చిరంజీవి పేరెత్తితే చాలు ఆయన గురించి ప్రేక్షకులు ఎన్నో యాంగిల్లో ఊహించుకుంటారు. ఒక యాక్టర్ ఒక అన్నయ్య ఒక మెగాస్టార్ ఒక ఆపద్బాంధవుడు వంటి ఎన్నో రూపాలను ప్రేక్షకులు ఒక చిరంజీవి లో చూస్తూ ఉంటారు. గతంలో ప్రజలకు సేవ చేయడానికి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ముందుకు వచ్చిన ఆయన ఘోర పరాజయం చవి చూడాల్సి వచ్చింది. దాంతో రాజకీయాలనుండి విరమించుకుని ఆయన ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే రీతిగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఎంతో కాలం గ్యాప్ ఇచ్చి సినిమాలు చేస్తున్న ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొరటాల డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి కాగా, త్వరలోనే మలయాళ లూసీఫర్ సినిమా తెలుగు రీమేక్ లో నటించనున్నారు, ఆ తర్వాత వేదాళం సినిమాలో కూడా నటించనున్నారు, ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయనకు సినిమా షూటింగ్ లో భాగంగా చెయ్యి ఫ్రాక్చర్ కాగా చిన్నపాటి సర్జరీ అయి కొంతకాలం పాటు సినిమాల నుండి విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇక విశ్రాంతి తీసుకుంటున్న ఈ సమయంలో భారతీయ చిత్ర పరిశ్రమలో ని స్త్రీ లను అధిగమిస్తూ నటిస్తున్న రమ్యకృష్ణ భర్త దర్శకత్వం వహించిన రంగమార్తాండ సినిమాకు చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు తెలుస్తోంది,
కృష్ణవంశీ గారు ఒకప్పుడు స్టార్ దర్శకులలో ఒకరు గా పరిగణించబడ్డారు , ఎల్లప్పుడూ క్రియేటివ్ గా ఆలోచించే ఆయన వరుస ఫ్లాపులను ఎదుర్కోవడంతో సినిమాలకు దూరమయ్యారు ఇక తాజాగా రంగ మార్తాండ సినిమాకు దర్శకత్వం వహించగా మెగాస్టార్ చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు, గత 15 ఏళ్లలో వరుస ఫ్లాప్ లను ఎదుర్కొంటున్న ఆయనకు చిరంజీవి గారి వాయిస్ ఓవర్ ద్వారా మంచి హిట్ సాధించి కొంతైనా ఉపశమనం పొందగలనని నమ్మకం కనుపరుస్తున్నారు కృష్ణ వంశీ.
ఈ మూవీని విజయం వైపు నడిపించే బాధ్యత చిరంజీవి గారు తీసుని వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా దర్శకుడు కృష్ణ వంశీ తన ట్వీట్ లో అడగగానే సహాయపడి నా సినిమా మాకు వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు థాంక్యూ అన్నయ్య అంటూ కృతజ్ఞతలు తెలుపగా అభిమానుల్లో క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తో పాటు రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.