hero-sumanth-keerthi-reddy

హీరో సుమంత్ ని పెళ్లి చేసుకొని పొరపాటు చేశానంటున్న హీరోయిన్

Movie News

పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా అంటే తెలియని తెలుగు ప్రేక్షకులంటూ ఉండరు . ఆ కాలంలో కెల్లా మంచి సూపర్ హిట్ సినిమాలో ఒకటి తొలిప్రేమ, అప్పటికే సూపర్ ఫామ్లో ఉన్న చిరంజీవి యొక్క స్వయానా తమ్ముడు అయ్యేసరికి ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రేక్షకులను ఒక మాదిరి ట్రాన్స్ లోకి తీసుకు వెళ్ళిన సినిమా తొలిప్రేమ . అంతటి హిట్ చిత్రాన్ని ప్రజలు ఖచ్చితంగా మర్చిపోరు.

అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్యల చూపించిన తొలిప్రేమ ప్రేక్షకుల మనసును కట్టిపడేసింది, ప్రేక్షకులు మనసును దోచే అంత ప్రేయసిగా నటించిన హీరోయిన్ కీర్తి రెడ్డి , కీర్తి రెడ్డి ఈ సినిమా ద్వారా ఎంతో గొప్ప పేరును సంపాదించుకొని తెలుగు చిత్ర పరిశ్రమలో నటించుటనికి మరికొన్ని అవకాశాలను అందుకున్నారు.

1966లో వచ్చిన గన్ షాట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటి ఆ తర్వాత అర్జున్ , రావోయి చందమామ , తొలిప్రేమ సినిమాల్లో నటించి ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు.

ఇదే సమయంలో అప్పటికే మెల్లిమెల్లిగా సినీ ప్రపంచంలో ఎదుగుతున్న హీరో సుమంత్ తో ప్రేమలో పడ్డారు. తామిద్దరూ 2004వ సంవత్సరంలో పెళ్లి కూడా చేసుకున్నారు అయితే ఆ పెళ్లి ఎంతో కాలం నిలవలేదు. వారిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల వల్ల కేవలం రెండేళ్లలోనే అంటే 2006 వ సంవత్సరం లోనే విడిపోయారు.

hero-sumanth-keerthi-reddy

సుమంత్ ను పెళ్లి చేసుకున్నప్పుడు మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ కీర్తి రెడ్డి తన దాంపత్య జీవితాన్ని చక్కగా కట్టుకోవాలని ఆశతో ఎన్నో పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా వాటికీ తాను ఒప్పుకోక తన వ్యక్తిగత జీవితం పైన దృష్టి పెట్టింది . ఇంకా ఆ తర్వాత నుండి ఆమెకు పూర్తిగా అవకాశాలు రావడం మానేశాయి . ఆమె నిర్ణయమే తెలుగు ప్రేక్షకులను ఆమెను మర్చిపోయే స్థాయికి తీసుకొచ్చాయి.

ఇక కీర్తి రెడ్డి సుమంత్ నుండి వేరైయ్యాక ఒక డాక్టర్ ని పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం వీరిద్దరూ లండన్లో సెటిల్ అయ్యారు వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు , ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు కీర్తి రెడ్డి.

అయితే తాజాగా సుమంత్ ను గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపెట్టారు కీర్తి రెడ్డి. తన జీవితంలో సుమంత్ ను పెళ్లి చేసుకొని ఒక పెద్ద పొరపాటు చేశానని ఒక వేళ సుమంత్ తన జీవితంలోకి రానట్లయితే తన జీవితం ఇప్పుడు ఎంతో బాగుండేది అని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *