దిల్ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో, ఎక్కడుందో తెలుసా..?!

Movie News

హీరోయిన్ నేహా బాంబ్ గురించి తెలుసా అని అంటే, ఎవరో ఆ హీరోయిన్ మనకెందుకులే అనుకుంటారు. కానీ దిల్ సినిమా హీరోయిన్ గురించి తెలుసా అని అడిగితే మాత్రం ఓ ఎందుకు తెలీదు చాలాసార్లు ఆ సినిమా చూసాము అని చాలా మంది సమాధానం ఇస్తారు.నిజమే గా చాలా మంది హీరోయిన్స్ ను మనం సినిమా పేర్లతోనే గుర్తుంచుకుంటాం.దిల్ సినిమాలో హీరో నితిన్ సరసన నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది హీరోయిన్ నేహా బాంబ్. ఆ ఒక్క సినిమాతోనే చాలా మంది యువకుల డ్రీమ్ గర్ల్ గా మారింది.

కానీ మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాక చాలా మంది వరుసగా చాలా సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తారు కానీ విచిత్రంగా నేహా బాంబ్ మాత్రం చిత్ర పరిశ్రమ నుండి కనుమారుగైపోయారు.

టాలీవుడ్ లో ఆమె అడుగుపెట్టే ముందు హిందీ సీరియల్ ‘ఇష్క్ హోగయా మేను’ లో నటించింది. తర్వాత వి.వి వినాయక్ దర్శకత్వం వహించిన దిల్ సినిమాకు సంతకం చేసి మొదటిసారిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.దిల్ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అవ్వడంతో నేహా కు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ దిల్ మినహా ఆమె నటించిన మిగతా సినిమాల్లో అంతగా అదృష్టం కలిసి రాలేదు. అతడే ఒక సైన్యం మరియు దోస్త్ చిత్రాలు చేసిన కూడా ఆమె ఎంతో కాలం తెలుగు చిత్ర పరిశ్రమలో నిలద్రొక్కుకోలేకపోయింది.

తర్వాత ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో సైడ్ క్యారెక్టర్ గా చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఆమె బొమ్మరిల్లు, దుబాయ్ సీను చిత్రాలలో సైడ్ క్యారెక్టర్స్ చేసింది.కానీ అలా కూడా ఆమె గుర్తింపు పొందుకోలేకపోయింది.ఇక్కడ సైడ్ క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే బాలీవుడ్ లో కూడా ప్రవేశించాలనే ప్రయత్నాలు మొదలు పెట్టింది. కానీ ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు.

ఇక చేసేదేమీ లేక సీరియల్స్ చేసేందుకు సిద్ధం అయిపోయింది.అలా ఆమె హిందీలో మళ్ళీ సీరియల్స్ చేయడం మొదలు పెట్టి ‘కైసే యే ప్యార్ హై’ అనే సీరియల్ తో మళ్ళీ బుల్లి తెరలోకి ప్రవేశించింది.అలా ఆమె సీరియల్స్ లో నటిస్తున్న టైంలో కొన్ని షో లకు హోస్ట్ గా ఉండమని ఆఫర్స్ వచ్చాయి.తర్వాత ఆమె చివరిసారిగా 2009 లో ‘నాగిని వాడన్ కి అగ్ని పరీక్ష’ అనే సీరియల్ లో కనిపించింది. తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. ఇంకొరకంగా చెప్పాలంటే ఆమె ఈ సీరియల్ తరువాత ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.

నటి ఇప్పుడు సంతోషంగా వివాహం చేసుకుని విదేశాలలో స్థిరపడింది. ఆమె క్రుశాంత్ గోరగంధిని వివాహం చేసుకుంది.అయితే ఆమె మళ్ళీ సినిమాల్లోకి రియెంట్రీ ఇస్తే బాగుంటుందని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *