chiranjeevi-balakrishna-movies

Chiranjeevi Balakrishna : చిరంజీవి బాలకృష్ణ లను పోటీపడి సినిమాలు చేసేలా చేసింది ఒకే వ్యక్తి.

Trending

తెలుగు క్లాసికల్ మరియు మోడ్రన్ సినిమాల మద్ద్యా కాలం లో వచ్చిన సినిమాల్లో తిరుగులేని స్టార్ డం సంపాదించుకున్న వ్యక్తి చిరంజీవి గారు ఆయన సినిమాలు అంటే ఆ తరం వారు పడి పోయే వారు. చిరంజీవి సినిమా చూశాము అంటే అన్ని రకాల కళలను చూసినట్టే అనేంత బాగుంటాయి చిరంజీవి సినిమాలు అనే అభిప్రయం ప్రజలలో పాతుకు పోయింది. ఇక ఇదే కాలం లో చిరంజీవి గారికి గట్టి పోటీ ఇస్తు నిలబడిన యాక్టర్ బల కృష్ణ , బాలయ్య సినిమాల్లో ఎక్కువ భాగం యాక్షన్ కే ప్రాధాన్యత ఇచ్చిన ఎప్పటికీ గుర్తుండి పోయే ఎమోషనల్ స్టోరీ ని అనుకొని అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడు.

ఆయన చేసిన సినిమాల్లో కొన్ని ఆ కాలానికి ఒక మాయాజాలం అనిపించేవి. కంప్యూటర్ టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో ఆదిత్య 369 , భైరవద్వీపం వంటి సినిమాలు చేసి ప్రజలను ఆశ్చర్యపరిచాడు, ఈ తరహా సినిమాలు ఆ కాలంలో కేవలం బాలకృష్ణ గారు మాత్రమే చేస్తూ ఉండేవారు, ఇక ప్రస్తుత యాక్టర్ల లో కొన్ని విలువైన పాత్రలు కేవలం బాలకృష్ణ గారు వేస్తేనే బాగుంటుంది అన్నట్టుగా ఆయన ప్రతిభ నేటికి జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. సుమారు 40 యేండ్లు గా అలరిస్తున్న బాలకృష్ణ గారు నేటికి కూడా కొత్త తరం హీరోలకు ఏ మాత్రం తీసిపోని పోటీని ఇస్తున్నాడు.

chiranjeevi-balakrishna-movies

ఇక గత తరంలో పోటాపోటీగా సినిమాలు చేస్తున్న చిరంజీవి బాలకృష్ణ లను స్టార్లుగా చేసింది మాత్రం కోదండరామిరెడ్డి అని ఖచ్చితంగా చెప్పగలము. అప్పట్లో కోదండరామి రెడ్డి చిరంజీవిది ఒక మంచి సక్సెస్ ఫుల్ కామినేషన్ . వీరి కాంబో లో వచ్చిన 25 సినిమాల గాను ఇరవై రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచాయి, ఇక బాలకృష్ణ గారితో సుమారు 12 సినిమాలు కోదండరామి రెడ్డి గారు నిర్మించారు. ఇద్దరు హీరోలకు మంచి మాస్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు అందించి, ప్రేక్షకుల వద్దనుండి మాస్ హీరో అనే టైటిల్ వీరికి సొంతం చేశాడు.

ఆ కాలంలో హిట్ సినిమాలైనా ముఠామేస్త్రి ఖైదీ కొండవీటి దొంగ వంటి సినిమాలు చిరంజీవి అందించాడు మరియు ఇద్దరి జీవితంలో ప్రతిష్టాత్మకమైన సినిమా త్రినేత్రుడు ఈ సినిమాతో చిరంజీవి గారి కెరియర్లో 100వ సినిమా పూర్తి చేసుకున్నారు అలాగే కోదండరామి రెడ్డి గారు 50 సినిమా పూర్తి చేశారు. బాలకృష్ణ గారి విషయంలో కూడా బొబ్బిలి సింహం , నారీ నారీ నడుమ మురారి, అనసూయమ్మగారి అల్లుడు వంటి సినిమాలు ఇచ్చి వీరిద్దరి జీవితంలో ఒక మైలు రాయిగా నిలిచారు కోదండ రామిరెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *