పార్టీ మూడ్‌ లో ఫుల్ జోష్ లో బాలకృష్ణ, ఏ నటుడు వెయ్యని పాత్ర వేసి రికార్డ్ సృష్టించిన బాలయ్య.

News

మాస్ ఆడియెన్స్ దృష్టిలో పెట్టుకొని సినిమాలు నిర్మిస్తూ ఉంటాడు బోయపాటి శ్రీను. తను అనుకునే స్టోరీ కి కరెక్ట్ గా సూట్ అయ్యే మాస్ హీరో దొరికడంటే ఇంకా రెచ్చిపోయి సూపర్ హిట్ కొట్టేస్తాడు. ఇలాంటిదే బోయపాటి శ్రీను బాలకృష్ణల కాంబినేషన్. బాలయ్య గారి మాస్ యాక్టింగ్ ను పూర్తిగా వాడెయ్య సామర్ధ్యం గల వాడు బోయపాటి.

అలా నిర్మించినవే సింహా, మరియు లెజెండ్ సినిమాలు. ఈ రెండు కూడా భారి హిట్ ను సొంతం చేసుకున్నాయి. అలా సక్సెస్ ను అందుకున్న ఈ కాంబినేషన్ త్వరలో మరో భారీ ప్రాజెక్ట్ తో మన ముందుకు రాబోతున్నారు. మాస్క్ తో పాటు రొమాంటిక్ ట్రీట్ తో రాబోతున్న సినిమా అఖండ. గతం లో సూపర్ హిట్ సాధించిన ఈ కాంబోలో ఇది కూడా సూపర్ హిట్ అవ్వాబోతుంది అని టాక్ ప్రచారంలో ఉంది.

‘అఖండ’ మూవీ లో నందమూరి బాలకృష్ణ సరసాన కన్నుల పండుగ చేయబోతున్న హీరోయిన్ ప్రగ్య జైస్వాల్, ఆమెకోసం ఒక కీలక పాత్ర సృష్టించినట్లు డైరెక్టర్ బోయపాటి అన్నారు. ఈ సినిమాల్లో బాలకృష్ణ గారు అఘోరా గా కనబడ బోతున్నాడట అదే కాక ఎన్నో సాహసాలు ఈ చిత్రం లో ప్రదర్శించ బొతున్నారట. ఈ సినిమా ద్వారా ఇంతవరకు ఏ నటుడు చేయని అఘోరా పాత్ర ను పోషిస్తున్న ఏకైక స్టార్ హీరోగా సరికొత్త రికార్డ్ సృష్టించడు బాలయ్య .

అన్నపూర్ణ స్టూడియోలో సినిమాలోని ముఖ్య బాగం అంతా కూడా షూటింగ్ ముగించుకొని. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా ప్రభావం వల్ల కుంటుబడిన సినిమా షూటింగ్ పూర్తి కావడంతో సినిమా యూనిట్ సంబరాలు చేసుకున్నారు.

ఈ సినిమా కోసం కష్ట పడ్డ ప్రతివారు సినిమా షూటింగ్ అయిపోయినందుకు వేడుక చేసుకున్నారు. ఈ పార్టీ కి వచ్చిన ప్రముఖుల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల అవి ఇప్పుడు ట్రెండింగ్ గా నిలిచాయి. వైట్ అండ్ వైట్ వేసుకుని విక్టరీ సింబల్ చూపిస్తున్న బాలయ్య పక్కన హ్యాపీ పార్టీ మూడ్ లో ఉన్న ప్రగ్యా జైస్వాల్ ల ఫోటో ఒకటి వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *