మల్లెమాల అనే ఈ సంస్థ గురించి తెలీదు అనే బుల్లితెర ప్రేక్షకులు ఎవరు ఉండరు.ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ షోల పుణ్యమా అంటూ మల్లెమాల సంస్థ మళ్లీ వెలుగులోకి వచ్చింది. అయితే అంతకు ముందు ఈ సంస్థ ను నడిపే శ్యాం ప్రసాద్ రెడ్డికి మూవీస్ లో ప్రొడ్యూసర్ గా దారుణమైన ఫ్లాప్ వచ్చింది.దంతర్వాత బుల్లితెరపై ప్రయోగాలు చేసిన మాత్రం శ్యాం ప్రసాద్ రెడ్డి సక్సెస్ అయ్యారు. దాదాపు మనందరికి ఈటీవీలో ప్రసారం అయ్యే ఎంటర్టైన్మెంట్ షోలన్నీ కూడా మల్లెమాల ఆధ్వర్యంలోనే నడుస్తుంటాయి అని తెలుసు.తాజాగా ఎన్నో కొత్త కొత్త షోలు కూడా ఈ సంస్థ నిర్మిస్తుంది కూడా.
అయితే ఈ మధ్య మల్లెమాల సంస్థ పైన కాస్త నెగెటివిటీ పెరిగింది. తమ షోల్లో పని చేసే ఆర్టిస్ట్‌లను మల్లెమాల అంతగా పట్టించుకోదని, వారికి హెల్ప్ చేసేందుకు ముందుకు రాదనే వార్తలు బయటికి వచ్చాయి. అక్కడితోనే ఆగకుండా అందులో పనిచేసే ఆర్టిస్టులను బాండ్లు, అగ్రిమెంట్ల పేరుతో హింసిస్తుందనే ఒక చెడ్డ పేరును కూడా మూట గట్టుకుంది మల్లెమాల. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా మల్లెమాల మేల్కొని దిద్దుబాటు చర్యలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఏది ఏమైనా ఈ షో ఎంతో మంది ఆర్టిస్టుల జీవితాలను మార్చి పాడేసింది అని ఒప్పుకోక తప్పదు. ఎక్కడో మ్యాజిక్కులు చేసుకునే సుధీర్, కాలేజీలో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేసుకునే హైపర్ ఆది లాంటి వారి బ్రతుకులు ఎలా మారిపోయాయో మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం. చేతి నిండా షోస్ తో అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ మల్లెమాల సంస్థలో పని చేస్తున్న వారందరు ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు.
అయితే ఈ నిర్మాణ సంస్థ జబర్దస్త్ షో తో పాటుగా ఇతర కామెడీ షోస్ కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో జబర్దస్త్ తో పోటీ పడుతున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పొచ్చు.ఇందులో జబర్దస్త్ ఆర్టిస్టులే ఉండడం మూలంగా ఈ షో కూడా బాగానే క్లిక్ అయ్యింది.అయితే తాజాగా ఈ వచ్చే వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ యొక్క లేటెస్ట్ ప్రోమోను సోషల్ మధ్యమలలో విడుదల చేసారు నిర్వాహకులు.
ఈ ఎపిసోడ్ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ గా వస్తుంది. కాబట్టి అందరూ వారి వారి ఫ్రెండ్స్ గురించి వారి జీవితంలో ఫ్రెండ్స్ ఎలా సహాయ పడ్డారు అనే విషయాలు పంచుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక సుధీర్, రాంప్రసాద్ మరియు గెటప్ శ్రీను ఫ్రెండ్షిప్ కోసం స్పెషల్ సాంగ్ పడ్డారు. అయితే ఈ షోకి ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్ కోసం వచ్చాడు.
అప్పుడు ఇమ్మనుయెల్ మరియు నూకరాజు చేసిన స్కిట్ అందరిని భావోద్వేగానికి గురి చేసింది.స్కిట్ లో తన ఫ్రెండ్ కోసం ఇమ్మనుయెల్ తన కంటిని దానం చేసిన సీన్ అందరిని కంట తడి పెట్టించింది. అయితే స్కిట్ అయిపోగానే ఎమోషనల్ అయిపోయిన ప్రియదర్శి మీరు సినిమాల్లో తప్పకుండా ప్రయత్నించండి అంటూ వారి నటనకు ప్రశంశలు కురిపించాడు.