ఎవరైనా పోట్లాడే టైంలో వీడియో తీసి పొరపాటున సోషల్ మీడియాలో పోస్ట్ చేసారనుకో అలాంటి వీడియోస్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా యంగ్స్టర్స్, గ్యాంగ్ వార్స్, మందు బాబుల ఫైటింగ్స్, వాటర్ ట్యాంకర్ ల దగ్గరా మహిళల ఘర్షణల వంటి అనేక రకాల వీడియోలు ఎక్కువగా మనం చూస్తుంటాం.కానీ కాలేజీ అమ్మాయిలు ఇలా కొట్టుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.
అయితే సరిగ్గా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకూ మనం అబ్బాయిలకు సంబంధించిన ఫైటింగ్ వీడియోస్ మాత్రమే ఎక్కువగా చూసాం.ఇప్పుడ అమ్మాయిలు తెగ కొట్టేసుకున్న వీడియోని కూడా ఒకసారి చూసేయండి. మీరు చూడబోయే వీడియోలో ఇద్దరు అమ్మాయిలు ఓ వీధిలో వారి స్నేహితుల మధ్య పొట్టు పొట్టు తన్నుకున్నారు. వారు మాములుగా కాదు ఓ రేంజ్‌లో కుస్తీ పడిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హంగామా చేస్తోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఓసారి మీరు కూడా చూసేయ్యండి. ఈ వీడియోలో ఒక గల్లీలో ఇద్దరు అమ్మాయిలు లొల్లి లొల్లి చేశారు.ఎవరు చూస్తే మాకేంటి అంటూ తెగ రెచ్చిపోయారు. కొంతమంది యువతులు నిలుచుని వారు తన్నుకుంటుంటే అలా చూస్తూ ఉన్నారు. ఆ ఇద్దరు యువతులు సడన్ గా ఒకరిపై ఒకరు పిడిగుద్దుల తో దాడి చేసుకున్నారు. జుట్లు పీక్కుంటూ గోరంగా కొట్టుకున్నారు.
వారు అంతలా తన్నుకుంటుంటే పక్కనున్న యువతులు కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. వారు మాత్రం అలా ఆడియాన్స్ పాత్ర పోషించారు. వారు కొట్టుకుంటుంటే అలాగే చూస్తూ నిలబడిపోయారు. అయితే అందులో ఒక అమ్మాయి మాత్రం పోలీసులకు కాల్ చేద్దాం అని చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. వీరి లొల్లికి కారణమేంటో ప్రస్తుతానికి అయితే మనకు తెలియదు కానీ, ఆ ఇద్దరి కొట్లాటను వీడియో తీసింది ఎవరో కానీ ఆ వీడియోను కైంట్ గాల్‌బాట్ అనే ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో పోస్ట్ చేసారు.
View this post on Instagram
అంతే ఇక ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. పక్కన నిల్చుని చూస్తున్న వారి స్నేహితుల తీరుపై మండిపడుతున్నారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన 14 గంటలలోనే ఏకంగా 4.5 లక్షల మందికిపైగా చూసారు. ఇక లైక్స్ మరియు కామెంట్స్ గురించయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ వీడియోను మీరూ ఇంకా చూసి ఉండకపోతే ఇప్పుడే చూసేయండి.