టిక్ టాక్ భానుకి గోరమైన అవమానం.! స్కిట్ లో దారుణంగా పరువు తీసిన హైపర్ ఆది.! (VIDEO)

News

ఒకప్పుడు ఆది జబర్దస్త్ షో లో చేసే రచ్చ మాములుగా ఉండేది కాదు ఇప్పుడు అదే జోష్ ను ఆది వివిధ షోలల్లో కూడా కొనసాగిస్తున్నాడు.అటు జబర్దస్త్ చేస్తూనే ఇంకొన్ని షోలల్లో కూడా అతని పంచ్ డైలాగ్స్ తో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. అసలు రెస్టు లేకుండా ఆది ఇప్పుడు పలు ప్రోగ్రామ్స్ లో బిజీ గా ఉంటున్నాడు. ఆది కి ఇంత పాపులారిటీ రాడానికి కారణం కేవలం అతని పంచ్ డైలాగ్స్ మరియు టైమింగ్.

ఆది వేసే పంచులకు ఎవరైనా పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే.అయితే అప్పుడప్పుడు అతని ఈ డైలాగ్స్ కూడా కాంట్రవర్సీ లకు కూడా దారి తీస్తుంటాయి.ఎక్కువగా ఆది అతని టీం మెంబెర్స్ పైనే పంచులు వేస్తుంటారు. బాడీ షేమింగ్స్ పైనే ఎక్కువ పంచులు రాస్తుంటాడు.అయితే అది ఈసారి టిక్ టాక్ ఫేమ్ భాను పైన అతని పంచులతో విరుచుకు పడ్డాడు. ఆమెని గోరంగా అవమానించాడు. అతను శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో ఎలా అదరగొడుతున్నాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ఆ షో యొక్క లేటెస్ట్ ప్రోమో వీడియో విడుదల చేసారు. ఈ ఎపిసోడ్ వచ్చే ఆదివారం ప్రసారం కానుంది.

Hyper dance

అయితే అందులో ఆది భాను ని గోరంగా ఆడేసుకున్నాడు. ఆది టీం లో గడ్డం నవీన్ దర్శకుడు రాఘవేంద్రరావు పాత్రను పోషించాడు. ఆ మధ్య రాఘవేంద్రరావు తన సినిమాల గురించి వివరిస్తూ ఒక ప్రోగ్రాం చేసేవాడు. సరిగ్గా ఆ షో కి స్పూఫ్ గా ఆది స్కిట్ చేసాడు. అందులో గడ్డం నవీన్ పెళ్లి సందడి సినిమా అనుభవాలు పంచుకుంటూ ఉంటాడు.రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్ల పాత్రల్లో నవీన్ టిక్ టాక్ భాను మరియు వర్షలను పెడతాడు.

వీళ్ళే పెళ్లి సందడి హీరోయిన్లు అని నవీన్ అన్నప్పుడు, అప్పుడు ఆది వారి పైన సెటైర్లు వేయడం మొదలు పెడతారు.పెళ్లి పందిరిలో ఆకులు ఏరుకునే వాళ్ళలా ఉన్నారు వీళ్ళు హీరోయిన్లా? అంటూ సెటైర్లు వేసాడు.ముఖ్యంగా టిక్ టాక్ భానుని ఒక ఆట ఆడుకున్నాడు. నవీన్ భాను వైపు చూపిస్తూ ఈమెనే హీరోయిన్ రవళి అంటూ పరిచయం చేస్తాడు. అప్పుడు ఆది ఏంటి ఈమె రవళినా? రోడ్డు పక్కన పళ్ళు పెట్టుకొని అందరిని రావాలి రావాలి అని పిలిచే దానిలా ఉంది ఈమె రవళి ఏంటి అంటూ పంచులు వదిలాడు.రవళి రియాక్షన్ చూసి అందరూ పగలబడి నవ్వుకున్నారు.ఈ ఎపిసోడ్ వచ్చే ఆదివారం ప్రసారం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *