చిరంజీవి గారు యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు అతను మద్రాసు పట్టణంలోని రాజీవ్ కనకాల గారి తండ్రి గారైన స్వర్గీయ దేవదాసు కనకాల గారి యాక్టింగ్ స్కూల్ లో చేరారు. అయితే తన కోర్సు పూర్తికావస్తుండగా మెగాస్టార్ చిరంజీవికి చిత్ర పరిశ్రమలో పునాది రాళ్ళు అనే చిత్రంలో ఛాన్స్ వచ్చింది. గూడపాటి రాజ్ కుమార్ అనే వ్యక్తి దర్సకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.అయితే ఈ మూవీ యొక్క మొదటి షాట్ పొలంలో నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి మెగాస్టార్ పనిచేస్తుంటాడు. అయితే అప్పుడు దర్శకుడు ఆ షాట్ షూట్ చేస్తున్నప్పుడు రియలిస్టిక్ గా ఉండడానికి నాలుగు గడ్డి పోచలు అతను తన తలపైన పెట్టుకున్నాడట. అది చూసిన ఆ షాట్ చిత్రికరిస్తున్న కెమెరా మ్యాన్ చిరంజీవి గారిని చూస్తూ భవిష్యత్తులో నువ్వు ఒక పెద్ద స్టార్ హీరోవి అవుతావని చెప్పాడట.
దాంతర్వాత ప్రముఖ డైరెక్టర్ బాపు గారి దర్శకత్వంలో తెరకెక్కిన మన ఊరి పాండవులు అనే మూవీలో చిరంజీవి గారికి మరొక ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి యాక్టింగ్ నచ్చి బాపుగారు మరో మూవీని చిరంజీవితో తీయలనుకున్నాడు. దాంతో మంత్రిగారి వియ్యంకుడు అనే సినిమా రూపుదిద్దుకుంది.
ముగ్గురు మొనగాళ్ళు సినిమాలో చిరుకి డూప్స్
ఈ మూవీలో చిరంజీవి సరసన పూర్ణిమ జయరాం నటించగా జయకృష్ణ ఈ మూవీ కి ప్రొడ్యూసర్ గా బాధ్యతలు తీసుకున్నాడు.అయితే ఈ చిత్రంలో ఉండే ముఖ్య పాత్ర అయిన మంత్రి పాత్రను ఎవరితో వేయిస్తే సెట్ అవుతుంది అని డిస్కర్షన్ నడుస్తున్నప్పుడు పరముఖ హాస్యనటుడు స్వర్గీయ అల్లు రామలింగయ్య గారు మా బావగారు అయితే ఎలా ఉంటుంది అనే ఐడియా ఇచ్చాడట, ఆయనతో వేయిస్తే బాగుంటుంది అని సలహా కూడా ఇచ్చారట.

అలా ఆ సినిమా మంత్రిగారి వియ్యంకుడులో చిరంజీవి గారి సొంత నాన్న గారు వెంకట్రావు మంత్రిగా చేశారు.నిజానికి ఈ మూవీ కంటే ముందే చిరంజీవి గారి తండ్రి ఆల్రెడీ వేరే చిత్రంలో కూడా నటించారు. అదే 1969లో విడుదలైన జగత్ జెట్టీలు అనే చిత్రం.

ఆ చిత్రం అతనికి ఎన్నో సినిమాలలో నటించే ఛాన్సులు వచ్చినప్పటికీ అతని ఫ్యామిలీ బాధ్యతల కారణంగా ఒకటి రెండు మూవీస్లో మాత్రమే అతను నటించారు తప్ప యాక్టర్ గా అలా కంటిన్యూ కాలేకపోయారు.మనందరికీ తెలుసు వెంకట్రావు గారు ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. దాని కారణంగా అతను సినిమాలలోకి రాలేకపోయాడు మరియు పూర్తి స్థాయి యాక్టర్ గా మారడం కుదర్లేదు.అయితే మెగాస్టార్ కూడా ప్రారంభంలో పోలీస్ డిపార్ట్మెంట్లో నే ఉద్యోగం చేసేవాడు. కానీ తర్వాత అతను చిత్ర పరిశ్రమలోకి వచ్చి మెగాస్టార్గా ఎదిగారు.