bigg-boss-5-telugu-shanmukh-jaswanth

Bigg Boss 5 Telugu: ఇలాగే ఉంటే నెక్స్ట్ ఎల్మినేట్ అయ్యేది షణ్ముఖే. షణ్ముఖ్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రేక్షకులు.

Trending

స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ లో ప్రతి సీజన్లో లాగా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ఎవరో ఒక వ్యక్తిని ఇంటి సభ్యుడిగా ఎంపిక చేయడం ఆనవాయితి ఉన్నట్టు మనందరికీ తెలుసు, అప్పుడప్పుడు ఈ సోషల్ మీడియా స్టార్లు ఒకరికంటే ఎక్కువమంది ఎంపికైన సందర్భాలు కూడా ఉన్నాయి, ఈ సీజన్లో చూసుకుంటే షణ్ముక్ , సరయు సోషల్ మీడియా ద్వారా పేరు సంపాదించుకొని బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టిన వారే.

సరయు కంటే ఎంతో కాలం నుండి పరిచయం ఉన్న వ్యక్తి షణ్ముఖ్ , గత బిగ్ బాస్ సీజన్ 2 లో ఇంటి సభ్యురాలిగా ఉన్నా దీప్తి సునైనా షణ్ముఖ్ ఎవరో కూడా తెలియని ప్రేక్షకులకు ఆయన గురించి చాలాసార్లు ప్రస్తావిస్తూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో షణ్ముఖ్ పబ్లిసిటీ విపరీతంగా పెంచేసి షణ్ముక్ అంటే ఎవరు తెలుసుకునేలా చేసింది.

షణ్ముఖ్ 2013లో ది వైవా అనే షార్ట్ ఫిలిం తో సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు, ది వైవా షార్ట్ ఫిలిం అప్పట్లో నంబర్ వన్ షార్ట్ ఫిలిం గా ఎదిగింది , ఆ షార్ట్ ఫిలింలో నటించిన కొంతమంది ప్రస్తుతం ఏదో ఒక ప్రాంతములో సినీ పరిశ్రమతో బిజీగా ఉన్నారు.

ఇక ఈ షార్ట్ ఫిలిం తో సక్సెస్ సాధించిన షణ్ముఖ్ గత ఏడేళ్లుగా రకరకాల షార్ట్ ఫిలిం తీస్తూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ అందుకున్నాడు, ఇక తాజాగా విడుదలైన సాఫ్ట్వేర్ డెవలపర్ మరియు సూర్య షార్ట్ ఫిలిం లు 10 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించుకోగా గొప్ప క్రేజ్ సంపాదించుకున్నాడు షణ్ముఖ్. ఇక ఇవే కాకుండా కొన్ని ప్రైవేట్ సాంగ్స్ మరియు కవర్ సాంగ్స్ కి డాన్స్ చేస్తు సోషల్ మీడియాలో స్టార్ గా ఎదిగాడు. ఇక ఆయనకున్న ఫాలోయింగ్ బిగ్ బాస్ ను ఆకర్షించి ఈసారి బిగ్ బాస్ ఇంటి సభ్యుడిగా ఎంపిక చేసేలా చేశాడు.

ఇక బిగ్ బాస్ సీజన్ 5 ఎనిమిదో వారానికి చేరుకోగా ఇంటి కెప్టెన్ గా ఎంపికయ్యాడు షణ్ముఖ్. అయితే షణ్ముక్ ఈ సీజన్ ఆరంభం నుండి సిరి జెస్సి లతో గ్రూపు గా ఉంటూ అవతల వ్యక్తిని స్టడీ చేస్తున్నట్టుగా మైండ్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తున్నాడు.

గత ఏడు వారాల్లో ఏడు మంది ఎలిమినేట్ కాగా ప్రస్తుతం 12 మంది ఇంటి సభ్యులు ఉన్నారు అయితే సాధారణంగా సిరి తో మాట్లాడినట్టు వేరే వ్యక్తులతో మాట్లాడనీ షణ్ముక్ ఈ వారంలో క్యాప్టెన్ అయ్యాడు . అయితే ఆయనతో ఎక్కువ పరిచయం లేని మిగతా వ్యక్తులు ఆయనతో ఎలా మెదులుకుంటారో నని చర్చనీయాంశంగా ఉంది.

అయితే షణ్ముక్ క్యాప్టెన్ అవ్వడానికి ముందు ఆయన ఇచ్చిన ప్రదర్శన ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగించింది . మరో మాటలో చెప్పాలంటే సిరి షణ్ముఖ్ లు చేస్తున్న వ్యవహారాల వల్ల షణ్ముక్ ఆదరణ కోల్పోతున్నటు తెలుస్తుంది.

తాజాగా ఒక ప్రైవేట్ వెబ్సైట్ నిర్వహించిన సర్వే ప్రకారము ఎల్లప్పుడూ ఎలిమినేషన్ విషయంలో సేవ్ అవుతున్న కంటెస్టెంట్ లో మొదటి వ్యక్తి గా ఉండే షణ్ముఖ్ రెండవ స్థానానికి దిగిపోవడం సర్వేలో వెల్లడయింది, ఇక ఆయన స్థానాన్ని రామచంద్ర తీసుకున్నాడు, ఇక ఈ పతనానికి కారణం అవుతున్న సిరి అదే సర్వే లో నెక్స్ట్ ఎలిమినేట్ కు సిద్ధంగా ఉన్న వ్యక్తిగా డేంజర్ జోన్లో ఉన్నారు.

bigg-boss-5-telugu-shanmukh-jaswanth

శనివారం టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో నాగార్జునగారు షణ్ముఖ్ కు ఆయన ప్రవర్తన మార్చుకోమని కొన్ని ముఖ్యమైన సూచనలు ఇచ్చారు.ఇక ప్రస్తుతం షణ్ముక్ ఇంటి క్యాప్టెన్ అవ్వడంతో మరొక వారం ఆయన ఎలిమినేషన్ నుండి సేవ్ చేయబడ్డాడు అయితే ఇకనైనా ఆయన కొన్ని అనవసరమైన వ్యవహారాల్లో తలదూర్చి ఆయన గ్రాఫ్ ఆయన పడిపోకుండా చుసుకుంటాడేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *