Lahari manas

బిగ్ బాస్ 5 ఇంట్లో లో ఒకప్పుడు శత్రువులు కానీ ఇప్పుడు ప్రేమికులుగా మారారా, వీళ్ళ ఘాటు రొమాన్స్ ను చూసి

News

ఉత్కంఠ రేపుతున్నారు బిగ్ బాస్ 5 షో రెండవ వారం లోకి అడుగు పెట్టింది ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో ఎన్నో సంగతులు చోటు చేసుకున్నాయి. ఎప్పుడు కాలుతున్న నిప్పుల ఉండే కాంటెస్టెంట్లు కలిసి ఒకరికోక్కరు సపోర్ట్ చేస్కునేంతల కలిసి అడే అరుదైన సన్నివేశం పంతం నీదా నాదా టాస్క్ లో చూసాము. ఈ పరిణామం ఇంట్లో ఉన్న కాంటెస్టెంట్లు లో మంచి అనుబందం పెంచింది .

16 వ తారీఖున జరిగిన షో లో రోజంతా బిజీగా టాస్క్ లో రాత్రి రొమాంటిక్ కౌగిలింతతో అల్లర్లు లేకుండా ప్రశాంతంగా షో సాగినట్టు అనిపించింది షో చూస్తున్న ప్రేక్షకులకు మంచి రిఫ్రెషింగ్ భావన కలిగింది. ఇంకా షో వివరాల్లోకి వెళితే బిగ్ బాస్ ఆ రోజు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్ లను ఎల్లో బ్లూ టీములుగా విభజించి పంతం నీదా నాదా అనే టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ లో బిగ్ బాస్ ఇచ్చిన అగ్గిపుల్లల ఇసుక లో వరుసగా గూర్చి వెలిగించాలి చివరి వరకు ఇలా అగ్గి పుల్లలు కంటిన్యూగా ఆరిపోకుండా వెలగాలి ఎవరికైతే ఆ రకంగా వెలుగుతాయో ఆ టీమ్ గెలిచినట్టు ఈ టాస్క్ లో కంటెస్టెంట్ లు అందరూ కలిసి ఒక టీంగా ఆడడం ఇంట్లో ఉన్న వారికి టీవీ చూస్తున్న ప్రేక్షకులకు కన్నుల పండుగగా అనిపించింది.

ఇదే రోజు శ్వేతా బర్త్డే కావడంతో ఇంట్లో వాళ్ళందరూ సంబరంగా శ్వేతా కు విషెస్ చెప్పారు కాజల్ హమీద కలిసి శ్వేతాతో కేక్ కట్ చేయించారు. ఇలా ఆ ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండగా ఇంట్లోని సభ్యులందరికీ కీ శ్వేతా బర్త్ డే కారణంగా బిగ్ బాస్ చాక్లెట్లు పంపించి వాళ్ల మనసులను ఆహ్లాద పరిచారు. దీంతో బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ లకు బిగ్ బాస్ మంచి అనుబంధం ఏర్పడింది ఈ సీను చూసిన వారికి రాబోయే ఈ రోజుల్లో బిగ్ బాస్ కు ఇంట్లో కంటెస్టెంట్ లకు ఇంకా చక్కటి ఆత్మీయ భావన కలుగుతోందని అర్థం చేసుకున్నారు.

ఆ పంతం నీదా నాదా అనే పోటీ లో గెలిచిన టీంకు బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు ఈ టాస్క్ పేరు కొడితే కొట్టాలి కొబ్బరికాయ కొట్టాలి అయితే ఈ టాస్క్ లో శ్రీరామ్ టీం గెలిచినందుకు శ్రీరామ్ కు తన టీం నుండి ఈ టాస్క్ ఆడడానికి నలుగురిని సెలెక్ట్ చేసే బాధ్యత బిగ్ బాస్ ఇచ్చారు. అయితే ఈ టాస్క్ నుండి ప్రియా మాత్రం దూరంగా ఉండాలని బిగ్ బాస్ సూచించారు దీంతో ప్రియా బాధపడుతూ ఇది అన్యాయం బిగ్ బాస్ ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసింది. ఆ తర్వాత టీమ్ అంతా చర్చించుకుని అని మాస్టర్ హ మీద ప్రియాంక విశ్వా లను ఎంపిక చేశారు.

ఇలా ఎంపికైన వారి ముందు ఒక బౌల్ ని పెట్టి, ఇంటి సభ్యులకు కొబ్బరికాయలు నిచ్చి వారికి ఇవ్వబడినటువంటి కొబ్బరికాయలు కొట్టి ఎవరి బౌల్ అయితే ముందు నింపుతారు వారే ఇంటి కెప్టెన్ అవుతారని సూచించడంతో రవి శ్రీరామ్ జెస్సీ తదితరులు విశ్వా కు మద్దతు ఇస్తూ విశ్వ బౌల్ని నింపేశారు దీంతో రెండో వారం ఇంటి క్యాప్టెన్ గా విశ్వ బాధ్యతలు తీసుకున్నాడు.

రవి షణ్ముఖుని హమీద ముందు ఆట పట్టించేందుకు షణ్ముక్ ప్రేయసి దీప్తి సునైనాను జ్ఞాపకం చేశాడు. ఈ సంభాషణలు లహరి కూడా చేరడంతో వాళ్ల సంభాషణ సరదాగా మారింది. ఆ తర్వాత ఇంట్లో సింగిల్ బెడ్ కొరకు బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో లోబో మరియు ప్రియాంకా లు ఆటో టాస్క్ చేసి అందర్నీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు.

ఈ టాస్క్ లో ప్రియాంక ఇంటెలిజెంట్ గా మాట్లాడుతూ తన అందంతో మెస్మరైజ్ చేస్తూ ఆట ఆడింది ఆ తర్వాత ఉమాదేవి సిరి చేసిన అత్తా కోడళ్ళ టాస్క్ ద్వారా కూడా ఫన్ జనరేట్ అయింది. టాస్క్ లో జరిగిన అనంతరం ఇంట్లో సభ్యులందరూ లోబో కు మద్దతు ఇవ్వడం ద్వారా లోబో సింగిల్ బెడ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే లోగో తాను సంపాదించుకున్న ఆ సింగిల్ బెడ్ రూమ్ ఉమాదేవికి ఇవ్వబోయాడు అయితే ఉమాదేవి తనకు వద్దు అని చెప్పడంతో లోబో తనను పొట్టి అని సంబోధిస్తూ అందంగా ప్రపోజ్ చేస్తూ ఉమా దేవి ని ఒప్పించాడు ఈ రీతిగా ఉమాదేవి సింగిల్ బెడ్ ను పొందుకుంది.

Lahari manas
Lahari manas

ఇక రాత్రిపూట ఇంట్లో ఘాటు రొమాన్స్ చోటు చేసుకుంది గిన్నెలు క్లీన్ చేస్తున్న మానస్ దగ్గరకు లహరి వెళ్ళింది. అప్పుడు మానస్ నీకు బ్లాక్ కలర్ అంటే ఇష్టమా అని అడిగాడు అందుకు లహరి అవును నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం ఆ తర్వాత వైట్ ఆ తర్వాత బ్లూ అని సమాధానమిచ్చింది. అందుకు మానస్ నాక్కూడా బ్లూ కలర్ అంటే ఇష్టం అని చెప్పాడు.

వీళ్ళు ఈ రీతిగా మాట్లాడుకుంటుండగా శ్రీరామ్ సిరి ప్రియా లు వీళ్లను గమనించడం మొదలు పెట్టారు. ఇది గమనించిన మానస్ వాళ్లను ఉడికించడానికి ఇంకా రొమాంటిక్ మాటలు మాట్లాడడం మొదలు పెట్టాడు. వీళ్ళు ఈ రకంగా మాట్లాడుకుంటుండగా శ్రీరామ్ వీళ్ళ దగ్గరికి వెళ్లాడు. ఆ సమయంలో మానస్ లహరి ని పడుకుంటావా అని అడిగి ఓకే గుడ్ నైట్ అని దగ్గరికి తీసుకొని హాగ్ చేసుకున్నాడు. ఇది చూసిన శ్రీరామ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత లహరి నా బెడ్ వరకు రా అని మానస్ ను అడిగింది.

మానస్ లహరి వెంట ఆమె బెడ్ వరకు వెళ్ళాడు లహరి మైక్ తీసేసి మానస్ ను గట్టిగా హగ్ చేసుకుంది. మానస్ కూడా గట్టిగా హగ్ చేసుకుని గుడ్ నైట్ చెప్పాడు.ఆ తర్వాత మానస్ లహరి లు మాట్లాడుకుంటూ మానస్ లహరి చేతికి మసాజ్ చేస్తూ కనిపించారు. ఇదంతా చూసిన మిగితా హౌస్ మెట్స్ షాక్ అయ్యారు. ఇదంత శ్రీరామ్ ను ఎడ్పించడానిక లేదా కావాలని చేశారా అనేది ముందు ఎపిసోడ్ లో తెలుస్తుంది.

ఆ తర్వాత బూమ్ బద్దలు సాంగ్ కి స్టెప్పులు వేశారు అమ్మాయిలు డాన్స్ తో రచ్చ చేశారు. తర్వాత లోబో ఉమాదేవి లు రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉండగా అని మాస్టర్ వచ్చి మీ కొత్త ట్రాక్ చూడలేక పోతున్నాం అనేసింది. దాంతో ఉమాదేవి ఇది ఇప్పటిది కాదు ఎప్పటి నుండో ఉందని అనడం తో రవి మధలో దూరి ఉమా మీరు యాక్టింగ్ చేస్తున్నారు అని గాలి తీసేసాడు. బిగ్ బాస్ లో జరగుతున్న ఈ అందమైన ప్రయాణం ప్రేక్షకులను విపరీతంగ ఆకట్టుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *