కామెడీ సీన్ అయిపోగానే బాత్రూం లోకి వెళ్లి ఏడ్చేవాడు.. ఎమ్మెస్ గూర్చి చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్న హేమ

News

సినిమాల్లో పని చేసే ఎంతో మంది ఆర్టిస్టులు తెరపై నవ్విస్తూ, అలరిస్తూ ప్రేక్క్షకులకు చక్కటి వినోధాన్ని అందిస్తూ ఉన్నపటికీ వారి నిజ జీవితాలలో ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తుంటారు. అయినప్పటికీ వారు తెరపై కనిపిస్తున్నంతసేపు ఆ బాధలను బయటికి కనబడనివ్వకుండా దాచేస్తూ ఉంటారు. ప్రముఖ హాస్యనటుడు దివంగత ఎంఎస్ నారాయణ గారి జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి అని తెలుస్తోంది.అలీతో సరదాగా అనే షో లో ఇటీవలే జరిగినా ఒక ఎపిసోడ్లో నటి హేమ గారు మాట్లాడుతూ ఎమ్మెస్ నారాయణ జీవితంలో జరిగిన అలాంటి సంఘటనలు కొన్ని పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

కెమెరా ముందు నవ్వుతున్న నటుల చిరు నవ్వుల వెనుక తీరని బాధలు కూడా ఉంటాయి. అది ఇంట్లో ఎవరైనా చనిపోతున్న పరిస్థితి వలన కావొచ్చు లేదా కుటుంబ సభ్యులు చనిపోయిన బాధ కావచ్చు, ఏది అయినప్పటికీ వారు నొప్పిని ఎదుర్కొని షూటింగ్ కు తిరిగి రావాలి అనే నిర్ణయం తప్పకుండ తీసుకోవాలి. కాల్‌షీట్‌లు ముందుగానే ఇవ్వబడతాయి కాబట్టి చాలా మంది నటులు బాధలో ఉంటూనే షూటింగ్‌లో పాల్గొంటారు ఎందుకంటే వారి కారణంగా మొత్తం షూటింగ్ రద్దు చేయకూడదు. సన్నివేశాల్లో నవ్వుతూ నటిస్తారు.

హాస్యనటుడు అలీ హోస్ట్ చేస్తున్న ‘అలీ తో సరదాగా ’ తాజా ఎపిసోడ్‌లో సీనియర్ నటి శ్రీలక్ష్మి, నటి హేమ గెస్టులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తన తమ్ముళ్ళు రాజేష్, ఆనంద్ మరణాల గురించి శ్రీలక్ష్మి ప్రస్తావించారు. రాజేష్ (హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తండ్రి) మరణించినప్పుడు, శ్రీలక్ష్మి హైదరాబాద్ లో జరుగుతున్న ‘పెళ్లి సందడి’ షూటింగ్‌లో ఉన్నారు. అర్ధరాత్రి చెన్నై నుండి ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆమె తన మేనేజర్ తో “తమ్ముడు చనిపోయాడు వెంటనే వెళ్లాలని చెప్పను కానీ, రేపు చాలా ముఖ్యమైన సీన్ షూటింగ్ ఉందని ,ఎలా వెళ్తారు అని మేనేజర్ అన్నాడు. కానీ, ఏడుస్తూ, ఖచ్చితంగా వెళ్ళాలి” అని శ్రీలక్ష్మి అన్నారట.

ఆ రాత్రి, తన మేనేజర్ డైరెక్టర్ రాఘవేంద్రరావుకు ఫోన్ చేసి , శ్రీలక్ష్మిని విమానంలో వెంటనే చెన్నైకి పంపమని చెప్పాడు. చెన్నైలో దిగిన తరువాత, ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి కుమారుడు శ్రీ ఆమెను కారులో ఇంటికి తీసుకువెళ్లారు. మరో తమ్ముడు ఆనంద్ మరణించినప్పుడు తాను తమిళ సీరియల్ షూటింగ్‌లో ఉన్నానని శ్రీలక్ష్మి తెలిపారు. అయితే, ఆ తర్వాత సీరియల్ డైరెక్టర్ తనను వెంటనే పంపలేదని ఆమె వెల్లడించింది.

దర్శకుడు చేసిన ఆలస్యం కారణంగా ఆమె తన తమ్ముడు ఆనంద్ ఇంటికి వెళ్ళినప్పుడు అతను చనిపోయాడనే వార్త వినగానే శ్రీలక్ష్మి కేకలు వేశానని చిప్పింది. ”నా కాల్‌షీట్ రాత్రి 9 గంటలకు అయిపోతుంది. నాకు 8.30 కి ఆనంద్ చాలా సీరియస్ గా ఉన్నాడు వెంటనే రమ్మని కాల్ వచ్చింది.. నేను వెంటనే వెళ్లాలని దర్శకుడికి చెప్పాను. కేవలం రెండు సన్నివేశాలు మాత్రమే ఉన్నాయని, అవి పూర్తి అయ్యేవరకు తాను వదలనని చెప్పాడు.

నేను ఏమీ చేయలేని పరిస్థితి.అప్పుడు నేను అత్త పాత్ర పోషిస్తున్నాను.నవ్వుతు జాలీగా నటించండి అని డైరెక్టర్ అన్నాడు. నేను లోపల బాధపడుతునే పైకి నవ్వుతూ నటించాను. ఆ రెండు సన్నివేశాలు ముగిసినప్పుడు రెండవదానికి రెండు క్లోజప్ షాట్లు తీసుకొని వెళ్లిపోండి అని డైరెక్టర్ అన్నాడు.నన్ను రాత్రి 10 గంటలకు వదిలారు. ఆ సమయంలో నేనే కారు నడుపుకుంటూ వెళ్ళాను. ఇంటికి వెళ్ళేటప్పటికే నా తమ్ముడు ఆనంద్ మరణించాడు, ”అని శ్రీలక్ష్మి చెప్తూ ఏడ్చేశారు.

అదే సమయంలో, నటి హేమ ఎంఎస్ నారాయణ జీవితంలో ఒక సంఘటన గురించి కూడా ప్రస్తావించారు. “ఎంఎస్ నారాయణ అన్నయ్య ఒకసారి నాకు చెప్పారు. ‘దూకుడు’ లో కళ్ళ కింద క్యారీ బ్యాగ్ అనే సీన్ ను షూట్ చేస్తున్న టైంలో బ్రహ్మానందం అన్నయ్య, నారాయణ అన్నయ్య కాంబినేషన్ లో ఈ సీన్ చిత్రీకరించబడుతుంది. ఆ సమయంలో ఎంఎస్ నారాయణ భార్య అపోలో ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయవలసి వచ్చింది. అతను సంతకం చేస్తే కానీ శస్త్రచికిత్స చేయరు. కానీ అతను రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్లో ఉన్నాడు. మీరు ఆసుపత్రికి వెళ్ళలేకపోతే, లేఖను ఇక్కడకు తెచ్చి సంతకం చేయండి అని నేను అతన్ని నవ్వించే ప్రయత్నం చేశాను. అతను చిరునవ్వుతో కామెడీ సన్నివేశం చేస్తూ వెంటనే బాత్రూంలోకి వెళ్లి ఏడ్చేవాడు. అని హేమ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *