మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్ లో ట్రిపుల్ రోల్ లో నటించిన ఏకైక సినిమా ముగ్గురు మొనగాళ్ళు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించినంత గొప్ప విజయాన్ని అందుకోలేకపోయినా కూడా టెలివిజన్లలో ఈ మూవీ వస్తే చాలు అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తారు. ఈ చిత్రంలో మూడు పాత్రల్లో నటించిన మెగాస్టార్ పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒక్కో రోల్ ల్లో చాలా వేరియేషన్స్ చూపిస్తూ చాలా బాగా నటించాడు మెగాస్టార్.
ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకొని నటించారు. రోజా, నగ్మా, రమ్యకృష్ణ లాంటి స్టార్ హీరోయిన్స్ ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన మూడు పాత్రలకి జంటగా నటించారు. మెగాస్టార్ కెరీర్ లో ఈ ముగ్గురు మొనగాళ్ళు అనే సినిమా చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచిపోయింది.

దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్ లో ఈ మూవీ వచ్చింది.ఈ సినిమాకు ముందు రాఘవేంద్ర రావు మరియు చిరంజీవి కాంబినేషన్‌లో ఇండస్ట్రీ బ్లాక్బస్టర్ హిట్స్ గా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘ఘరానా మొగుడు’, ‘రౌడీ అల్లుడు’ లాంటి సినిమాలు వచ్చాయి. ఈ చిత్రాల తర్వాత వచ్చిన ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. 1994 వ సంవత్సరం జనవరి 7వ తేదీన భారీ అంచనాలతో ఈ ముగ్గురు మొనగాళ్లు సినిమా విడుదలైంది. అయితే ఈ చిత్రాన్ని మెగాస్టార్ తమ్ముడు నాగబాబు గారి సొంత నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్ లో ఈ మూవీని నిర్మించారు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే మూడు పాత్రల్లో సింగిల్ ఫ్రేం లో నటించవచ్చు.
కానీ ఒకేసారి ముగ్గురు హీరోలు కలిసి ఒకే ఫ్రేం లో కనిపించినప్పుడు చిరంజీవికి డూప్స్‌గా నటించినవారెవరు అనే దవ్ట్ మనందరికి సాధారణంగా కలగక మానదు.అయితే చాలామంది మెగాస్టార్ పోలికలతో ఉన్న వ్యక్తి రాజ్ కుమార్ ఒక పాత్రలో నటించాడని చెప్పుకునేవారు. కానీ అది ఏమాత్రం నిజం కాదు.ఈ చిత్రంలో మెగాస్టార్ కి డూప్స్ గా ఒకరు చిరంజీవి పర్సనల్ అసిస్టెంట్ సుబ్బారావు కాగా, ఇంకొకరు ప్రముఖ నటుడు హరిబాబు నటించడం విశేషం.
దీనికి సంబంధించి కిన్ని ఫోటోలను కూడా అప్పట్లో స్టిల్స్ తీసి బాధరంగా ఉంచారు. ఇన్ని సంవత్సరాలకి ఆ ఫోటోలు బయటపడ్డాయి.ఆ ఫోటో తో ఎంతో కాలంగా ఉన్న ప్రశ్నకు సమాధానంగా ఆ ముగ్గురు మొనగాళ్ళు సినిమాలో యాక్ట్ చేసింది మరో ఇద్దరు మొనగాళ్ళు సుబ్బారావు – హరిబాబు అని క్లారిటీ వచ్చింది.