fight-master-about-rajamouli

‘రాజమౌళి అలా చేసాడు అందుకే RRR నుండి తప్పుకున్నాం..’ RRR ఫైట్ మాస్టర్స్ రాజమౌళి పై షాకింగ్ కామెంట్స్..!

Movie News

ఎస్ ఎస్ రాజమౌళి ఇప్పుడు మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే నెంబర్ వన్ డైరెక్టర్ అనడం లో ఎటువంటి సందేహం లేదు. బాహుబలి లాంటి సెన్సేషనల్ సినిమా తరువాత ఇప్పుడు రాజమౌళి భారత దేశ టాప్ డైరెక్టర్ ల జాబితాలోకి కూడా ఎక్కాడు. రాజమౌళి తో సినిమా చేయాలని సినిమా ఇండస్ట్రీలో సైడ్ ఆర్టిస్టుల దగ్గరి నుండి బడా హీరోల వరకు కోరుకుంటారు.

కానీ అతనితో సినిమా చేయడం అంటే అంత సులువు కాదు అనే విషయం కూడా అందరికి తెలుసు. అతను ఒక్క సినిమా కోసం ఎన్నో సంవత్సరాలు షూటింగ్ జరిపి ది బెస్ట్ ఔట్ పుట్ ను అందిస్తాడు. అతని చేయి పడిందంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతుంటారు అందరు. ఎందుకంటే రాజమౌళి సినిమాలు ఇప్పటివరకు ఫ్లాప్ కాలేదు. ఇంకా అందులో ఎక్కువగా బ్లాక్ బస్టర్ లు , అల్ టైం సూపర్ హి

ట్స్ ఉన్నాయి. అందుకే టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు ప్రతి ఆర్టిస్ట్ అతనితో కలిసి పని చేయాలనుకుంటారు.
కానీ అందరికి భిన్నంగా రాజమౌళి తో పని చేస్తే అంతగా క్రెడీట్ రాదని అంటున్నారు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మన్లు. మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఫైట్ మాస్టర్లు గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు రామ్ లక్ష్మన్లు. దాదాపు గా అందరూ స్టార్ హీరోల తో పని చేసారు వాళ్ళు.హీరోల శరీరాలకు తగ్గట్టుగా వాళ్ళు ఫైట్ సీన్స్ కంపోజ్ చేస్తుంటారు. దాదాపుగా 20 సంవత్సరాలుగా వారూ టాలీవుడ్ లో ఫైట్ మాస్టర్స్ గా ఉంటూ వస్తున్నారు. అంతే కాదు వారు సంపాదించే దాంట్లో కొంత డబ్బును సామాజిక సేవ రూపం లో కార్చుపెడుత్తారు. అందుకే వారిని ప్రజలు హీరోలను గౌరవించినట్లు గౌరవిస్తారు.సాధారణంగా ఎవరైనా సరే రాజమౌళి తో పనిచేయడం అస్సలు మిస్ చేసుకోరు అని మనం ఇందాకే చెప్పుకున్నాం కానీ రామ్ లక్ష్మణ్ లు మాత్రం అందుకు భిన్నంగా రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR లో నుండి వారు తమ పని నుండి తప్పుకున్నారు. తాజాగా రామ్ లక్ష్మణ్ లు ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని వెల్లడించారు.
RRR లో రామ్ చరణ్ తో ఒక ఫైట్ సీన్ పై పని చేయాల్సి ఉండగా రామ్ చరణ్ గాయం కారణంగా ఆ సీన్ కంప్లీట్ చేయలేకపోయాము అని వారు చెప్పారు. అయితే ఇప్పుడు వారికి డేట్స్ కుదరకా RRR ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు చెప్పారు. రాజమౌళితో సినిమా అంటే అది డాన్స్ అయిన ఫైట్ సీన్స్ అయిన అందులో రాజమౌళి ఆలోచన విధానం క్లియర్ గా కనబడుతుంది కాబట్టి అతనితో పనిచేసే వారికి అంతగా గుర్తింపు రాదు అని వారు చెప్పుకొచ్చారు. అయితే రాజమౌళి ఒక గ్రేట్ డైరెక్ట్ అని ఆయన ప్రతి షాట్ కు ఎంతో కష్టపడుతారు అని అందులో ఎవరికి ఎటువంటి సందేహం అవసరం లేదు అని వారు అన్నారు. రాజమౌళి టాలీవుడ్ ను ప్రపంచ దేశాలకు పరిచయం చేసారు అని రామ్ లక్ష్మణ్ లు ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *