జబర్దస్త్ కామెడీ షో ద్వారా అతి కొద్ది సమయంలో గొప్ప పేరు ప్రక్యతలు సంపాదించిన వ్యక్తి హైపర్ ఆది. జబర్దస్త్ ప్లాట్ ఫామ్ లో తన దైన స్టైల్ లో స్కిట్ లో వరుస పంచులతో ప్రేక్షకులను ఆకర్షించాడు . ఎంతలా అంటే కేవలం ఆది కోసమే జబర్దస్త్ చుసెంతల ప్రభావితం చేసాడు. అది చేసే స్కిట్ లలో అనసూయ తో ట్రాక్ , బాడీ షేమింగ్ పంచ్ లు అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఆయన సక్సెస్ కు తగినట్టుగా రకరకాల ఈవెంట్లు షోలు మరియు సినిమాలలో అవకాశాలు రావడం మొదలు పెట్టాయి,ఆది చేసిన సుమారు అన్ని స్కిట్లు లక్షల్లో వ్యాస్ సంపాదించుకున్నాయి . వచ్చిన అవకాశాలు అన్నిటినీ సద్వినియోగ పరచుకుంటూ ఇతర కంటెస్టెంట్ల కంటే హైపర్ ఆది మరో మెట్టు పైకి చేరుకున్నాడు.
ఇక హైపర్ ఆది స్కిట్ లలో మరియు ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నాడు, ఇక ఆయన బిజీ షెడ్యూల్ ను చూసిన ఎంతో మంది అయన రెమ్యూనరేషన్ ఎంతో అని తెలుసుకునే పనిలో పడ్డారు. దీనికి కారణం ఆది ఈవెంట్ మరియు షో లకు తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేశడట.
ప్రస్తుతం ఆయన చేస్తున్న స్కిట్లకు ఏ ఇతర ఆర్టిస్ట్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా లక్షల్లో తీసుకుంటున్నాడట. ఇక సినిమాల్లో కూడా టాప్ కమెడియన్ కానుండగా అక్కడ కూడా బారి రెమ్యూనరేషన్ తెస్కుంటునాడట.
ఇక గత ఏడాదిలో కోటికి పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తాజాగా 16 ఏకరాల భూమి కొనుగోలు చేసినట్టు మరియు హైదరాబాద్ లో త్వరలోనే కరిదైన ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నట్టు ఇండస్ట్రీ లో హల్ చల్ చేస్తున్న గుస గుసలు వినిపిస్తున్నాయి అందుకే ప్రజలు అయన ఆస్తుల వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.
ఇలా వచ్చిన అవకాశాలని సద్వినియోగ పరచుకొని సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్న ఆయనను చూసి మిగితా జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా ఎదగాలని సలహాలిస్తుంటారు అభిమానులు. ఇక ఆయనకున్న ఫాలోయింగ్ అది త్వరలోనే మరో గొప్ప స్థాయికి ఎదుగుతాడు.