సమంత పై కేస్ నమోదు,మమ్మల్ని కామాంధులు అంటావా అంటూ…

Movie News

మొన్నటి వరకు తెలుగు ప్రేక్షకులు అఖండ సినిమా కొరకు పడిగాపులు కాచారు, ఇక ఆ సినిమా విడుదలై సంచలనం సృష్టించి ఏకంగా ప్రపంచ దేశాల్లో 100 కోట్ల మార్కును దాటేసింది. సినిమా ప్రపంచమంతట మంచి ప్రశంసలు కుడబెట్టుకున్న తర్వాత ప్రజలందరి కళ్ళు పుష్ప సినిమాపైన పడ్డాయి.

ఈనెల 17వ తారీఖున తెలుగు హిందీ మలయాళ తమిళ కన్నడ భాషల్లో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవ్వబోతున్న పుష్ప సినిమా తాజాగా ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జర్పుకొని ప్రేక్షకులలో హీట్ పెంచేసింది.  ఆంధ్ర ప్రదేశ్ లోని శేషాచలం అడువుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నే కథగా ఎన్నుకొని వివిధ భాషల్లో తెరకెక్కిస్తున్న 

ఈ సినిమా త్వరలో విడుదల అవబోతున్న సందర్భంగా సినిమా ప్రమోషన్ కోసం  చిత్ర బృందం గత కొద్ది రోజుల కిందట ట్రైలర్ తో పాటు సినిమాలోని రెండు పాటలను విడుదల  చేసింది.  అవన్నీ మంచి రెస్పాన్స్ అందుకొని మిలియన్ లలో వ్యూస్ ను సంపాదించుకున్నాయి. వీటితో చిత్ర బృందం ప్రేక్షకుల ఎదురు చూపులను మరింత పెంచేసింది.

ఇక ఈ సినిమా ప్రమోషన్ దృష్ట్యా రిలీజ్ చేసిన రెండు పాటలలో సమంత చేసిన ఐటెం సాంగ్ ఉ అంటావా మవా ఉఉ అంటావా అనే పాట బీభత్సంగా వైరల్ అయింది.  ఈ సాంగ్ ఎంత వైరల్ అయిందో అంతే కాంట్రవర్సీ అయింది. ముఖ్యంగా సమంత తన కెరియర్ లోనే మొదటి ఐటెం సాంగ్ ఇది. అలాగే మొనటి వరకు గొప్పింటి కోడలిగా మంచి పేరు కూడా బెట్టుకున్న అమే సడెన్ గా ఇలాంటి పాట ఎందుకు చేసిందనే కన్ఫ్యూజన్ అందర్లో నెలకొంది. ఎంత విడాకులు తీసుకున్న మళ్ళీ కెరియర్ బిల్డ్ చేసుకోటానికి ఇలాంటి పిచ్చి నిర్ణయాలు ఏంటి అని విమర్శిస్తున్నారు . విడాకుల సమయంలో సమంత క్యారెక్టర్ మంచిది కాదు అని వచ్చిన  పుకార్లు నిజమే అన్నట్టుగా సమంత ప్రవర్తిస్తుంటే ప్రేక్షకులు గతంలో వచ్చిన పుకర్లన్ని నిజమే అని నమెస్తున్నరు. ఇది తన కెరియర్ కే ఒక రిమార్క్ గా ఉండబోతుందని విమర్శిస్తున్నారు అభిమానులు.

ఇక ఒక పక్క ఈ విధంగా ప్రేక్షకులు చర్చించు కుంటుంటే మరో పక్క సమంత ఐటెం సాంగ్ చేసి మమల్ని కామందులుగా చిత్రీకరించింది అని కొంత మంది అమే పై కేస్ పెట్టారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరియు చంద్రబోస్ సాహిత్యం లో మగబుద్దే పడుబుద్ది అని రిలీజ్ చేసిన ఈ పాట పై పురుషు సంఘ సభ్యులు చాలా సీరియస్ అయ్యారు. 

సమంత తాను చేసిన ఐటెం సాంగ్ లో వాడిన లిరిక్స్ , సాహిత్యం , విజువల్స్ అన్ని మొగ వారినందరినీ కామాంధులు గా చుపెట్టే ప్రయత్నం చేశారని.  ఈ పాటను సినిమా లో నుండి  తీసేయాలని ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో పురుషుల సంఘం సభ్యులు దావా వేశారు. ఈ కేస్ ఇప్పుడు కోర్టు లో వాదనకు సిద్దంగా ఉంది. ఒక వేళ కోర్టు సినిమాలో మార్పులు చేయమని తీర్పు ఇస్తే మాత్రం సినిమా విడుదల అనుకున్న 17వ తారీకు జరగక పోవొచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *