గురువారం రోజు ఈ టీవీలో సాయంత్రం తొమ్మిది గంటలకు ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో హైపర్ ఆది మరియు అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ చేసే ట్రాక్ ప్రజల నోట్లో ఎప్పుడు నానుతునే ఉంటుంది. ఈ షో ద్వారా హైపర్ ఆది వేసే పంచులు ఆయనను క్రేజ్ ఉన్న జబర్దస్త్ ఆర్టిస్ట్ గా నిలబెట్టింది. తద్వారా రకరకాల షోల నుండి ఆయన ఆఫర్లు అందుకోవడం కూడా జరుగుతుంది.
మంచి క్రేజ్ తో పాటు అనసూయతో నడుపుతున్న ట్రాక్ నూ పండించి జబర్దస్త్ షో యొక్క రేటింగ్ పెంచడానికి ఖచ్చితంగా ఒక డ్యూయెట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు, అదే కాకుండా వీరిద్దరి మధ్య లో ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని స్కిట్ లో కూడా అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు. వీరిద్దరి కెమిస్ట్రీ వల్ల ఆ జబర్దస్త్ టి ఆర్ పి తో పాటు హైపర్ ఆది కూడా దినదినము అభిమానులను సంపాదించుకున్నాడు.
హైపర్ ఆది అనసూయతో వేసే డాన్సులు మరియు అనసూయని కలుపుకొని స్కిట్లు చేస్తుండడంతో అనసూయ లేకపోతే ఆది ఏం చెయ్యలేడు. అన్నట్టుగా పరిస్థితి మారిందని ఒకప్పుడు ఆది వేసిన పంచులు ఇప్పుడు వేయటం లేదని. స్కిట్టు రాయడానికి కంటెంట్ లేక అనసూయని అడ్డు పెట్టుకుని ఏదో డ్రామా చేస్తున్నాడని అసలైన కంటెంట్ చేయక బాడీ శేమింగ్ తో స్కిట్టు టైమంతా వేస్ట్ చేస్తాడని. ఆది ప్రదర్శన చల్లబడి పోయిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
కొత్తగా వచ్చిన ఇమాన్యుల్ ఆది స్థానాన్ని తీసుకున్నాడని ఇమాన్యుల్ వేసే ప్రతి పంచు పెళ్తున్నాయని . ఆది మాత్రం జ్యూస్ పోయినట్టుగా ఉంటున్నాడని పచ్చిగా కామెంట్ చేశారు. అయితే ప్రజల నుండి వ్యతిరేక భావన వస్తున్నకూడా ఆది పట్టించుకోకుండా ఉంటున్నాడు. ఈ అలవాటు తాను కెరీర్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఉంది అని చెప్తూ ఉంటాడు.

పూర్తిగా స్కిట్ లో ఏదో ఒక అంశం పైన అనుసూయ ఉండేలా స్క్రిప్ట్ రాసుకుని వచ్చే ఆది ప్రస్తుతం అనసూయకు దూరంగా ఉంటున్నాడు. ఆమె కాకుండా జబర్దస్త్ కి కొత్త అమ్మాయిలను తీసుకువస్తున్నాడు. ఆ రీతిగా పరిచయమైన వ్యక్తి ఈరోజు మనము చూస్తున్న వర్ష అనే అమ్మాయి. తాను అలా పరిచయం చేసిన తర్వాత వర్షా బాగా ఫేమస్ అయింది.
దీనికంతా కారణం అనసూయ ఆది పైన సీరియస్ అయిందని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, దానికి కారణం ఆది స్కిట్ పేరుతో పర్సనల్ లైఫ్ గురించి పంచ్ లు వేస్తున్నాడని, అందుకే అనసూయ హర్ట్ అయింది అని తెలుస్తుంది. అనసూయ పైనే పంచు వేయకుండా ఎవరైనా కంటెస్టెంట్ రాని పక్షంలో తనను ఒక ఆప్షనల్ క్యారెక్టర్ గా ఉపయోగించుకోవచ్చు అని అనసూయ అన్నారు.
ఇదే రీతిగా గత వారం టెలికాస్ట్ జబర్దస్త్ షోలో ఆది-అనసూయను పిలిచి తాడుతో కట్టేసి స్క్రిప్ట్ అంతా కూడా నిలబెట్టి ఒక పావలా వాడుకున్నాడు. ఆ విషయాన్ని అనసూయ లైట్ గా తీసుకోలేకపోయింది, అదేగాక ఇలాంటి పిచ్చి క్యారెక్టర్స్ తనకు ఇస్తే బాగుండదని ఆది పైన సీరియస్ అయింది.
ఏది ఏమైనప్పటికీ ఈ టీవీ వాళ్లు ప్రోమో ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునే ఉంటారు. అదే రీతిగా కొంతమంది ఆది ఇష్టపడేవారు తాను ఏ విధంగా సెట్ చేసిన చూస్తూనే ఉంటారు.