బిగ్ బాస్ ఎనిమిదో వారపు క్యాప్టెన్ కొరకు పోటీదారులు టాస్క్ ను కొనసాగిస్తూ ఉండగా . బిగ్ బాస్ పెట్టిన పోటీలో గెలిచిన వారు మినహా మిగతా వారందరూ గార్డెన్ ఏరియా లో చాపలు వేసుకుని పడుకున్నారు. చాపలు వేసుకుని పడుకున్న వారిలో ఉన్న సన్నీ బిగ్ బాస్ నువ్వు ఇంత కఠినాత్ముడు అంటూ మండిపడ్డాడు. దీంతో కాజల్ స్పందిస్తూ ఏ పరిస్థితిలోనైనా నెగ్గుకురావాలి అని నేర్పించడానికి బిగ్ బాస్ ఈ టాస్క్ ఇచ్చారని అన్నారు.
ఇక క్యాప్టెన్ పదవి కోసం పోటీ చేయడానికి నాలుగవ ఛాలెంజ్లో భాగంగా ఎవరు పాల్గొనాలనే విషయంపై చర్చ జరగగా , ప్రారంభంలో పాల్గొనను అని చెప్పిన జస్వంత్ మళ్లీ ఆడతానని చెప్పేసరికి . ఎవరు తప్పు కోవాలో ఆలోచనలో పడ్డారు. అందుకు అని మాస్టర్ మరియు సన్నీ లు తప్పుకోగా నాకోసం ఎవరు త్యాగం చెయ్యొద్దు అంటూ జశ్వంత్ తప్పుకున్నాడు. ఇక జస్వంత్ కారణం అని చెప్పి ఆటలో వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వద్దని మిగతా సభ్యులను సిరి షణ్ముఖ్ లు కోరారు. జెస్సీ తరఫున మాట్లాడి మనం విలన్లు కావద్దని వారిద్దరూ సంభాషించుకున్నారు.
. నాలుగో ఛాలెంజ్ గా రంగుపడుద్ది టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భాగంగా ఏర్పాటు చేయబడిన కాన్వాస్ పైన ఎవరి రంగు ఎక్కువగా ఉంటుందో వారే గెలిచినట్టు. అయితే ఈ టాస్క్ లో అనీ మాస్టర్ ప్రియాంక ను ఓడించి విజయం సాధించింది.
ఇక ఇదే విషయాన్ని సిరి షణ్ముక్ మాట్లాడుకుంటూ ఈ సందర్భాన్ని మనిద్దరం కలిసి ఒక సాంగ్ చేద్దాం అని సిరి అనగా , ఏదైనా పని ఉంటేనే నేను గుర్తుకు వస్తానా అని చిరాకు పడ్డాడు. దీంతో సిరి కోప్పడి నీతో సాంగ్ చేయడానికి ఇంతదూరం వచ్చానా అని అలిగింది. ఆ తర్వాత షణ్ముక్ సారీ చెప్పిన ఎవరికి కావాలి నీ సారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి అని ఫైర్ అయ్యింది. ఇక డైనింగ్ ఏరియా లో ఉన్న శ్రీరామ్ వీరిద్దరికీ ఏమైందా అని ఆశ్చర్యంగా చూశాడు.
ఇంటి కెప్టెన్ పదవి కొరకు ఐదవ ఛాలెంజ్ గా కారులో హుషారుగా టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ . ఇందులో కాజల్ మరియు సన్నీ పోటీపడగా సన్నీ విజయం సాధించాడు. ఇక కొంత సమయానికి రవి సిరి షణ్ముఖ్ లు మాట్లాడుకుంటూ షణ్ముక్ అతిగా ఆలోచిస్తున్నాడు అనగా అన్ని వైపులా నుండి ఆలోచిస్తున్నాడని అని సిరి చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత రవి మాట్లాడుతూ నేను బిగ్ బాస్ కి డబ్బుల కోసం రాలేదని తన భార్య పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉందని మరియు తనకు పెద్దవాళ్ళు అయిన తల్లిదండ్రులు ఉన్నారని వాళ్ళ అక్కరలు చూసుకోవాల్సిన బాధ్యత తన పైన ఉందని చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ కు విజ్ఞప్తి చేస్తూ వాళ్లు ఎలాగున్నారు తెలియజేయ మన్నాడు లేదా తన నైనా బయటికి పంపించమని కోరాడు.
మరోపక్క మానస జెస్సీ కాజల్ మాట్లాడుకుంటూ రవి తనదైన శైలిలో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని ఎవర్ని కార్నర్ చేయాల అని ప్రయత్నం చేస్తున్నాడని మాట్లాడుకున్నారు. లోబో సీక్రెట్ రూమ్ లో రవి గురించి చెప్పిన తర్వాత ఈ వికెట్ డౌన్ అని అతడు అనుకొని ఉంటాడని మాట్లాడుకున్నారు.
ఇక కెప్టెన్సీ పోటీ కొరకు పెట్టిన చాలెంజ్ లలో విజయము సాధించని వారికి బంతి లో ఉంది భయం అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బజర్ మోగినప్పుడల్లా సర్కిల్ లో ఉన్న బంతిని పట్టుకున్న ప్రతివారు అవతల వ్యక్తిని ఎలిమినేట్ చేయవచ్చునని బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ లో మానస్ వరుసగా బంతిని సాధించి విశ్వ రవి జెస్సి లోబో కాజల్ పింకీ లను ఎలిమినేట్ చేసి క్యాప్టెన్ పోటీకి అర్హుడయ్యాడు. ఇక కెప్టెన్ పదవి కొరకు సిరి, శ్రీరామ్, అనీ, సన్నీ, మానస్ పోటీ పడడానికి ఎంపికయ్యారని బిగ్ బాస్ అన్నారు. ఇక చివరగా లాక్డౌన్ ఎత్తేసినట్టు బిగ్బాస్ చెప్పగా అందరూ ఇంటి లోపలికి వెళ్లి ఊపిరిపీల్చుకున్నారు.