రామ్ హీరోగా నటించిన దేవదాస్ సినిమాలో ఇలియానా నటించి సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆమె నటనతో మాత్రమే కాక ఆమె ఫిజిక్ తో కూడా కుర్రాళ్ళ మతులు పోగొట్టింది. గోవా నుండి వచ్చి తమిళ తెలుగు పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఎదిగి ఫామ్ లో ఉన్న హీరో లకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయింది ఇలియానా. ఇండస్ట్రీ కి పరిచయమైన తర్వాత తన 2వ సినిమా పోకిరి చేయటం తో ఆమె గుర్తింపు డబుల్ అయింది.
ఇక ఆమెకు ఉన్న క్రేజ్ వల్ల తమిళ తెలుగు సినిమాల్లో ఆమె అందని వర్ణిస్తూ డైలాగులు పాటలు కూడా వచ్చాయి. ఇక మంచి హీరోయిన్ గా దక్షిణాన ఏలుతున్న ఆమె అత్యాశకు గురై తెలుగు పరిశ్రమను వదిలి బాలీవుడ్ కు వెళ్ళింది అయితే అక్కడ ఆమె చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇలియానాకు దురదృష్టం అని ముద్ర వేసి సినిమాలకు దూరం చేశారు అక్కడి వారు.
అక్కడ అవమానం బరించలేక తిరిగి టాలీవుడ్ కి వచ్చిన ఆమెకు అప్పటికే ఇండస్ట్రీ లో పాతుకు పోయిన అనుష్క వంటి టాప్ హీరోయిన్ లతో గట్టి పోటీ ఎదురైంది. ఆ సమయంలో రవితేజ సరసాన దేవుడు చేసిన మనుషులు సినిమా చేసే అవకాశం వచ్చింది అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అవ్వటం తో ఇలియానాను సినిమాలకు సిఫార్సు చేయడం మానేశారు.
ఇక తిరిగి బాలీవుడ్ వెళ్ళిన ఆమె కొన్ని సినిమాలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు , ఇవే గాక కొన్ని చిత్ర పరిశ్రమలో జరగుతున్న విషయాల పై మాట్లాడుతూ వైరల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక పూర్తిగా కనుమరుగవుతున్న ఇలియానా ఇంటర్నెట్లో ఒక నేటిజనునికి ఈ రకంగా స్పందించింది పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉంది.. కానీ వారుడు దొరకాలి గా . ఇక ఈ కామెంటు నెట్టింట వైరల్ అయింది. అయితే 30 ఏళ్ల వయసున్న ఇలియానా గతంలో తన బాయ్ ఫ్రెండ్ వల్ల గర్భవతి అయింది అన్న వార్త కూడా హల్ చల్ చేసింది. ఇలియానా ఈ రెండు విషయాల్లో వైరల్ అవ్వగా , ఆమె పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.