బిగ్ బాస్ షో లో ఊహించని పరిణామలెన్నో జరుగుతుంటాయి, ఒకరికి అవి నచ్చ వచ్చు మరొకరి నచ్చాక పోవొచ్చు కానీ ఆట మాత్రం జరిగి తీరుతుంది. ఎలిమినేషన్ అనే ముఖ్య ఘట్టం లో మాత్రం నియంత్రణ ప్రజల చేతిలోకి వెళ్లి పోతుంది. బిగ్ బాస్ ఇంట్లో నీ పోటీదారులను కాపాడం లేదా ఎలిమినేట్ అయ్యేలా చేయడం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది.
పోటీదారులు నామినేషన్ లో నిలిచినప్పుడు వారికి వచ్చిన ఓట్లను బట్టే ఎవరు ఆట నుంచి నిష్క్రమించబోతు ఉన్నారో తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 5 కూడా సుమారు ఐదుగురు పోటీదారులను ఇప్పటికే ఎలిమినేట్ చేసేసింది. తాజాగా ఈ వారంలో లో మంచి పోటీని ఇచ్చిన శ్వేతా వర్మ ను కూడా ఎలిమినేట్ చేసింది అయితే ఈమె ఎలిమినేషన్ ప్రజలు ఎవరికి కూడా సమ్మతంగా లేదు .
ఈ వారంలో లో చంద్ర సిరి లోబో విశ్వ షణ్ముఖ్ ప్రియాంక సన్నీ శ్వేత రవి జెస్సి ఉండగా వీరిలో శ్వేత మాత్రం ఎలిమినేట్ అయ్యారు, ప్రేక్షకుల వాదన ప్రకారం శ్వేతా కంటే వీక్ కంటెస్టెంట్స్ మరియు ప్రజలను ఎంటర్టైన్ చేయనటువంటి వారు ఉండగా ఈమెనే ఎందుకు చేశారు అనే అనుమానం వ్యక్తపరుస్తున్నారు.
శ్వేత ప్రతి టాస్క్ లో చురుగ్గా ఉంటుంది హౌస్ లోని కొంతమంది వ్యక్తులు ఆమె లాంటి ప్రదర్శన లేని వారు ఉన్నారు . టాస్క్ ఇచ్చినప్పుడు పూర్తిస్థాయిలో ఆడకుండా ఉన్న వారిని వదిలేసి శ్వేతా ని ఎలిమినేట్ చేయడం సబబు కాదని నేటి జనులు అనుకుంటున్నారు.
మిగతా వారితో పోల్చి చూసుకుంటే శ్వేత ఎంతో బెటర్ అని టాప్ ఫైవ్ లో పోటీ చేయగల సత్తా శ్వేతా కచ్చితంగా ఉంది కానీ పోటీ లో మంచి వ్యక్తులను దూరం చేయడము బిగ్ బాస్ కి అలవాటు అయిపోయింది అని విమర్శిస్తున్నారు ప్రేక్షకులు.
ఈసారి జరిగిన ఎలిమినేషన్ ప్రేక్షకుల ఓట్ల వల్ల జరిగినట్లయితే శ్వేత ఖచ్చితంగా ఎలిమినేట్ కాకపోయేది అని ఇదంతా బిగ్ బాస్ చేతిలో ఉన్న నిర్ణయమే అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కూడా బిగ్ బాస్ సీజన్ 4 లో దేవి నాగవల్లి విషయంలో కూడా ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా ఆమెను ఎలిమినేట్ చేశారని ప్రేక్షకులు మరొకసారి ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకున్నారు.
ఇక స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు ఎవరు లేని బిగ్ బాస్ షో ఎవరు చూస్తారు అంటూ అభిమానులు నెట్టింట్లో చర్చలు జరుపుతున్నారు.
చివరగా ఎంతో మందికి శ్వేత మళ్లీ హౌస్ లోకి వస్తే బాగుండు అనిపించిన తరుణంలో బిగ్ బాస్ ఆమెను సీక్రెట్ రూమ్ కి పంపు అని నమ్మకం ఉండింది కానీ లోబో ను సీక్రెట్ రూమ్ కి పంపి ప్రజల ఆశలను అడియాశలు చేశాడు.