అవయవ దానం గురించి ఈ కాలంలో అందరికి అవగాహన వచ్చిన చాలా మంది తమ అవయవాలను దానం చేసేందుకు ఇష్టపడరు, కానీ అవయవ దానం వల్ల ఇతరుల జీవితాల్లో ఎంత గొప్ప మేలు జరుగుతుందో తెలిసిన వారు తప్పకుండా తమ వంతు సహాయం చేయాలని ఆశ కలిగి ఉంటారు.
ఇటీవల ఓక పోలీస్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయి .. మరో 8 మందికి అవయవదానం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు . వివరాల్లోకి వెళ్తే గనక, ఖమ్మం జిల్లా, కూసుమంచి మండల కేంద్రానికి చెందిన నలగాటి వీరబాబు వయసు 34 సం” హైదరాబాదు లోని కొండాపూర్ లో టీఎస్ఎస్సీలో 8 వ బెటలియన్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు .
సొంతపనుల నిమిత్తం తన స్వగ్రామానికి వచ్చాడు ఈ నెల 12 న తన ద్విచక్రవాహనంపై (Bike పై) ఖమ్మం వచ్చిన ఆయనను గొల్లగూడెం దెగ్గర ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే అతడిని ఖమ్మంలోని మమత ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని మలక్ పేటలోని యశోదా ఆసుపత్రికి తరలించారు .అక్కడ అతన్ని పరీక్ష చేయగా బ్రెయిన్‌డెడ్ అయినట్టుగా వైద్యులు తెలిపారు.

దీంతో వీరబాబు కుటుంబసభ్యులు ఆయన మరణ వార్త విని కన్నీరుమున్నీరు అయ్యారు, కానీ ఒక గొప్ప కార్యానికి సిద్ధమయ్యారు, ఆయన అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు . ఈ క్రమంలో వీరబాబు గుండెను తీసి కూసుమంచి మండలం మునిగేపల్లికి చెందిన పెయింటర్ తుపాకుల హుస్సేను కు అమర్చి అతని జీవితాన్ని కాపాడారు . మిగిలిన అవయవాలను కూడా సేకరించారు.
అయితే ఆ రోడ్డుప్రమాదంలో కానిస్టేబుల్ నలగాటి వీరబాబు గారు మరణించడంతో కూసుమంచిలో విషాదం అలుముకుంది . బ్రెయిన్ డెడ్ అయిన ఆయన అవయవాలు దానం చేస్తే ఇంకో ఎనిమిది మందిని కాపాడవచ్చు అని వైద్యులు తెలిపారు.
గుండెతో పాటు ఆయన యొక్క ఇతర ముఖ్యమైన అవయవాలను ఇతరులకు అమర్చారు . కానిస్టేబుల్ కుటంబం అవయవదానం చేయడంతో పెద్ద ఎత్తున అక్కడి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు . మీ లాంటి వారి స్ఫూర్తితో మాకు కూడా అవయవదానం చేయాలని ఉందని కొంతమంది తెలియ జేశారు .
ఒక మనిషి చనిపోయాక ఆ శేరిరాన్ని అలానే కల్చటం లేదా పూడ్చటం వల్ల వారి అవయవాలు కూడా వారితో పాటు మట్టిలో కలిసిపోతున్నాయి, దాని వల్ల ఎవరికి లాభం లేకుండా పోతుంది.
ఈ ప్రపంచం లో అవయవ లోపం తో ఎంతో మంది బాద పడుతున్నారు, వారి భాధ వర్ణన అతీతం ఇంకొందరు చెడిన అవయవాలతో మరణ పడక పై సిద్ధం గా వున్నారు. ఇలా మనం కూడా అవయవ దానం చేసేందుకు ముందుకు రాగలిగితే వారి జీవితాలలో వెలుగులు నింపిన వారం అవుతాం.
మన మరణం ఇంకొకరికి జీవాన్నీ పోసేలా ఉండాలని ప్రతి ఒక్కరు తమ మనసులో అనుకోవాలి. మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు.