Kerala elephant Image

హృదయ విదారక వైరల్ వీడియో.. ఏనుగు దాని మావటి చనిపోయాడు అని తెలియగానే 20 కి.మీ. నడుచుకుంటూ వచ్చింది…

News

ఇంటర్నెట్లో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది.ఓ సంఘటనకు సంబంధించిన ఒక చిన్న వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు మరియు ఇది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.వీడియోలో, ఒక ఏనుగు క్యాన్సర్‌తో పోరాడి ఓడిపోయిన తన మావటి కు వీడ్కోలు పలికింది.

ఈ కరోనా పుణ్యమా అంటు ఒక వ్యక్తి ఏ రోగంతో మరణించిన అతను కరోనా వల్లే చనిపోయాడంటూ కనీసం కుటుంబ సభ్యులే దగ్గరికి వచ్చి అంత్యక్రియలు చేయని సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం.సొంత కుటుంబ సభ్యులే ఎక్కడ వైరస్ సోకుతుందో అని కనీసం దూరం నుండైన చూసే ధైర్యం చేయక శవాన్ని అనాధ శవంగా హాస్పిటల్ నుండి నేరుగా స్మశానానికి పంపిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఏనుగు మనకు పాఠం నేర్పిస్తుంది.తన మావటి చనిపోయాడన్న వార్త తెలియగానే 20 కిలో మీటర్లు నడుచుకుంటూ వచ్చి నివాళులు అర్పించింది.తన విశ్వసనీయతకు నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Kerala elephant 2

కేరళలోని కొట్టాంలో జరిగిన ఈ సంఘటనలో పల్లట్ బ్రహ్మదాథన్ అనే ఏనుగు తన యజమాని ఒమనాచెట్టన్‌కు చివరి నివాళులు అర్పించింది, ఈ సంఘటన స్థానికులకు కంటతడి పెట్టించింది. స్థానిక నివేదికల ప్రకారం, కున్నక్కడ్ దామోదరన్ నాయర్ అలియాస్ ఒమనాచెట్టన్ ఏనుగుల పట్ల ఆప్యాయంగా, ప్రేమగ ఉన్నందుకు ఆ ప్రాంతంలో ప్రసిద్ది చెందాడు మరియు ఆరు దశాబ్దాలుగా వాటిని జాగ్రత్తగా చూసుకోవడంలో ఎంతో కష్టపడి మంచి పేరును సంపాదించాడు.

అయితే ఇటీవలే ఆయన క్యాన్సర్తో పోరాడిన తరువాత జూన్ 3 న కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఒమనాచెట్టన్ మరణం గురించి విన్న ఏనుగు యజమానులు అతని అంతిమయాత్రకు ఆ ఏనుగును 20 కిలో మీటర్ల దూరం నుండి తీసుకొచ్చారు. వైరల్ అయిన ఈ వీడియోలో దాని తొండం పైకి లేపి ఆ శవం దగ్గర వంగి నమస్కారం చేస్తున్నట్టుగా ఉంది.

అది అలా నివాళులు అర్పించడం చూసి ఏనుగు యొక్క తొండంను పట్టుకుని బంధువులలో ఒకరు ఏడుస్తున్న సంఘటన కూడా ఆ వీడియో లో రికార్డ్ అయ్యింది.ఇలాంటి ఒక సంఘటన తాము ఎప్పుడు కూడా చూలేదు అని స్థానికులు చెప్పారు.ఇంటర్నెట్ లో అయితే ఈ వీడియోను నిమిషాల్లోనే లక్షల మంది చూసి షేర్ చేస్తున్నారు.నిజంగా ఒక జంతువుకు యజమాని పైన ఎంత ప్రేమ ఉంటుందో ఈ సంఘటన నిరూపించింది.జంతువులే అని మనం చిన్న చూపు చూస్తుంటాం కానీ మనుషులలో కనుమరుగైపోతున్న ప్రేమ , విశ్వాసం నోరు లేని జీవులలో కనిపిస్తున్నాయి.ఈ ఒక్క సందర్భమే కాదు ఎన్నో సార్లు జంతువులు వారి ఓనిర్ల కోసం చేసిన త్యాగాలు టీవీలలో చూస్తూనే ఉన్నాం కానీ వాటి నుండి ఏం నేర్చుకోలేకపోతున్నాం.

Kerala elephant

నివేదికల ప్రకారం, కేరళలోని ముఖ్యమైన ఆలయ ఉత్సవాల్లో బ్రహ్మదాథన్ మరియు ఒమనాచెట్టన్ రెగ్యులర్లుగా పలుగోనే వాళ్ళు మరియు వీరిద్దరి చివరి ప్రదర్శన త్రిస్సూర్ పూరంలో జరిగింది.
కనీసం మూగ జీవులు చూపించే కృతజ్ఞతలో మనం కొంచెం అయిన మన కుటుంబ సభ్యుల పైన చూపించగలుగుతున్నామా? చూడండి ఒక నోరు లేని జంతువు తన యజమాని కోసం ఎన్నో కిలో మీటర్ల నడుచుకుంటూ వచ్చిందంటే ఇది ఒక సామాన్యమైన విషయం కానే కాదు.

Leave a Reply

Your email address will not be published.