గత సీజన్ లో లాగా ఈ సీజన్ లో కూడా ఒక ట్రాన్స్ జెండర్ నీ ప్రోత్సహిస్తున్నారు మన తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు.
ఈ విధమైన ప్రోత్సాహం మరే బాషలో లేదు. అదే విధంగా యూట్యూబ్ స్టార్ మరియు చిన్న సినిమా స్టార్లను కూడా ఎంకరేజ్ చేస్తూ వారికి మంచి భవిష్యత్ ఇస్తున్నారు బిగ్ బాస్. పూర్తి 19 మంది పోటీదారుల లో సుమారు 08 మంది వరకు చిన్న చిన్న ప్లాట్ ఫాం లో నుండి పైకి వచ్చిన వారే అందుకే ఈ సారి కంటెస్టెంట్లను చాలా మట్టుకు ప్రేక్షకులు గుర్తించలేక పోతున్నారు.

ఇలా చిన్న యాక్టర్ లలో మనం బిగ్ బాస్ హౌస్ లో ఊహించని వ్యక్తి ప్రియాంక సింగ్ (జబర్దస్త్ సాయి తేజ). బిగ్ బాస్ సీజన్ 5 లో 3 వ ఎపిసోడ్ లో తానెందుకు అలా మారిందో చెప్తూ ఇంట్లో అందర్నీ కంటే తడి పెట్టించింది. తాను పుట్టినప్పుడు తన తల్లి దండ్రులు సాయి తేజ అని పేరు పెట్టారని కానీ చిన్నప్పటి నుండి అమ్మాయి ల ఉండాలని ఉండేదని చెప్పుకొచ్చింది. తన టాలెంట్ ను గుర్తించి మంచి లైఫ్ ఇచ్చిన షో జబర్దస్త్ అని చెప్పింది.
ఇంక తను బిగ్ బాస్ ఇంట్లో ఎంటర్ అయే మొదటి రోజు తన ఇంట్రడక్షన్ వీడియోలో తనను తాను చుస్కొని తన లైఫ్ సక్సెస్ అయినందుకు సంతోష పడ్డారు. ఆ తర్వాత తను మాట్లాడుతూ నాగార్జున గర్ని గ్రీక్ వీరుడు సినిమా షూటింగ్ లో చూశానని అప్పటికి ఇంకా ఆపరేషన్ చేసుకోలేదు అప్పటికి ఇంకా సాయి తేజ గా ఉన్నానని ఇప్పుడు ప్రియాంకా సింగ్ గా మారాను అని తెలియ జేసింది. నువ్వు చాలా మందికి ఆదర్శం అని నాగార్జున గారు ప్రశంసించారు.

అయితే ప్రియాంక తనకు చిన్నప్పుడు నుండి అమ్మాయిలాగా ఉండాలని ఉండేది అని చెప్పుకొచ్చింది కానీ తన కుటుంబ సభ్యుల దృష్టికి ఈ విషయాన్ని ఎన్నడూ కూడా తీసుకు వెళ్లలేదని చెప్పింది తనకు ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నయ్యలు ఒక చెల్లి ఉన్నారు అని చెప్పింది తనకంటే పెద్ద వారికి మరి తన చెల్లెకు పెళ్లిళ్లు అయ్యాయని చెప్పింది. తన వివాహము గురించి ప్రసక్తి వచ్చినప్పుడు తనకు తన చిన్నప్పటి నుండి ఉన్న నా భావన వల్ల తాను వివాహం చేసుకుని ఒక అమ్మాయి జీవితాన్ని పాడు పాడు చేసినట్టు అవుతుందని వివాహం చేసుకోలేదని చెప్పింది. నా పరిస్థితి నా స్నేహితురాలికి చెప్పినప్పుడు తాను నేను రాత్రికి రాత్రే అమ్మాయి గా మారామని చెప్పింది.
మరియు తన తండ్రికి తన వివాహము ఘనంగా చేయాలని ఉంది అని చెప్పుకొచ్చింది తన తండ్రి ల్యాబ్లో అటెండర్గా పనిచేసే వారని ల్యాబ్ లో ఎక్స్పరిమెంట్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు యాసిడ్ కళ్ళలో పడి తన తండ్రి కంటిచూపు కోల్పోయాడని చెప్పింది. తాను ఇలా ట్రాన్సజెండర్ గా మారాను అని తన తండ్రికి తెలియదని చెప్పు వచ్చింది అయితే ఈ బిగ్ బాస్ షో ద్వారా ఒక మంచి అవకాశం దొరికిందని తన తండ్రికి ఈ షో ద్వారా తన పరిస్థితిని తెలియజేస్తానని బిగ్ బాస్ షో లో ఒక ప్లాట్ ఫామ్ ఇచ్చిందని చెప్పింది.
కానీ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని ఎవరికీ చెప్పుకునే దాన్ని కాదని ఆమె చెప్పుకొచ్చారు. నాకు ఇద్దరు అక్కలు, అన్నయ్యలు, ఒక చెల్లి ఉన్నారని . తన కంటే పెద్దవారికి, చెల్లి కి అందరికీ పెళ్లిళ్లు చేసేశారని.. నాకు కూడా పెళ్లి చేయాలనుకుంటే నా వల్ల ఓ అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదని పెళ్లి చేసుకోలేదు అని చెప్పింది..నేను రాత్రికి రాత్రే అమ్మాయి గా మారానని ప్రియాంకా సింగ్ చెప్పారు. తన నాన్న ఒక లాబ్ లో అటెండర్ గా పని చేసేవారని చెప్పింది.

నాగార్జున గారు తన బాధను గమనించి మీ నాన్నగారు నిన్ను అర్థం చేసుకుంటారు అని ఓదార్చారు. ఇదే వేదికను ఉపయోగించుకుని తన ట్రాన్స్ జెండర్ గా మారాలంటే అని తన తండ్రికి అర్థమయ్యేలా చేస్తానని స్టేజిపైన కన్నీరు పెట్టుకున్నారు కానీ తను తన అమ్మ సపోర్టుతో ఇలా మారానని అని చెప్పుకొచ్చింది.
