Chinmayi Sripada

వ్య‌భిచారం లో తప్పు ఏమి ఉంది .. చిన్మ‌యి సంచ‌ల‌న వీడియో

News

తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు ప్రతి హీరోయిన్ కు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న ఆర్టిస్ట్ చిన్మాయి త్వరలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ద్వారా తొలి సారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకో బోతున్నారు.

2006 నుండి నేటి వరకు తెలుగు సరిగా మాట్లాడ లేనటువంటి ప్రతి హీరోయిన్ కు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసి తన నైపుణ్యంతో ఎన్నో అవార్డులు సంపాదించుకున్నారు ఈమెకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది ముఖ్యంగా తను మీటు ఉద్యమం ద్వారా మహిళల రక్షణ కొరకు చేపట్టిన కార్యాల వల్ల ఆమె క్యాతి ఇంకా పెరిగింది.

Chinmayi Sripada

ఒకవైపు సినిమాల్లో పాల్గొంటూ మరోవైపు ఆడపిల్ల పట్ల జరుగుతున్న అన్యాయాల గురించి సోషల్ మీడియాఎల్లో ఆక్టివ్ గా ఉంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది. అయితే కొంత మంది నెటిజన్లు ఆమె ఈ మీటు ఉద్యమం ద్వారా స్పందించే అంశాలను బట్టి అపుడప్పుడు ట్రోల్ చేస్తూ ఉంటారు.

కొన్నిసార్లు ఆమెను విపరీతమైన పదజాలంతో బూతులు తిడుతూ దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంటారు .తాజాగా చిన్మయి తనపై ప్రజలు వాడిన అసభ్యకరమైన మాటలకు ఆగ్రహం వ్యక్తం చేసి నెటిజనులకు తనపై చేస్తున్న ట్రోలింగ్ లకు ట్విట్టర్ వేదికగా సమాధానమిచ్చారు.

చిన్మయి చేసిన ఒక పోస్టుకు ఒక నెటిజనుడు బూతు మాటలతో కామెంట్ పెట్టాడు ఇక దానికి స్పందించి. ఆడవాళ్లను దుర్భాషలాడాలంటే లా… పదం వాడతారు. అదే మగవాడు స్టాడ్ అని పిలుస్తారు.
ఆడవాళ్లను పడక మీద సుఖపెడితే అదేదో సాధించినట్టు , వాడేదో గొప్పోడు అన్నట్టు స్టడ్ అనడం ఏందో ఆ దేవుడికే తెలియాలి.

వ్యభిచారం జరుగుతుందే మగవారి కోసం ఆ నీచ కార్యం కోసం అభంశుభం తెలియని అమ్మాయిలను, పిల్లలను కిడ్నాప్ చేస్తూ ఈ నీచ వృత్తిలో వాడుకుంటున్నారు , కంటికి కనబడకుండా ట్రాఫికింగ్ పేరుతో జరుగుతున్న ఆకృత్యాలెన్నో. తమ ఒళ్లు దాచుకోకుండా అమ్ముకుంటున్నా సెక్స్ వర్కర్లను కించపరుస్తున్న ప్రతివాడు దుర్మార్గుడే. ఎప్పుడైనా బలయ్యేది ఆడవారే కానీ ఆ వ్యభిచార గృహాన్ని నిర్వహించే మొగవాడు ఎవడు అని ఆరా తీయ్యారు.

మీరెవరు పత్తిత్తులు కాదు, ఎవరైనా వ్యభిచారాన్ని వదిలేసి సమాజంలో గౌరవంగా బ్రతుకుదాం అనుకున్నా వారిని గౌరవిస్తూన్నాము అన్నట్టు మాట్లాడకండి.. ఎన్నో ప్రాంతాల్లో కరువులకు తాళలేక , ఆహారం లేక పేదరికం వల్ల ఉన్న అనేక కుటుంబాలు అమ్మాయిలను అమ్ముకుంటున్నాయి, ఈ కరొన కష్టకాలంలో అయితే కొంతమంది తల్లిదండ్రులు తమ సొంత పిల్లల్ని అమ్మేశారు. సెక్స్ వర్కర్ సిగ్గు పడాల్సిన అవసరం లేదు ఎన్నో ప్రాంతాల్లో ఈ వృత్తి చట్టబద్ధంగానే కొనసాగుతోంది.

చట్టబద్ధంగా ఎన్నో ప్రాంతాల్లో జరుగుతున్న ఈ వృత్తిని ఒక బూతు లాగా ఎందుకు చూస్తున్నారు దాన్ని బూతుగా సృష్టించింది ఎవరు, ఆడవాళ్ళతో దేవాలయ పండుగలలో రికార్డింగ్ డ్యాన్సులు పెట్టించే సాంప్రదాయం మనది అలాంటప్పుడు సెక్స్ వర్కర్ లను చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు. అది నాకు నచ్చట్లేదు.

మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి కానీ ఈ వృత్తిలో లో కి వెళ్ళిన చాలామందికి తినడానికి తిండి లేక కట్టుకోడానికి బట్టలు లేక చివరి అవకాశంగా ఈ వృత్తిని ఎంచుకుంటారు. మనలో ఎంతో మందికి ఇలాంటి వృత్తి గురించి తలుచుకుంటే అసహ్యం వేస్తుంది. కాబట్టి నోరు మూసుకొని ఉండండి. ఏ వ్యక్తి యొక్క గౌరవం గాని వ్యక్తిత్వం గాని జననాంగంలో ఉండదు మన శరీరంలో ఉన్న మిగతా భాగాలు లాగానే అది కూడా ఒకటి, మనుషుల నోటి నుండి వచ్చే చెత్తను కంట్రోల్ చేసుకోవాలి అంటూ తనపై ట్రోల్ చేస్తున్న వారందరికీ కౌంటర్ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *