chiranjeevi-on-kondapolam

కొండపోలం సినిమా గురించి మెగా స్టార్ చిరంజీవి గారి రివ్యూ!

News

మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో సినిమా రంగ ప్రవేశం చేసి సూపర్ హిట్ కొట్టాడు. తన మొదటి సినిమాలోనే హిట్ కొట్టిన అతి కొద్ది హీరోల లిస్ట్ లో వైష్ణవ్ తేజ్ కూడా చేరాడు. ఉప్పెన సినిమా తర్వాత అతి కొద్ది కాలంలోనే క్రిష్ జాగర్ల ముడి దర్శకత్వంలో కొండపొలం సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమా సన్నపురెడ్డి వెంకట రమిరెడ్డి గారు రాసిన కొండపోలం నవల ఆధారంగా తెరకెక్కబోతుంది అని టాక్ ఒకటి చేకర్లు కొడుతోంది. ఒక రోజు క్రిష్ సినిమా కథను వైష్ణవ్ చెప్పగానే తను వెంటనే ఒకే చెప్పకుండా మొదటగా తన మేన మామ చిరంజీవి గారి నిర్ణయం తీసుకోవాలని చిరంజీవిని కలిసి నప్పుడు క్రిష్ విభిన్న జర్నల్స్ లో సినిమా తీస్తుంటారు , కాదనకుండా ఒప్పెస్కో రాబోయే రోజుల్లో మంచి సినిమా అవకాశాలు పొందుకుంటవు అని అన్నారట. అందుకే ఒకే చెప్పేశాడట వైష్ణవ్ ,

ఈ సినిమా 8 అక్టోబర్ న రిలీజ్ కానుండగా గురువారం రోజు ప్రసాద్ లాబ్స్ లో ప్రీ రిలీజ్ షో ప్రదర్శించగా చిరంజీవి గారు హాజరయ్యారు. షో తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో అని కొన్ని విషయాలు పంచుకున్నారు. . ఈ క్రమంలో క్రిష్ దర్శకత్వ ప్రతిభను ప్రశంసించారు.అలాగే క్రిష్ సినిమా అంటేనే విభిన్న జోనర్లలో ఉంటుందని సినిమాకు రివార్డులతో పాటు, అవార్డులు వస్తాయని భావిస్తున్నానని అన్నారు.

chiranjeevi-on-kondapolam

నేను ‘కొండపోలం’ పుస్తకం చదవలేదు. నాకు దాని గురించి ఏమీ తెలియదు . క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వైష్ణవ్ కెరీర్‌లో వైవిధ్యమైన సినిమా కాబోతోంది అని అన్నారు.
అలాగే నటులకు పూర్తి స్థాయిలో తమ నటన ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పించే సినిమా ఇది , నేపథ్యం, ​​వాతావరణం మరియు పాత్రల చిత్రీకరణ చాలా భిన్నంగా కనిపించాయి అని చిరంజీవి అన్నారు.

“నేను మొదటి నుండి క్రిష్ సినిమాలన్నీ చూశాను. ఒక సినిమాకి మరో సినిమాకు సంబంధం లేదు. ‘కొండపోలం’ కూడా గత చిత్రాలకు చాలా భిన్నంగా ఉంటుంది. ఇది మానవజాతి ప్రకృతిని ఎలా కాపాడాలనే కథ . ఇలాంటి సందేశంతో పాటు, చక్కటి ప్రేమకథను తీసుకువచ్చారు. రకుల్ ప్రీత్ మరియు వైష్ణవ్ బాగా నటించారు. నేను నిజంగా దాన్ని ఆనందించాను. అలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి అని అన్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు కశ్చితం గా నచ్చుతుంది అని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను అలాగే నిర్మాతలకు సినిమా మంచి వసూళ్లు రావాలని కోరుకుంటున్నాను ”అని చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు చిరంజీవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *