bigg-boss-4-fame-akhil-monal

త్వరలో జంటగా మారబోతున్న ‘బిగ్ బాస్-4’ ఫేమ్ అఖిల్ మరియు మొనల్

Movie News

‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి’ అనే వెబ్ సిరీస్ బిగ్ బాస్-4 ముగిసినప్పటి నుండి అఖిల్ సార్థక్ సైన్ అప్ చేసిన మొదటి ప్రాజెక్ట్. ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుందా అని అఖిల్ ,మొనల్ ఫాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు.

కానీ ప్రస్తుతం వారిద్దరూ వేరు వేరు ప్రాజెక్టులతో చాలా బిజీ గా ఉన్నారు. అఖిల్ “ఫస్ట్ టైం” అనే మూవీ షూటింగ్ లో ఉంటే మొనల్ ఏమో వివిధ టీవీ షో లల్లో చాలా బిజీ గా ఉండటం మనం చూస్తున్నాం.కానీ వీరిద్దరూ ఎంత బిజీ గా ఉన్న టచ్ లోనే ఉన్నట్లు రూమర్స్ బయటికి వస్తున్నాయి.కానీ వారి డేట్స్ కాలిగా లేవు కాబట్టి మనం వారిని ఒకటిగా ఈ మధ్య చూసే అవకాశం దాదాపు లేనట్లే.

వారి షెడ్యూల్ ప్రస్తుతానికి అస్సలు కాలిగా లేదని తెలుస్తోంది కాబట్టి దీని పై స్పందించిన అఖిల్ ,ప్రస్తుతం డేట్స్ లేవని ఒక్కసారి డేట్స్ దొరికితే మొనల్ తో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి’ అనే వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు పెడతాం అని అతను వివరించాడు.

ఈ ప్రాజెక్ట్ గురించి అఖిల్ సార్థక్ మాట్లాడుతూ, ఇది సరైన వెబ్ సిరీస్, ఈ వెబ్ సిరీస్ లో మీరు నిజమైన ప్రేమను చూడవచ్చు. బిగ్ బాస్ హౌస్ లో నాకు మరియు మోనాల్ గజ్జర్ మధ్య ఏమి జరిగిందో మీరు మరింత తెలుసుకోవాలంటే, మీరు ఈ వెబ్ సిరీస్ చూడాలి. ఈ కథను మా ఇద్దరి కోసం దర్శకుడు రాసాడు. ఈ రొమాంటిక్ డ్రామాలో మేమిద్దరం మధ్యతరగతి వ్యక్తులు గా కనిపించబోతున్నాం. ఈ వెబ్ సిరీస్ ఆరు ఎపిసోడ్లలో ఉంటుందని ఆయన అన్నారు.దీంట్లో సన్నివేశాలు నిజంగా షాకింగ్ గా ఉండబితున్నాయి.

మీరు ఈ వెబ్ సిరీస్ లో ఒక కొత్త అఖిల్‌ని చూస్తారు. నేను నిజ జీవితంలో ఉన్నట్లే ఈ వెబ్ సిరీస్ లో ఉంటాను. బిగ్ బాస్ హౌస్ వెలుపల మోనాల్‌తో జరిగున నా సంభాషణలు ఇందులో చిత్రీకరించబడతాయి అని అఖిల్ వెల్లడించారు. బిగ్ బాస్ సీజన్ రన్నరప్‌గా నిలిచిన అఖిల్, మోనాల్ ఎప్పుడు కూడా పొగరుగా లేదు అని చెప్పాడు. ఆమె ఇండస్ట్రీలో నాకు సీనియర్, కానీ ఆమె చాలా నిరాడంబరంగా ఉంటుంది అని కూడా అఖిల్ తెలిపారు. వెబ్ సిరీస్‌లో ఒక గుజరాతీ అమ్మాయి , హైదరాబాద్‌లో ఎదురుకునే సమస్యలు ఆసక్తికరంగా ఉంటాయని అతను తెలిపాడు.

ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభమవుతుంది. భాస్కర్ రావు ఈ వెబ్-ఫిల్మ్ యొక్క నిర్మాతగా ఉండబోతున్నాడు అని తెలుస్తోంది. భాస్కర్ బంటుపల్లి ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడు. సినిమాటోగ్రాఫర్ గా ఎ డి మార్గల్ ను కన్ఫర్మ్ చేసారు. సాకేత్ కోమండూరి సంగీత దర్శకుడుగా మన ముందుకు రాబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published.