allu ramalingaiah Chiranjeevi

అల్లు రామలింగయ్య, సురేఖ నన్ను అలా చూడగానే పెళ్లి క్యాన్సల్ చేస్తారు అనుకున్నా.!’ అప్పుడూ చిరంజీవి ఏం చేశాడో తెలుసా .?!

News

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అప్పటి ప్రముఖ కమెడియన్స్ లో ఒకరైన అల్లు రామలింగయ్య తన కూతురు అయిన సురేఖను చిరంజీవికి ఇచ్చి వివాహం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.వారి పెళ్లికి ఇరువురి ఇంటి వాళ్ళు కూడా అందరు ఒప్పుకున్నారు. రామలింగయ్య కుమారుడు మరియు అల్లు అర్జున్ నాన్న గారైన అల్లు అరవింద్ మాత్రం అంత సులువుగా ఒప్పుకోలేదు.

చిత్రాలలో పని చేసే వాడు కాబట్టి అతని గురించి చాలా ఆరాతీయాలి అనే ఆలోచనలో ఉన్నాడు అతను. తన ఎంక్వైరిలో చిరంజీవి మంచోడే అని తేలేవరకు తన చెల్లి అయిన సురేఖను అతనికి ఇచ్చి పెళ్లి చేయకూడదు అని అల్లు అరవింద్ పట్టుపట్టాడు.తన ప్రయత్నాలలో తను ఉన్నాడు కూడా. అయితే అలా అల్లు అరవింద్ ఎంక్వైరీ చేస్తున్న టైంలోనే అనుకోకుండా మెగాస్టార్ చిక్కుల్లో పడ్డారు. ఆ స్టోరీ ఎంటో ఇప్పుడు చూద్దాం.

allu ramalingaiah Chiranjeevi

శంకరాభరణం మూవీ విడుదలైన రోజులవి. అయితే ఆ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన మంజు భార్గవి ఆ చిత్రం యొక్క ప్రీమియర్ షోకి తప్పకుండా రావాలంటూ చిరంజీవిని ప్రాధేయపడింది. చిరంజీవితో పాటుగా అల్లు రామలింగయ్య కుటుంబాన్నికి కూడా ఆమె ఆహ్వానం పంపించారు.

ఆమె కోరిక మేరకు చిరంజీవి మరియు అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖ తో ఆ సినిమా యొక్క ప్రిమియర్ షోకి వచ్చారు.అయితే వారందరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఆ సినిమా చూస్తున్న టైంలో క్లైమాక్స్ సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉండటంతో చిరంజీవి భావోద్వేగానికి గురి అయ్యి కన్నీళ్ళు పెట్టుకున్నారట. ఆడియన్స్ తను కానీళ్లు పెట్టుకోవడం చూసి ఏమనుకుంటారో ఏమో అని గబగబా తన జేబులో నుంచి చేతి రుమాలు అదేనండీ హాండ్ కర్చీఫ్ తీసుకొని కళ్ళు తుడుచుకుంటున్నాడట.

అది చూసిన నటి మంజు భార్గవి ఏకంగా అతనికి కాబోయే మామ మరియు భార్య ముందు తన చీరకొంగును ఇస్తూ తుడుచుకోమని చెప్పిందట.దరిద్రానికి ఆ టైం లో సరిగ్గా చిరంజీవి చేతిలో ఆమె చీరకొంగు ఉన్నప్పుడే లైట్స్ ఆన్ అయ్యాయట. ఆ సీన్ ని చిరంజీవి భార్య సురేఖతో పాటుగా ఆమె నాన్న గారైన అల్లు రామలింగయ్య కూడా చూశారట. అంతే ఇక దాంతో చిరంజీవి ఎక్కడ లేనంత టెన్షన్ పడినట్టు సమంత టాక్ షోలో చెప్పాడు.

Chiranjeevi surekha

అయితే ఆశ్చర్యకరంగా ఇంటికి వెళ్ళిన తర్వాత వారు నార్మల్ గానే ఉండి చిరంజీవితో కూడా యధావిధిగానే బాగానే మాట్లాడినట్టు తెలిపారు. ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గా అనుకున్నారే తప్ప కాస్త కూడా తప్పు నన్ను పట్టలేదని చెప్పుకొచ్చారు. అయితే ఎక్కడ ఈ సంబంధం తెగిపోతుంది అని తెగ భయపడిన మెగాస్టార్కి ఇలాంటివేమీ పెద్దగా పట్టించుకోకుండా రామలింగయ్య ఫ్యామిలీ చిరంజీవి గారికి తన కూతురు సురేఖను ఇచ్చి వివాహం జరిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *