బిగ్ బాస్ ఫినాలే కు బాలీవుడ్ తారలు

Movie News

స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంటి సభ్యులలో అందరూ ఎల్మినెటయి అయిదు గురు మాత్రమే మిగిలారు. గత ఆదివారం కాజల్ ఎలమినేషన్ తో బిగ్ బాస్ షో చివరి వారం లోకి అడుగు పెట్టింది. వచ్చే ఆదివారం బిగ్ బాస్ సీజన్ 5 చివరి ఎపిసోడ్ లో విజేత ఎవరో బిగ్ బాస్ ప్రక్తించ బోతారు. ఇక ఆ రోజు ఎపిసోడ్ కోసం ఎంతో మంది అభిమానులు కళ్ళు కాయలు కసేల ఎదురుచూస్తున్నారు.

ఇక ఫినాలే రోజు ఉండే సందడి అంత ఇంత కాదు ఒకే స్టేజ్ పై బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ కనిపిస్తారు అలాగే విజేతను అనౌన్స్ చేసేందుకు ప్రముఖ హీరో లేదా హీరోయిన్ వచ్చి కనుల పండుగగా సందడి చేస్తారు. అయితే ప్రతి సారి ఈ వేడుకకు మన తెలుగు ప్రముఖ నటులు ఆనవాయితీగా వచ్చారు , అయితే ఈ సారి మాత్రం రోటీన్ కు భిన్నంగా బాలీవుడ్ తారలు రవీర్ సింగ్ , దీపిక పదుకొన్ , అలియాభట్ వస్తున్నట్టు వార్త చక్కర్లు కొట్టేస్తుంది.

అయితే వీరి రాక వెనక కాశ్చితమైన కారణం ఉంది, ముఖ్యంగా మన తెలుగు సినిమాలకు ఉత్తరాన వస్తున్న క్రేజ్ చెప్పలేనిది. ఆ క్రేజ్ ను దిన దినము పెంచేలా నిర్ణయాలు తీసుకొని సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్లు డైరెక్టర్లకే ఆ క్రెడిట్ అంతా దక్కుతుంది. తాజాగా హిందీలో రణ్వీర్ సింగ్ హీరో గా నిర్మించబడుతుంది 83 సినిమా ఈ నెల 24 న విడుదలకు సిద్దంగా ఉంది, ఈ సినిమాకు పూర్తి తెలుగు రైట్స్ ను అన్నపూర్ణ స్టూడియోస్ సొంతం చేసుకున్నారు. ఇక మరో వైపు దేశం లో తెలుగోడి సత్త చూపెట్టిన దర్శక ధీరుడు నిర్మిస్తున్న RRR కూడా త్వరలో విడుదలకు రెడీగా ఉంది.

ఇక ఈ రెండు సినిమాలు త్వరలో విడుదల కానుండగా సినిమా ప్రమోషన్ కొరకు బిగ్ బాస్ స్టేజ్ వేదికగా మారింది. ఒకటేమో ప్యాన్ ఇండియా లెవెల్ సినిమా RRR మరొకటి నాగార్జున సొంత బ్యానర్ పైన నిర్మితమైన 83, ఇక ఈ సినిమాను ప్రమోట్ చేయటానికి ఆ సినిమా హీరో హీరోయిన్లు బిగ్ బాస్ స్టేజ్ అపి కనిపించనున్నారు. 83 సినిమా కోసం రణ్వీర్ సింగ్ మరియు దీపిక వస్తుండగా RRR కోసం రామ్ చరణ్ అలియాభట్ వస్తున్నారు.

ఈ రీతిగా మన తెలుగు కార్యక్రమంలో బాలీవుడ్ తారలు హంగామా చేయటం ఇదే మొదటి సారి అవుతుండగా ఆ ఫినాలే ఎపిసోడ్ ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆ రోజు ఎపిసోడ్ కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *