గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన మా ఎలక్షన్ తంతు మొగిసి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి విష్ణుభారీ మెజారిటీతో ఎన్నుకోబడ్డాడు, ఇక విష్ణుకు ఎంతో మంది శుభాకాంక్షలు తెలియజేశారు అదే సమయంలో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు మా సభ్యత్వం నుండి రాజీనామా కూడా చేశారు.
ఎన్నడూ లేనంతగా ఈసారి మా ఎలక్షన్లో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. దాంట్లో ముఖ్యమైనది రెండు రకాల ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులను ఈ సారి చూశాము , దాంట్లో ప్రాంతీయ బావన కలిగినటువంటి వాళ్లు మరియు బయటి వ్యక్తి అయిన ప్రకాష్ రాజ్ వంటి వ్యక్తి తమ అసోసియేషన్ కి ఏదో చేయగలడు అని నమ్మకం కనుపరిచినటు వంటి రెండు విభిన్నమైనటువంటి వ్యక్తులను ఈ సారి ఎలక్షన్లలో చూశాము, ఈ రెండు విషయాలలో చాలామట్టుకు ప్రజలకు న్యాయబద్ధత కనిపించింది కానీ ముఖ్యంగా విష్ణుకు తన తండ్రి అయిన మోహన్ బాబు గారి అండ ఉండేసరికి ఆయనకే మెంబర్స సహకరించారని తెలుస్తోంది.
ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇద్దరు గొప్ప వారు, అసోసియేషన్ పైన భవిషత్తు ఆలోచన కలిగిన వారు బరిలో ఉండేసరికి మెంబర్ల లో కొంత తికమక ఏర్పడింది , ఈ పరిస్థితిలో పోటీదారులు ఇద్దరూ తమ మేనిఫెస్టోను బయటపెట్టారు అయితే మానిఫెస్ట్ తో పాటు అవతల వ్యక్తి లో కొన్ని తప్పులు ఉన్నాయి అంటూ కొన్ని ఆసక్తి కరమైన అంశాలు తెరపైకి తీసుకువచ్చారు దీంతో చిన్నగా మొదలైన ఈ విమర్శలు రాను రాను పెరిగి ఒక పెద్ద తుఫాను గా మారింది.
ఇలా విమర్శించుకోవడం పోలింగ్ ముందు రోజు వరకు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎంతో మంది సీనియర్ నటులు జూనియర్ నటులపైన విరుచుకుపడడం , కొంతమంది సీనియర్ నటుల సపోర్ట్ కోసం స్వయాన వారి ఇంటికి వెల్లి మద్దతు కోరడం మరియు డబ్బు పంచి ఓటర్లను ఆకట్టుకుంటున్నారు అనే విషయం కూడా తెరపైకి రావడం చూశాం.
అయితే ఇన్నాళ్లు ఒకరిపైన ఒకరు విమర్శించుకోవడం , వేలెత్తి అసమానతలు చూపెట్టు కోవడం వల్ల వచ్చిన అసమానత్వనీ , పరస్పర ద్వేషభావాని తీసివేయడానికి హీరో శ్రీకాంత్ కుమారుడు నటించిన పెళ్లి సందడి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన చిరంజీవి గారు, మా అసోసియేషన్ మరియు మిగితా సినిమా ఆర్టిస్టులను ఉద్దేశించి ముఖ్యమైన విషయాలు తెలియజేశాడు, ముందుగా ఈ రకంగా ఈ గందరగోళ పరిస్థితి విషయమై మాట్లాడడానికి పిలిచిన రాఘవేంద్రరావు కి కృతజ్ఞతలు చెప్తూ.
వెంకటేష్ గురించి ప్రస్తావించాడు, ఇప్పటికీ వెంకటేష్ గారి నటనను నేను అభినందిస్తున్నాను ఏదైనా సినిమాలో ఆయన నటన నన్ను ఆకట్టుకుంటే కచ్చితంగా ఆయనకు ఫోన్ చేసి చంపేసావ్ , సూపర్ గా చేశావు అని అభినందిస్తున్నాను అని చెప్పారు, నారప్ప సినిమా లో అయితే విక్టరీ వెంకటేష్ చేసిన క్యారెక్టర్ నన్ను ఆకట్టుకుంది అన్నట్టు చెప్పాడు, అదే రీతిగా నేను చేసిన సైరా నరసింహారెడ్డి సినిమాలో నా పాత్ర ను చూసి ఆయన నన్ను మెచ్చుకున్నాడు అంటూ చిరంజీవి అన్నారు, ఇలా ఒకరినొకరు మనస్ఫూర్తిగా అభినందించికోవడం మన సినిమా పరిశ్రమలో ఉంటే ఆరోగ్యకరమైనటువంటి వాతావరనం ఉంటుంది కదా .
ఒకరినొకరు తగ్గించి మాటలు అనడం, మాటలు పడడం వంటివి ఉండవు కదా, ఏ పదవైన తాత్కాలికమే రెండేళ్లు, మూడేళ్లలో నాలుగెల్లో ఉంటాయి దాని కొరకు ఒకరినొకరు మాట్లాడుకోవడం ఒకరితో మాటలు పడడం వంటివి చేసి బయటివారికి లోకువ అయిపోతాం, ఒక పదవి కోసం ఇలా లోకువకావడం మనకు అవసరమా అన్నట్టు మాట్లాడారు.
నేను పలన ఈయన అని ప్రస్తావించటం లేదు గాని మెచ్యూరిటీ లేకనే ఇలా ప్రతి ఒక్కరు ప్రవర్తిస్తున్నారని అని ఆయన అన్నారు.
మనము గొప్పవారమని చూపించు కోవటానికి అవతల వ్యక్తిని కించపరచడం గాని విమర్శించడం గాని చేయడం తప్పు అని అన్నారు, ఇవన్నీ మానేయండి ఇది ఎక్కడ నుండి ప్రారంభం అవుతుందో జాగ్రత్తగా ఆలోచించి అక్కడినుంచే మార్పును ప్రారంభించండి అన్నారు . హోమియోపతి వైద్యం ఎలాగైతే మూలాల్లోకి వెళ్లి నయం చేయడానికి ప్రయత్నిస్తోంది అలాగే మనం కూడా ప్రతి ఒక్కరు ఏ వ్యక్తితో ఇలాంటి పరిస్థితి వస్తుందో ఆ వ్యక్తిని సరిచేయాలి అని అన్నారు. వీలైతే అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి అని సూచిస్తూ మనందరం వసుదైక కుటుంబం అని అన్నారు ఇలాంటి కుటుంబంలో అందరూ ఆత్మీయంగా ఆప్యాయంగా హాయిగా ఉండాలి చిన్నచిన్న గొడవలతో అవతల వాడికి లోకువ అయిపోయి ముఖ్యంగా మీడియా వారికి ఆహారం కాకండి అని ఆయన సూచనలిస్తూ ముగించారు.