నమైన గెటప్‌లో నటిస్తున్నాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కోసం బాలయ్య అఘోరా అవతారం ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published.