సివిల్స్ లో 5 సార్లు ఫైల్ అయింది…కానీ చివరకు ఏం జరిగిందంటే…!

News

“తిరునెల్వేలిలోని పాఠశాల మరియు కళాశాలలో నేను చదువుకుంటున్న కాలంలో, విధి గురించి మాట్లాడిన వారిని నేను తరచుగా హేళన చేసేదాన్ని. కానీ నేను ఇంతవరకు ఎదుర్కొన్న పోరాటాలు చూస్తుంటే నేను దానిని విశ్వసించడం ప్రారంభించానని అంగీకరించాలి ”అని సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సిఎస్ఇ) లో తన లక్ష్యాన్ని ఛేదించిన 33 ఏళ్ల ఉమా మహేశ్వరి చెప్పారు. ఆమె ఆరవ ప్రయత్నం లో దీనిని సాధించారు. ఒక భార్య మరియు తల్లి గా ఉమా వైఫల్యాలు ఆమె ఆత్మస్థైర్యాన్ని తగ్గించనివ్వలేదు. మరియు ఆమె పట్టుదల తో 2018 లో సిఎస్ఇ ని క్లియర్ చేసింది.

ఉమా మనస్సులో CSE స్పార్క్ ఎలా వెలిగింది

ఉమా ఎక్కువగా తమిళనాడులోని తిరునెల్వేలిలో గడిపింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత, ఉమా తన స్వగ్రామంలో ఎంబీఏ చేసింది. “కళాశాలలో చదువుతున్న రోజుల్లో నేను సిఎస్ఇ కోసం హాజరవుతాను అని నాకు తెలియదు.నా ప్రొఫెసర్ అబూ బ్యాకర్, నన్ను పరీక్ష రాయమని బలవంతం చేసాడు. నేను మొదటిసారి వ్రాసినది, 2011 లో, అప్పుడు ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా రాసాను. ” అని చెప్పింది.యాదృచ్ఛికంగా, కాలేజీని విడిచిపెట్టిన తరువాత, ఉమా బ్లూ-చిప్ కంపెనీల నుండి మూడు ఆఫర్ లెటర్లతో పాటు ఉత్తమ విద్యార్థి అనే ట్యాగ్‌ను పొందింది.

కార్పొరేట్ రంగంలో జీవితం

“ఎంతో ఆశతో, సాధించిన స్ఫూర్తితో నేను కార్పొరేట్ ప్రపంచంలోకి ప్రవేశించాను. నా తండ్రి ఊహించని విధంగా చనిపోయే వరకు జీవితం నిజంగా నాకు గులాబీల మంచంలా ఉండేది. నా కోసం, ప్రతిదీ నా తల్లిదండ్రులు చూసుకునేవారు,తండ్రిని కోల్పోయిన తరువాత కొంత కాలానికే నా తల్లి కూడా మరణించడం నాకు చాలా పెద్ద షాక్. ” సింటెల్, కరూర్ వైస్య బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్ మరియు ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీస్ వంటి సంస్థలలో ఉమా ఐదేళ్లపాటు పని కొనసాగించారు. “నా కార్పొరేట్ జీవితంలో కూడా నేను CSE రాయడం కొనసాగించాను, అయినప్పటికీ వాటిలో ఒక్కదానికి కూడా ప్రిపేర్ అవ్వడానికి నాకు సమయం లేదు అవకాశం కూడా లేదు. నేను పనిచేసేటప్పుడు ఐదు సిఎస్ఇ పరీక్షలు రాసాను, ”అని ఆమె తెలియజేసింది. దురదృష్టవశాత్తు, ఉమా ప్రిలిమ్స్ ఏదీ క్లియర్ చేయలేకపోయింది.

సిఎస్‌ఇలో ఆరవ మరియు విజయవంతమైన ప్రయత్నం

చాలా వైఫల్యాలను ఎదుర్కొన్న తర్వాత ఎవరైనా సాధారణంగా వదులుకుంటారు, దీనికి విరుద్ధంగా, ఉమా ఫలితాలతో బలపడింది. కాబట్టి ఆమెను ప్రేరేపించింది ఏమిటి? “నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నేను సాధించలేను అనేవారు. నేను పరీక్షలను క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని మరియు అందరికి నేను ఇది చేయగలను అని నిరూపించేందుకు ఇది నాకు అత్యవసరంగా భావించాను. ” 2017 లో, ఉమా తన కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఒంటరిగా సమయాన్ని వెచ్చించాలని నిర్ణయించుకుంది. “ఇది చాలా కఠినమైన నిర్ణయం. నేను దీన్ని ఎందుకు చేయలనుకుంటున్నానో ఎవరికి అర్ధం కాలేదు, అది కూడా దీనికి ముందు ఐదుసార్లు విఫలమైన తరువాత. అందరూ నా ఉద్యోగాన్ని కొనసాగిస్తూ ప్రిపరేషన్ చేసుకోవాలని సూచించారు. కానీ అది నాకు న్యాయం చేయదని నాకు తెలుసు. ”

తయారీ సమయంలో షెడ్యూల్

తన బిడ్డను చూసుకోవడం, ఇంటిని నడపడం మరియు పరీక్షకు సిద్ధపడటం మధ్య ఆమె తన సమయాన్ని ఎలా విభజించిందో వివరిస్తూ, “నేను ప్రిలిమ్స్ కోసం సిద్ధమవుతున్న సమయంలో నేను ఉదయం 5 గంటలకు మేల్కొనేదాన్ని, ఉదయం 7 గంటల వరకు చదివేదాన్ని. తరువాతి మూడు గంటలు నా కుమార్తెను పాఠశాలకు సిద్ధం చేయడానికి మరియు ఇంటిని క్రమబద్ధీకరించడానికి గడిపాను.

“నేను ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం వరకు మళ్ళీ చదువుకునేదాన్ని. నా కుమార్తె పాఠశాల నుండి తిరిగి వచ్చాక, నేను ఆమెతో సమయం గడిపేదాన్ని. సాయంత్రం మరియు రాత్రులు, నా భర్త తన పని నుండి తిరిగి వచ్చాక, అతను మా కుమార్తెను చూసుకుంటాడు, కాబట్టి నేను మళ్ళీ చదువుతుండేదాన్ని. ” ప్రిలిమ్స్ కోసం ఆమె ఈ దినచర్యను అనుసరిస్తుండగా, ఆమె రాత్రి 10 గంటల నుండి దాదాపు 3 గంటల వరకు మెయిన్స్ కోసం ప్రిపేర్ అయ్యింది.

కుటుంబ మద్దతు గురించి అడిగినప్పుడు, ఆమె తన భర్త మరియు అత్తమామలు పరీక్షల గురించి తమ అభిప్రాయాన్ని మార్చుకునే చాలా ఆసక్తికరమైన కారణాన్ని ప్రస్తావించారు. “2018 ఫలితాలు ప్రకటించినప్పుడు హర్యానాకు చెందిన అను కుమారి ఒక బిడ్డ మరియు కుటుంబాన్ని చూసుకుంటుంనే,రెండవ స్థానాన్ని దక్కించుకోగలిగింది, అను యొక్క విజయం తన అత్తమామలకు మరియు భర్తకు ఒక తల్లికి ఇది సాధ్యమవుతుందనే నమ్మకాన్ని ఇచ్చిందని ఉమా చెప్పారు. తన చివరి ప్రయత్నంలో, 2018 లో, ఉమా తన రౌండ్లన్నింటినీ క్లియర్ చేయగలిగింది. ఆమె ఇంటర్వ్యూ 2019 ప్రారంభంలో జరిగింది మరియు ఆమె ఇప్పుడు ఐఏస్ గా విధులు నిర్వహిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *