dil-raju-vijay-devarakonda

Dilraju: విజయ్‌దేవర కొండ పర్మిషన్ తీసుకున్న దిల్ రాజు

News

దిల్ రాజు గారు తాజాగా తన బంధువు ఆశిష్ హీరోగా తెరకెక్కించిన సినిమా రౌడీ బాయ్స్. ఆయన ఈ సినిమా ఆడియో రిలీజ్ ఎవెంట్లో కొన్ని సంచలనమైన విషయాలు పంచుకున్నారు. ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ దేవర కొండను ఉద్దేశిస్తూ రాబోయే తరం లో పవన్ కళ్యాణ్ లా విజయ్ దేవర కొండ అవుతాడు అని చెప్పారు.

ఇక ఈవెంట్లో దిల్ రాజు గారు రౌడీ బాయ్స్ సినిమాలోని రెండవ పాటను విడుదల చేసి కొన్ని ముఖ్య మైన వ్యాఖ్యలు చేశాడు. తన కుటుంబీకుడు ఆశిష్ నటించిన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అని అందుకే రౌడీ బాయ్స్ అనే పేరు సినిమాకి పెట్టాం అని చెప్పాడు . ఈ టైటిల్ కోసం విజయ్ దేవరకొండ పర్మిషన్ తీసుకుని పెట్టామని దిల్ రాజు అన్నారు. ఎందుకంటే ఈ తరంలో సినీ ఇండస్ట్రీకి దొరికిన యూత్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ అని ఆయనకు సరిపోయే పేరును మేము సినిమాకు వాడాము అందుకే ఆ టైటిల్ ఆయన పర్మిషన్ అడిగే పెట్టవలసివచ్చింది అన్నారు.

dil-raju-vijay-devarakonda

విజయ్ దేవరకొండ ఎంతోకాలం కిందటే నాకు తెలుసు , ఆయనకు మా బ్యానర్ పై నిర్మాణం అయ్యే ఏదో ఒక సినిమాలో నటించాలని ఆశ గా ఉండేదని అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు అని తెలియజేశారు, ఆయన గతంలో నా సినిమా కేరింత లో నటించడానికి ఆడిషన్ కూడా ఇచ్చాడు ఆ సినిమా లో ముగ్గురు హీరోల లో ఒక హీరోగా చేయవలసి ఉండగా కొన్ని అనుకోని పరిస్థితులవల్ల ఆ రోల్ ఆయన చేయడం కుదరలేదు, ఇక ఆ తర్వాత వచ్చిన పెళ్లి చూపులు సినిమా ను నాకు చూపించి మన బ్యానర్ పై దాన్ని విడుదల చేయాలని ఎంతో ట్రై చేశాడు అందుకొరకు నన్ను కలవడం కోసం నా ఆఫీస్ కి కూడా వచ్చాడు కానీ కొన్ని ముఖ్యమైన పనుల వల్ల నేను అప్పుడు ఆస్ట్రేలియా లో ఉన్నాను అందుకే వీలు పడలేదు.

ఇక ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి , గీతాగోవిందం సినిమాలతో విజయ్ దేవరకొండ స్టార్ గా మారాడు. గీతా గోవిందం సినిమా సక్సెస్ అయ్యాక సక్సెస్ మీటింగ్ కి వెళ్ళిన నేను అక్కడ విజయ్ దేవరకొండ అభిమానుల్ని చూసి ఆశ్చర్యపోయాను అతి కొద్దికాలంలో కేవలం మూడే సినిమాలతో గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ మరో పవన్ కళ్యాణ్ లా అనిపించాడు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా కెరీర్ ప్రారంభంలో మూడు సినిమాలతోనే స్టార్ డం సంపాదించుకున్నాడు, ఇప్పుడు అదే ఆకర్షణను విజయ్ దేవరకొండ లో చూస్తున్నానని తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక యూత్ ఫుల్ హీరో దొరికాడని ఆయన భవిష్యత్తు గొప్పగా ఉండబోతుందని తన తెలియజేశారు.

ఇక త్వరలో తెరకెక్కబోతున్న లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ కాబోతున్న విజయ్ దేవరకొండ నా నిండు అభినందనలు తెలియజేస్తున్నాను అని దిల్ రాజు అన్నారు. ఇక రౌడీ బాయ్స్ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published.