హద్దులు దాటిన హైపర్ ఆది..దీపికా తో అసలు మామూలు రొమాన్స్ కాదు.! వీడియో వైరల్.!

News

ETV లో ప్రసారమయ్యే ఢీ షో గురించి పరిచయం ఇవ్వవలసిన అవసరం ఉందా? సహజంగానే, పరిచయం అక్కర్లేని డాన్స్ షో ఇది. ఇది మల్లెమాల ప్రొడక్షన్స్ నిర్మించిన భారతీయ డ్యాన్స్ రియాలిటీ షో మరియు తెలుగు టెలివిజన్ పరిశ్రమలో అతిపెద్ద డ్యాన్స్ షోలలో ఒకటిగా పేర్కొనబడింది.

ఢీ షో ఇటీవలే తన 12 వ సీజన్‌ను “ధీ ఛాంపియన్స్” పేరుతో ముగించింది మరియు “ధీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్” అనే మరో సీజన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రదీప్ మాచిరాజు ఆతిథ్యమిస్తున్నారు, సుడిగాళి సుధీర్, రష్మి గౌతమ్, దీపిక పిల్లి మరియు హైపర్ ఆది జట్టు నాయకులుగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రియమణి, పూర్ణ, గణేష్ మాస్టర్ న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉంటె తాజాగా మల్లెమాల రాబోయే ఎపిసోడ్ యొక్క లేటెస్ట్ ప్రోమో వీడియోను విడుదల చేసింది.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు వైరల్ గా మారడానికి ఆ విడియో లో ఏముందో అనుకుంటున్నారా. చాలానే ఉంది, హైపర్ ఆది పంచు డైలాగ్లు ఎలా ఉంటాయో మనందరికి బాగా తెలుసు.

ఆ పంచు డైలాగ్స్ కోసం ప్రాణమైన పెట్టడానికి ముందుంటారు ఆది , అంతగా తన డైలాగ్స్ పై శ్రద్ధ పెడుతుంటారు ఆది. కానీ ఇప్పుడు ఆ డైలాగ్స్ కాస్త హద్దులు దాటుతున్నాయి అనే చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా అతని డైలాగ్స్ అంటేనే అడల్ట్ కామెడీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి డైలాగ్స్ జబర్దస్త్ లో అయితే పర్లేదు కానీ చిన్న పిల్లల మొదలుకొని ముసలి వారి వరకు చూసే ఇలాంటి డాన్స్ టాలెంట్ షో లో అవసరం లేదంటూ చాలా మంది ఇప్పటికే చివాట్లు పెట్టిన ఆది వరుస మారట్లేదు.

అయితే తాజాగా వచ్చిన ఆ షో యొక్క ప్రోమో వీడియోలో కూడా ఆది మళ్ళీ అలాంటి డైలాగ్స్ తో ముందుకు వచ్చాడు. ఆ వీడియోలో ముందుగా రష్మీ ఇంట్లో ఎవరు లేరు అంటూ సుధీర్ కి ఫోన్ చేసి రమంటుంది. సరిగ్గా అప్పుడే కో యాంకర్ దీపిక పిల్లి కూడా అది కి ఫోన్ చేసి ఇంట్లో మా నాన్న లేడు, ఇంటికి రమ్మని పిలుస్తుంది.

అప్పుడు దీపికా ఇంట్లో మా నాన్న లేడు కదా వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావ్ అని అడుగుతుంది. అప్పుడు ఆది మీ నాన్న వచ్చేలోపు మీ నాన్న చేతుల్లో మనవణ్ణి పెడదాం అంటూ సెటైర్ వేస్తాడు. ఆ డైలాగ్ కి అందరూ పగలబడి నవ్వుకున్నారు.ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

సుధీర్ రష్మీ ల జోడి కి ఎంత క్రేజ్ ఉందో మనందరికి తెలుసు.అయితే ఇప్పుడు దీపికా ఆదిల జోడి పైన కూడా శ్రద్ధ పెట్టి టిఆర్పీని పెంచే ప్రయత్నంలో ఉన్నారు నిర్వాహకులు. వారి మధ్య కెమిస్ట్రీ ని పుట్టించడానికి నానా తంటాలు పడుతున్నారు కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నారు. గతంలో ఢీ ఛాంపియన్స్ లో వార్షిని ఆదిల జోడి మంచి క్రేజ్ ను సంపాదించింది కానీ ఇప్పుడు దీపికా ఆది ల మధ్య ఆ క్రేజ్ తెప్పించడం చాలా కష్టంగా మారింది నిర్వాహకులకు. అందుకోసమే ఇలాంటి ప్రోమోలు రిలీస్ చేసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *