దృశ్యం 2 లో అండర్ కవర్ కాప్ క్యారెక్టర్ ఎవరో తెలుసా?

Movie News

తాజాగా ఓటిటి లో విడుదలైన మలయాళ రీమేక్ చిత్రం దృషం 2 మంచి రెస్పాన్స్ అందుకుంది.  దృశ్యం వన్ లో నటించిన పాత్రదారులు అవే పాత్రలు  పోషించటంతో చిత్రానికి న్యాచురల్ అనుభూతినీ తీసుకొచ్చింది. 

మలయాళం లో జీతు జోసెఫ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా దేశం లోని ఇతర ఇండస్ట్రీలో అంతే ప్రతిష్టాత్మకంగా రీమేక్  చేయబడింది.  మన తెలుగులో సురేష్ ప్రొడక్షన్ మరియు ఆశీర్వాద్ సినిమా ప్రొడక్షన్స్ కాంబోలో ఈ సినిమా తెర కేకించారు.  

సినిమా ఓపెన్ చేస్తే ముగిసిన కేస్ రియోపెన్ చేస్తారు  . అన్ని మరిచి సరదాగా ఉన్న రాంబాబు కుటుంబం సినిమా ఇంటర్వెల్ వరకు తమ పై పోలీసుల నిఘా ఉందని గమనించలేక పోతారు. తమ ఇంటి స్థలం లో నుండి కొంత భాగం సరిత దంపతులు కొంటారు , వారు రాంబాబు ఇంట్లో సీక్రెట్ మైక్ లు అమర్చి  వారు మాట్లాడుకునే వన్ని వింటుంటారు. సినిమా ప్రారంభం నుండి కేస్ లో ఏదో మలుపు తిగుతునట్టు అనిపిస్తుంది. అయితే సరిత పోలీస్ అయ్యుండి అనుమానం రాకుండా రాంబాబు భార్యకు మంచి ఫ్రెండ్ గా నటిస్తుంది. ఈ సినిమాలో కెళ్ల ఆమెదే ముఖ్యమైన పాత్ర ఆమె ఒక్కొక్కటిగా రాంబాబు భార్యను ఇన్ డైరెక్ట్ ప్రశ్నలు వేస్తూ వాస్తవాలను రాబట్టాలని ప్రయత్నం చేస్తుంటే ప్రేక్షకులకు ఉత్కంఠ గా ఉంటుంది. చివర్లో ఆమె రాంబాబు కుటుంబాని మోసం చేసినట్టు కనిపిస్తుంది.

ఇక ఆ పాత్రలో పక్కింటి ఇల్లాలు మరియు అండర్ కవర్ కాప్ గా  2 రకాల అభినయాలను పండించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఎవరో తెలుసా? , సరిత అస్సలు పేరు సుజా వరుని. ఆమె మన తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకున్నా తమిళ , కనడ, మలయాళ సినిమాలో నటించారు అయితే తెలుగులో మాత్రం గతంలో కొన్ని అతిధి పాత్రలలో మాత్రమే కనిపించారు. 2002 లో ప్లస్ 2 తో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి , 2017 లో కమలహాసన్ హోస్ట్ గా నిర్వహించిన బిగ్ బాస్ షో లో పాల్గొని 91 రోజుల పాటు ఇంట్లో ఉండి ఎలిమినేట్ అయింది. అమే తమిళ నటుడు శివాజీ దేవ్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. తెలుగులో  వెంకటేష్ హీరో గా నటించిన నాగవల్లి సినిమాలో హేమ అనే చిన్న రోల్ ను పోషించారు, అవే గాక గుండెల్లో గోదారి , దూసుకెళ్తా, అలీబాబా, ఒక్కడే దొంగ వంటి సినిమాల్లో నటించారు, ఇక ప్రస్తుతం దృశం 2 లో నటించారు. ఇక ఈ సినిమా ద్వారా తెలుగు లో కూడా సుజా కు మంచి బ్రేక్ లభించింది అని చెప్పుకోవచ్చు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *