అద్భుతం చేసిన చిన్నారులు.!సైకిల్ ను పెట్రోల్ అవసరం లేని వాహనం గా మార్చారు.! ధర 10,000 వేలే.!

News

కాస్త ఫ్రీ టైం దొరికితే చాలు ఫోన్ తో టైంపాస్ చేసే పిల్లలున్న ఈ జెనెరషన్ లో తమిళనాడు కి చెందిన ఇద్దరు పిల్లలు ఒక సరికొత్త ఆవిష్కరణ చేశారు. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న కారణంగా చాలా మంది వారి వాహనాలను బయటికి తీయడానికి కూడా భయపడుతున్నారు. ఈ విషయం గమనించిన తమిళనాడు లోని శివగంగై కి చెందిన ఇద్దరు పిల్లలు సోలార్ ఎనర్జీ తో నడిచే సైకిల్ ను కనుగొన్నారు. ఈ సైకిల్ ను ఎవరు తొక్కకుండానే వెళ్తుంది. ఈ సైకిల్ గంటకు 25 నుండి 35 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని ఆ పుల్లలు చెప్పారు.

ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 30 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది పూర్తి ఛార్జింగ్ అవ్వడానికి 5 గంటల టైం పడుతుంది. ఒకవేళ ఛార్జింగ్ లేకున్నా కూడా తొక్కుకుంటు వెళ్లిపోవచ్చు. ఈ సైకిల్ దాదాపు 150 కిలోల బరువు మోయగలదు.ఈ సైకిల్ లో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఛార్జింగ్ స్లాట్ కూడా ఉంటుంది. తమిళనాడులోని శివగంగై లో ఉంటున్న వీరపతిరన్, అమాని దంపతుల పిల్లలే ఈ ఇద్దరు చిచ్చర పిడుగులు.

వీరి పేర్లు వీర గురు హరికృష్ణన్ (12) మరియు సంపత్ కృష్ణన్ (11) . వీర గురు హరికృష్ణన్ 8 వ తరగతి చదువు చుండగా సంపత్ కృష్ణన్ 7 వ తరగతి చదువుతున్నాడు. కరోనా టైం కాబట్టి లోక్డౌన్ లో స్కూల్స్ కూడా మూసి ఉండడం తో ఈ పిల్లలు సైకిల్స్ పై వాళ్ళ వీధుల్లో ఆడుకుంటూ తిరిగేవారు. అయితే పెట్రోల్ ధరలు విపరితంగా పెరిగాయని బయటకి వెళ్లడం చాలా కష్టంగా మారిందని ఆ ప్రాంతంలో వుండే పెద్దలు మాట్లాడుకోవడం విన్న ఈ పిల్లలకు అసలు పెట్రోల్ అవసరం లేని వాహనాన్ని కనుగొనాలనే ఆలోచన వచ్చింది.సో అలా ఈ సోలార్ పవర్ తో నడిచే సైకిల్ ను తయారు చేశారు.

అప్పటినుండి ఎలాగైనా సోలార్ సైకిల్ ను తాయారు చేయాలని పట్టు పట్టారు. వారి ఇంట్లో కూడా చెప్పారు. వారి తల్లిదండ్రులు కూడా అందుకు సపోర్ట్ చేశారు. వాళ్ళు ఒక సైకిల్ ను ఎన్నుకొని దానికి కావలిసిన బ్యాటరీ, మోటర్ మరియు సోలార్ ప్లేట్స్ వంటి ఇతర పరికరాలను కొన్నింటిని ఆన్లైన్ లో మరికొన్నింటిని దగ్గర్లోని దుకాణాలలో కొన్నారు. ఈ సైకిల్ పూర్తి అయ్యేసరికి వారికి కేవలం పది వేలు మాత్రమే ఖర్చు అయ్యాయని ఆ పిల్లలు చెప్పారు.వీటికి ఇంకొన్ని పరికరాలు అమర్చితే వేగం పెంచుకోవచ్చు లేదా తగించుకోవచ్చు అంటున్నారు పిల్లలు.

ఏది ఏమైనా సరే సమయం దొరికితే వృధాగా కాలయాపన చేసే పిల్లలు ఎక్కువగా కనిపించే ఈ కాలంలో ఇలాంటి ఆవిష్కరణలు చేసి శభాష్ అనిపించుకునే పిల్లలు ఉండడం నిజంగా అభినందనీయం.ఎంతో మంది పిల్లలకు కూడా ఇలాంటి వారు స్ఫూర్తి గా నిలుస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *