bigg-boss-5-telugu-siri

Bigg Boss 5 Telugu Siri: సిరి పెళ్లి కాకుండానే తల్లయింది… అందుకే ఆమెను నామినేట్ చేయడం లేదు..

Trending

బిగ్ బాస్ హౌస్ లో పోటిదరులందరి నుండి విమర్శలు అందుకుంటున్న అమ్మాయి సిరి హనుమంతు, ఇంటిలో గట్టి పోటీ దారులలో ఆమె ఒకరు. ఇంటి పనులలో నైన టాస్క్ ఆడటం లో నైన వెనకడుగు వేయకుండా మంచి ప్రవర్తన కనపరుస్తూ ఉంటుంది. కొంతమంది ఇంటి సభ్యులు తాను సేఫ్ గేమ్ ఆడుతుంది అంటూ ఆమెను నిందిస్తున్నారు.

షణ్ముక్ కి ఆమెకు ఇంతకు ముందు నుండే పరిచయము ఉండటంతో వీరిద్దరూ ఇంటి లోనికి రావడానికి ముందే ప్లాన్ వేసుకున్నారని ఆ ప్లాన్ ప్రకారమే సేఫ్ గేమ్ ఆడుతున్నారని విమర్శలు అందుకుంది. ఆ విమర్శలకు ఎన్నోసార్లు సిరి స్పందిస్తూ గడుసుగా సమాధానం ఇస్తూ వచ్చింది, మరియు తాను నామినేషన్ చేసే సమయంలో కూడా ఇంతే గడుసుతనం మిగతా పోటీదారుల పైన కనుపరిస్తు ఉంటుంది.

bigg-boss-5-telugu-siri

అయితే వాస్తవానికి తన వ్యక్తిగత జీవితంలో సిరి బిగ్ బాస్ షోలో కనిపించేంత గడుసుది కాదు. అవతల వ్యక్తిని అర్థం చేసుకునే మంచి మనస్తత్వము ఆమెకు ఉంది. ఆ చక్కటి మనసే ఆమె కష్టానికి పలితం ఇస్తు వచ్చింది.

నేడు ఆమె బిగ్ బాస్ షో లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లా పోటీ ఇస్తున్న ఆమె వ్యక్తిగత జీవితంలో తాను తీసుకున్న కొన్ని గొప్ప నిర్ణయాలు సాధారణమైన వ్యక్తి మనసును కదిలించే విధంగా ఉన్నాయి.

తన కెరియర్ ప్రారంభంలో విశాఖపట్నం లో రకరకాల న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్గా పని చేసింది , చివరగా టీ న్యూస్ ఛానల్ లో రెండేళ్ల పాటు పనిచేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

తనకు కొద్దో గొప్పో పేరు వస్తున్న తరుణంలో న్యూస్ రీడర్ గా ఉంటూనే టీవీ కార్యక్రమాల్లో కనిపించాలని అనుకుంది. ఆ ఆలోచనకు అనుగుణంగా ప్రయత్నాలు ఎన్నో చేసింది. చివరకు ఆమెకు స్టార్ మా లో ప్రసారమైన ఉయ్యాల జంపాల సీరియల్ లో నటించే అవకాశం పొందుకుంది. దీంతో తెలుగు ప్రేక్షకుల గుర్తింపు సంపాదించుకుంది, ఆ తర్వాత ఎవరు నువ్వు మోహిని, అగ్నిసాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి వంటి సీరియల్ లో నటించిన ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

ఇక ఆ ట్రెండ్ తోనే వెండితెరమీద నటించే అవకాశం పొందుతుంది . రాజ్ తరుణ్ నటించిన సినిమాలతో తన సినీ ప్రస్థానం మొదలు పెట్టింది ఇద్దరి లోకం ఒకటే , ఒరేయ్ బుజ్జి గా అనే సినిమాల్లో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది.

హీరోయిన్ గా కొనసాగుతున్న ఆమె సినిమాలే కాక సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కలిగి ఉంది. హే సిరి యూట్యూబ్ ఛానల్ లో రకరకాలైన వెబ్ సిరీస్ లు చేసి అతికొద్ది సమయంలోనే 5 లక్షల చందాదారులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో తాను విడుదల చేసిన షార్ట్ ఫిలింలో మరియు వెబ్ సిరీస్ లో ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి.

ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్న ఆమె బిగ్ బాస్ 5 లో కూడా రాణించడానికి ఎంపికయ్యారు ప్రస్తుతం ఆమె టాప్ ఫైవ్ పోటీదారులలో ఉండే అంతా కీలకమైన పోటీదారు గా ఆట ఆడుతున్నారు.

ఇంటి సభ్యులలో ఆమె గతం గురించి ఆమె కష్టం గురించి తెలిసిన చాలామందికి ఆమె స్పూర్తిగా ఉంటున్నారు, ఒకానొక సందర్భంలో అని మాస్టర్ నామినేషన్ ప్రక్రియ లో సిరి గురించి చెప్తూ విశాఖపట్నం నుండి ఒంటరిగా హైదరాబాదుకు వచ్చి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఇంత గొప్ప స్థాయికి ఎదిగిన సిరి అంటే నాకు ఇష్టం నేను ఆమెను నామినేట్ చెయ్యను అని అన్నారు. దాంతో అటు ప్రేక్షకులకు ఇటు ఇంటి సభ్యులకు తానంటే గౌరవం మరింత పెరిగింది.

మరో సందర్భంలో ఆమె బిగ్ బాస్ షో లో ఉండగా బిగ్ బాస్ ఒక వీడియోను చూపించగా ఆ వీడియోలో సిరిని ఒక చిన్నారి మమ్మీ అని పిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ వీడియోలో చిన్నారి వాస్తవానికి తన సొంత బిడ్డ కానేకాదు ఆ చిన్నారిని దత్తత తీసుకొని పెళ్లికాకముందే ఒక తల్లి గా మారి బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇలాంటి గుణమున్న సిరి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.

ఈ చక్కటి అందమైన మనసు కలిగిన సిరి కి బిగ్ బాస్ ఇంట్లో రాణించేందుకు సహాయపడాలి అనుకుంటే డిస్నీ హాట్ స్టార్ యాప్ ద్వారా కానీ టీవీ ఫైవ్ స్క్రోల్ అవుతున్న 8886658201 నంబర్కు కానీ మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *