Bihar patna girl

చనిపోయినప్పుడు ఒక్కడు రాలేదు కానీ దినం రోజు ఏకంగా 150 మంది వచ్చారు.. బీహార్ లో జరిగిన ఈ సంఘటన అనేకులకు కంటతడి పెట్టిస్తుంది.

News

కరోనాతో తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కనీసం ఒక్కరు కూడా ఆ ముగ్గురు చిన్నారులను ఓదార్చడానికి రాలేదు కానీ దినం రోజు మాత్రం ఏకంగా 150 మంది తినడానికి వచ్చారు.బీహార్ లో జరిగున ఈ సంఘటన మనుషులల్లో అసలు మానవత్వం అనేది ఉన్నదా? అనే ప్రశ్నను రేకెత్తిస్తుంది.

బీహార్ లో అరియా జిల్లాలో బిష్ణుపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు సోని(18), నితీష్(14), చాందిని(12)లు. కరోనా సోకిన ఇద్దరు తల్లిదండ్రులను ఒకే వారంలో పోగొట్టుకున్నారు.అయితే ఎవరు కూడా ఆ శవాలకు అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాకపోవడంతో వారి సొంత స్థలంలోనే ఆ శవాలను పాతిపెట్టారు వారి పిల్లలు.కానీ దినం రోజు ఏకంగా 150 మంది తినడానికి రావడమే కాకుండా తల్లిదండ్రుల చికిత్స కోసం తమ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను వెంటనే తిరిగి ఇచ్చేయాలని గొడవ చేసారు. అమాయకులైన ఆ ముగ్గిరి నుండి డబ్బులు తీసుకొని ఎవరి వాటా వారు పంచుకోవడం చాలా మందిని కంటతడి పెట్టిస్తుంది.

బీహార్ రాజధాని పాట్నా నుండి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిష్ణుపూర్ గ్రామ పంచాయితి లో 14 వార్డులు ఉన్నాయి. సోని తల్లిదండ్రులు – 46 ఏళ్ల బీరేంద్ర మెహతా మరియు 38 ఏళ్ల ప్రియాంక దేవి – 373 ఇతర కుటుంబాలతో 7 వ వార్డులో నివసిస్తూ ఉండేవారు. ఈ నెల ప్రారంభంలో,ఈ వార్డ్ ఏడు కోవిడ్ కేసులను నివేదించింది, వాటిలో బీరేంద్ర మరియు అతని భార్య కూడా ఉన్నారు. మిగతా ఐదుగురు రోగులు ఇప్పటికీ ఇంటి నిర్బంధంలో ఉన్నారు.

Bihar

“మా తల్లిదండ్రుల చికిత్స కోసం డబ్బును ఏర్పాటు చేయడానికి మేము మా రెండు మేకలను 11,000 రూపాయలకు మరియు మా ఆవును 10,000 రూపాయలకు అమ్మడం జరిగింది” 18 ఏళ్ల సోని కుమారి చెప్పారు. “కానీ 2,50,000 రూపాయలు ఖర్చు చేసిన తరువాత కూడా (వారు మిగిలిన డబ్బును అరువు తీసుకున్నారు), మేము మా తల్లిదండ్రులను కాపాడుకోలేకపోయాము.” అని సోని అన్నారు.

“మా తండ్రి మరణించిన తరువాత, ఎవరూ మాకు లోన్ ఇవ్వరు ఎందుకంటే మా తండ్రి ఒక్కడే కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి, మరియు అతని మరణం తర్వాత, మేము రుణం తిరిగి ఇవ్వగలమా అని బయపడ్డాము. రాణిగంజ్ ఆసుపత్రిలో మా తల్లి చికిత్సను నిలిపివేయవలసి వచ్చింది, మరియు ఆమె కూడా మే 7 న కన్నుమూసింది, ”అని సోని టీవీ ఛానెల్ ఇంటర్వ్యూ లో చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *