Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో ఘాటు రొమాన్స్ ఎవరి మధ్య అంటే.

News

ఈసారి బిగ్ బాస్ లో సమయం సందర్భం లేకుండా కిస్సులు హగ్గులు ఇంకా మితిమీరితే బాత్ రూం లోకి దూరటాలు చూడటానికి విరక్తి కలిగే ఎన్నో వికృత చేష్టలు జరుగుతున్నాయి, ఇలా చేస్తుంది ప్రేమికులో భార్య భర్తలో కాదు ఫ్రెండ్షిప్ అనే ముసుగులో సాగిస్తున్న వికృత చేష్టలు ఇవి.

బిగ్ బాస్ సీజన్ 5 ఎనిమిదో వారానికి చేరుకోగా ఇంటి కెప్టెన్ కొరకు అభయ హస్తం అనే టాస్క్ ను ఇచ్చాడు. దీంట్లో ఐదు చాలెంజ్ లలో గెలుపొందిన ఐదుగురు ఇంటి సభ్యులు క్యాప్టెన్ పోటీకి అర్హులు అవుతారు. ఇక ఇప్పటికే సిరి షణ్ముఖ్ శ్రీరామ్ పోటీలలో గెలిచి క్యాప్టెన్ పదవికోసం రేసులో ఉన్నారు. ఈ టాస్క్ ప్రారంభమైనప్పటి నుండి ఇల్లు లాక్ డౌన్ లో ఉంది అని బిగ్ బాస్ తెలపగా గెలిచిన వారు తప్ప మిగిలిన వారందరూ గార్డెన్ ఏరియాలోని ఉన్నారు అక్కడే వారు చాపలు దిండ్లు వేసుకొని బయటే పడుకుండిపోయారు. అలా బయట పడుకున్నా సన్నీ బిగ్ బాస్ నీకు మనసు లేదు అంటూ విమర్శించాడు.

ఇక మిగిలిన ఇంటి సభ్యుల మధ్య లో కెప్టెన్సీ పోటీలో ఎవరు టాస్క్ లో పాల్గొనాలి అనే చర్చ నడిచింది. ఆ పోటీలో తొలుత జెస్సీ ఆడనని చెప్పి ఆ తర్వాత ఆడుతాను అంటూ ముందుకు వచ్చాడు. ఇంతలో అనీ మాస్టర్ ముందుకొచ్చి నేను డ్రాప్ అయి నా స్థానం నీకు ఇస్తాను నువ్వు ఆడు అని జెస్సీ తో అనగా జెస్సీ పర్వాలేదు మీరే ఆడండి అంటూ డ్రాప్ అయ్యాడు. అప్పుడు షణ్ముక్ నీకు హెల్త్ బాలేక డ్రాప్ అవుతున్నాను అని చెప్పు కానీ ఎవరో డ్రాప్ అవుతున్నారని డ్రాప్ అవ్వకు అన్నాడు. చివర్లో సన్నీ జెస్సి తో నేను డ్రాప్ అవుతాను నువ్వు టాస్క్ ఆడు అని చెప్పాడు.

ఇక నాలుగవ ఛాలెంజ్ లో అనీ మాస్టర్ పింకీ లు పోటీ పడ్డారు టాస్క్ లో భాగంగా ఏర్పాటు చేయబడిన క్యాన్వాస్ పైన ఎవరి రంగుల అయితే ఎక్కువగా కనిపిస్తాయి వారే గెలిచినట్లు అని బిగ్ బాస్ అనగా పింకీ పై అని మాస్టర్ విజయం సాధించింది.
ఇక ఆ తర్వాత ఐదవ చాలెంజ్ లో సన్నీ కాజల్ లో పోటీపడగా సన్నీ విజేతగా నిలిచాడు ఇక కెప్టెన్సీ పోటీ కొరకు కావాల్సిన ఐదుగురు సిరి షణ్ముఖ్ శ్రీరామ్ ఆని సన్నీ పోటీదారులుగా ఎంపిక చేయబడ్డారు.

ఇక ఇల్లు అంతా లాక్ డౌన్ లో ఉండగా మొదట కెప్టెన్సీ పోటీ కొరకు ఎంపిక చేయబడ్డ సిరి షణ్ముక్ లు మాత్రమే ఇంటి లోనికి ప్రవేశించారు ఇక ఇంటి లోకి ప్రవేశించిన వారు సరసాలాడటం మొదలుపెట్టారు, షణ్ముఖ్ ను కొడుతూ తిడుతూ ఓవరాక్షన్ చేసింది ఇంకా షణ్ముక్ ను సారీ చెప్పమని మీది మీది కి వెళ్లగా హగ్ చేసుకున్నాడు, దీంతో సిరి నేను సారీ చెప్పమన్నాను కౌగిలించుకో మన లేదు అని అనడంతో. నా సారి ఇలాగే ఉంటుందని సమాధానమిచ్చాడు. అందుకు సిరి నీ సారీ బొక్క లాగా ఉంది అని చిరాకు పడింది.

Bigg Boss 5 Telugu

ఆ తర్వాత మళ్ళీ తానే షణ్ముక్ దగ్గరకు వెళ్లి హగ్ చేసుకొని సారీ చెప్పమంటూ రొమాన్స్ చేసింది. ఇక మీరు చేసే ఈ వెకిలి చేష్టలు చూసినా ప్రేక్షకులకు వీలు బిగ్ బాస్ ఇంటిలోనికి వచ్చింది ఆట ఆడడానికి లేదా రొమాన్స్ చేయడానికా అన్న సందేహాలు కలుగుతున్నాయి. పైకి ఫ్రెండ్స్ అని చెప్తూ లవర్స్ చేసే పనులన్నీ వీరు చేస్తున్నారు ఒకే దుప్పట్లో దూరడం.ఒకే బెడ్ పై పడుకోవడం. మొన్నటి వరకు మామూలుగానే ఉన్న వీరు గత రెండు రోజుల నుండి మితిమించిన రొమాన్స్ చేస్తూ అరాచకాన్ని సృష్టిస్తున్నారు. బిగ్ బాస్ కెమెరాలు కూడా వీరిని చిత్రీకరించే పనిలో బిజీగా ఉంటున్నాయి. బహుశా బిగ్ బాస్ పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నాడని చాలామంది అనుకుంటున్నారు.

ఇక మొదటి ఐదు చాలెంజ్ లలో విజయము సాధించని పోటీదారులకు చివరిగా ఒక అవకాశం ఇచ్చాడు ఒక సర్కిల్లో బంతిని ఉంచగా ఇద్దరు పోటీదారులు ఆ బంతిని పట్టుకునే ప్రయత్నం చేయాలి అలా పట్టుకున్న వ్యక్తి అవతల వ్యక్తిని పోటీ నుంచి ఎలిమినేట్ చేసే అవకాశం పొందుతాడు. దీంతో వరుసగా ఐదు సార్లు బంతిని పట్టుకున్న మానస్, విశ్వ రవి లోబో కాజల్ ప్రియాలను పోటీ నుండి తప్పించి క్యాపిటన్ పోటీ కొరకు సిద్ధమయ్యారు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఈ ఆరు టాస్క్ లో గెలిచిన ఆరుగురు కెప్టెన్ పదవి కోసం పోటీ పడనున్నార

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *