హైపర్ ఆది అంటే తెలియని వారు ఉండరు. జబర్దస్త్ లో టాప్ టీం లీడర్స్ లిస్ట్ రాస్తే దాంట్లో మొదటి రెండవ స్థానంలో ఉంటాడు ఆది, అందరి కంటే భిన్నంగా స్కిట్ డ్రామా లాగా కాకుండా అదరగొట్టే పంచులు వేస్తూ ప్రేక్షకుల మనసును కొల్లగొట్టాడు, అయితే కొన్ని సందర్భాలలో ఆది వేసే పంచులు కొంతమందికి పడక ఆది స్కిట్లను లను ద్వేషించే వారు కూడా ఉన్నారు, మరి కొన్ని పంచులు అయితే సమాజంలో సున్నితమైన అంశాలు మీద చేసి కాంట్రవర్సీ కారణమవుతున్నాడు, నవ్వించే ప్రయత్నం లో కొన్ని సున్నితమైన అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి అయితే ఆది మాత్రం ప్రజలను నవ్వించడానికి ఏ రిస్క్ అయినా చేస్తాను అంటూ మొండిగా ప్రవర్తిస్తుంటారు.
కొన్నిసార్లు కొంతమంది హీరోలపై ఆది రెచ్చిపోయి వేసిన పంచుల వల్ల అభిమానుల నుండి బెదిరింపులు ఎదుర్కొన్నాడు. నీ పబ్బం గడుపుకోవడం కోసం మా హీరో ని తక్కువ చేస్తావా అంటూ ఆయనను అనేకసార్లు అభిమానులు బెదిరించారు, అయితే వీటన్నిటిని చూసి చూడనట్టు ముందుకు వెళ్లి పోతూ ఉంటాడు, ఇక తాజాగా మరొకసారి ఒక హీరో విషయంలో పంచులు వేస్తూ విమర్శకు లోనయ్యాడు.
దీపావళి పండుగ సందర్భంగా ఈటీవీ లో తగ్గేదే అనే స్పెషల్ ప్రోగ్రాం ప్రసారమైంది అందులో సుమారుగా జబర్దస్త్ కంటెస్టెంట్ లందరూ పాల్గొన్నారు. ఇక తమ తమ ప్రదర్శనలు ఒకరి వెంట ఒకరు ఇస్తూ వచ్చారు ఇక చివరికి ఆది సమయం వచ్చింది. ఆది తన స్కిట్ లో భాగంగా తాజాగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన విష్ణు పై పంచులు వేసాడు.
మా ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో విష్ణు ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నరేష్ అడ్డుకోగా నన్ను ఆపకండి అంకుల్ .. , లెట్ దెం నో. శ్రీహరి అంకుల్ బ్రతికుంటే ప్రకాష్ రాజు బండారం మొత్తం బయట పడేది అంటూ చెప్పుకొచ్చి ఆ తర్వాత ఒక ఛానెల్ లో జరిగిన ఇంటర్వ్యూలో విష్ణు ప్రకాష్ రాజు ను విమర్శిస్తూ ఆయనను టంగుటూరి గురించి చెప్పమనండి చూద్దాం అని ప్రకాష్ రాజు పై సెటైర్ వేసిన విష్ణు మాటలను తన స్కిట్ లో వాడుకున్నాడు ఆది.
విష్ణు ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేసినట్టు ఆది రోజా ఇంద్రజ ప్రియమణి లను టార్గెట్ చేస్తూ మీకు స్క్రిప్ట్ మీద పట్టు సున్యం అన్నాడు. విష్ణు ప్రకాష్ రాజును టంగుటూరి గురించి మాట్లాడడం అన్నట్టు ఆది రోజాను గురజాడ గురించి మాట్లాడండి చూద్దాం అంటూ ఏకంగా ప్రస్తుత మా అసోసియేషన్ అధ్యక్షుడునీ ట్రొల్ చేశాడు. ఇక ఆది మాటలకు విష్ణు ఎల స్పందిస్తాడో చూడాలి, విష్ణు సీరియస్ తీసుకుంటే ఆది పరిస్థితి ఏం అవుతుందో అన్న టెన్షన్ పడుతున్నారు అభిమానులు.
Also Read
హైపర్ ఆది ఆస్తి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
హైపర్ ఆది కీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ భరద్వాజ్
స్కిట్ లో దారుణంగా పరువు తీసిన హైపర్ ఆది.! (VIDEO)
హద్దులు దాటిన హైపర్ ఆది..దీపికా
అందరు షాక్..! బయట పడిన హైపర్ ఆది లవ్ లెటర్..
‘ఆది నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా