ఈ వారం బిగ్‌బాస్ హౌస్ లో పోటీదారులకు తమ ఇంటి నుండి లెటర్ లను అందించాడు బిగ్ బాస్ అయితే కొన్ని షరతులు కూడా నియమించాడు, ఆ షరతుల వల్ల తాము ప్రేమించే వారు పంపించిన లేఖలను చాలామంది చదవలేక కోల్పోయారు, ఇక మరో సారి బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ కొరకు పోటీదారులకు టాస్క్ ఇవ్వటం జరిగింది.
షోలో జరుగుతున్న సమయంలో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి పింకీ నేను మానస్ టాప్ ఫైవ్ దాకా ఉంటాం అని ధీమాగా చెప్పగా వెంటనే సిరి స్పందించి మేము ఏంటి అడుక్కు తింటామా అని బదులిచ్చింది. ఆ తర్వాత మానస్ అంకులందరూ ఈవెళ్ళిపోయి కుర్రాళ్ళే ఉండాలి అని అనగా ఆంటీలు వెళ్ళిపోవాల్సి వస్తే ప్రియాంక కూడా వెళ్ళిపోతుంది అంటూ సిరి కామెడీగా ఒక డైలాగ్ వదిలింది.
ఇంట్లో ఉన్న రవి లోబో లను పెద్ద బావ చిన్న బావ బుల్లి బావ అంటూ సరదా సంభాషణ పెట్టింది ప్రియాంక. అయితే ప్రియాంక కొంతమందిని కవర్ చేస్తూ కనబడిందని ఆమెకు శ్రీరామ్ పెద్ద బావ మానస చిన్న బావ జెస్సి బుల్లి బావ అని లోబో రవి కి వివరిస్తు నవ్వులు పూయించాడు. ఆ తర్వాత లోబో నీ మాట పెద్ద బావ వినట్లేదు కదా వెళ్లి కాళ్ళు చేతులు తీసేయ్ అని అనగా అయ్యో అలా చేయొద్దు ఆయన వినకపోతే ఏం చిన్న బావ అన్నిటిలో అడ్జెస్ట్ అవుతాడు అనగా . అందుకు రవి నీకు కావాల్సింది కూడా అదే అని కౌంటర్ ఇచ్చి నవ్వులు పూయించాడు
ఇక ఈ వారం కెప్టెన్సీ కోసం అభయ హస్తం అనే టాస్క్ అర్హతగల సభ్యులకు ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భాగంగా ఇల్లు ఒక క్వారంటైన్ జోన్ గా మారుతోంది ఈ టాస్క్ ను ఎవరైతే సక్రమంగా నిర్వహిస్తారు వారికి ఇంటి లోనికి వెళ్లే అవకాశం ఉందని చెప్పాడు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్ లో భాగంగా అందరూ కలిసి ఒకే దగ్గర ఆడడం కంటే సభ్యులలో ఇద్దరిద్దరికీ పోటీ నిర్వహించాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా షణ్ముఖ్ లోబో లకు పోటీ జరుగగా పేడలో ఉన్న ముత్యాలను ఎవరు ఎక్కువ తీస్తారు వారు విజయం సాధించినట్లు ఆ వ్యక్తికి ఇంట్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని బిగ్బాస్ చెప్పగా. లోబో 74 ముత్యాల తీయగా షణ్ముఖ 101 ముత్యాలు వెలికి తీశాడు అయితే లోబో ముత్యాలు తీసిన తర్వాత వాటిని శుభ్రపరచనందున శుభ్రపరచని ముత్యాలు లెక్కించలేదు. శుభ్రపరచనీ ముత్యాలు లెక్క పెట్టనందుకు ఇంటి సభ్యుల మధ్య కొంత చర్చ నడిచింది.
ఆ తర్వాత సిరి రవి లకు పోటీ జరిగింది. బిగ్ బాస్ వీరిద్దరికీ గాలం మార్చే మీ కాలం అనే టాస్క్ ఇచ్చాడు ఇందులో భాగంగా స్విమ్మింగ్ పూల్ లో మునిగి ఉన్న బాటిళ్లను ఫిషింగ్ రాడ్ సాయంతో బయటికి తీయాలి, ఈ పోటీలో సిరి 15 తీయగా రవి 12 బాటిల్స్ తీశాడు దీంతో సిరి విజయం సాధించి ఇంటి లోనికి వెళ్లే అవకాశం దక్కించుకుంది. ఇప్పటివరకు సిరి షణ్ముఖ్ లు ఇంటి లోనికి వెళ్లే అవకాశం పొందుకో గా కిచెన్ లోకి వెళ్లి తమకు నచ్చింది వండుకొని ఒకరికొకరు గోరుముద్దలు తినిపించుకున్నారు.
ఆ తర్వాత శ్రీరామ్ మనస్ లిద్దరికి పోటీపడగా ఈ టాస్క్ లో ఎవరైతే ఎక్కువ సేపు తాళ్లను ఆపకుండా ఊపుతారో వారే గెలిచినట్లు అని బిగ్బాస్ చెప్పాడు. తాళను ఉపటానికి వీరిద్దరు ఎంతో కష్టపడ్డారు అయితే చివరికి ఎంతో శ్రమించిన మానస్ అలిసిపోయి తాళ్ళను వదిలేయగా శ్రీరామ్ విజయం సాధించాడు. ఇక ఈ రోజ ఎపిసోడ్ అయిపోయే సరికి మరుసటి రోజుకు మరో రెండు పోటీలు పెండింగ్ గా ఉన్నాయి.