ఈ మధ్య కాలంలో ప్రాంక్ వీడియోలు ఎలా ట్రెండింగ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఏదో ఒక చిల్లర పని చేయడం అది ప్రాంక్ అనడం.వారి వారి పనిలో బిజీ గా ఉండేవాళ్లను వారి దెగ్గరికి వెళ్లి మరీ కెలకడం వారికి కోపం తెప్పించడం చివరకు అది ప్రాంక్ అని ఒక కెమెరా వైపు చూపించడం ఇది వారికి డైలీ హాబిట్ లాగా మారిపోయింది. అయితే ఇలాంటి ప్రాంక్ వీడియోస్ చేసే వారికి చాలా ధైర్యం కూడా ఉండాలి.
ఎందుకంటే అందరూ వ్యక్తులు ఒకేలా స్పందించరు.ఒకరు స్పోటివ్ గా తీసుకుంటే ఇంకొందరు ఎముకలు విరిగేలా తన్నేవాళ్ళు కూడా ఉంటారు.ఇలాంటి ఎన్నో సంఘటనలు గతం లో చాలానే చూసాం కూడా.అయితే ఎక్కువగా మాత్రం ఈ ప్రాంక్స్ చేసేవాళ్ళు దేనికైనా తెగించేంత ధైర్యంగా ఉంటారు.అందుకే ఎవరు తన్నిన వాటిని స్పోటివ్ గా తీసుకుని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఏది ఏమైనా కేవలం వ్యూస్ కోసం ఎందుకు పనికిరాని ఈ ప్రాంక్స్ చేయడానికి ఎంతవరకైనా వెళ్తున్నారు.
ఈ మధ్య కాలంలో అయితే ఈ ప్రాంక్స్ చేసేవాళ్ళ సంఖ్య చాలానే పెరిగింది అనే విషయం అందరికి తెలిసిందే.ఒకప్పుడు సిటీ కి వెళ్తే దొంగలకు భయపడుతూ ఉండే జనాలు ఇప్పుడు ఎక్కడ ఈ ప్రాంక్ చేసేవాళ్లకు దొరుకుతామా అని భయపడుతున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవలే ప్రాంక్ వీడియో మీద హైదరాబాద్ సిటీ లోని అబిడ్స్ జగదీష్ మార్కెట్‌లో ఒక మొబైల్ షాప్‌లో పెద్ద ఘర్షణ జరిగింది. ‘హైదరాబాదీ ప్రాంక్స్’ అనే యూట్యూబ్ ఛానెల్ కి సంబంధించిన ఓ యాంకర్ ప్రాంక్ వీడియోలో భాగంగా షాప్ ఓనర్ తో ఘర్షణకి దిగాడు. అయితే ఆ గొడవ చాలా పెద్దది కావడం తో షాప్ యజమానికి చాలా కోపం వచ్చి ఆ యాంకర్ ని చితక బాదాడు.ఆ యాంకర్ ఆ అది ప్రాంక్ అని చెప్పినప్పటికీ ఆ ఓనర్ వినకుండా ఇంకా ఆవేశంతో ఊగిపోతు మరింత కసిగా గా యువకుని కొట్టాడు. ఆ గొడవ మెల్లగా పోలీస్ స్టేషన్ వరకు దారి తీసింది. పోలీసులు ఆ యాంకర్ ను ఆ షాప్ ఓనర్ ను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అంతే కాకుండా ఆ యాంకర్ కి చికిత్స కోసం హాస్పిటల్ కి తరలించారు.
ఇలాంటి అనవసరపు ప్రాంక్స్ చేయకూడదంటూ ఒకవేళ ఇలా ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ప్రాంక్స్ చేస్తే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలిసి ఉంటుందని పోలీసులు ప్రాంకర్స్ ను హెచ్చరించారు.