ఇమ్మనుయేల్ తో పెళ్లి డ్రామా..! ‘వర్ష ఇంత దిగజారుతుందా..?’ అంటూ నెటిజన్లు సీరియస్..!

Movie News

జబర్దాస్త్ గత ఎనిమిది సంవత్సరాలుగా నిరంతరం నడుస్తున్న ఒక ప్రసిద్ధ , వివాదాస్పద టీవీ కామెడీ షో. ఈ కామెడీ షోలో పాల్గొన్న చాలా మంది చిన్న మరియు పెద్ద తెరపై స్టార్ కమెడియన్లుగా మారారు. గెటప్ శ్రీను, సుడిగాళి సుధీర్, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, మహేష్, మరియు దొరబాబు తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇంటిలో బాగా తెలిసిన కొన్ని పేర్లు.

రష్మి మరియు సుధీర్ మధ్య రొమాన్స్ తరువాత, ఇప్పుడు జబర్దాస్త్ లో ప్రేమ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నా ఇమ్మాన్యుయేల్ మరియు వర్షా జంట ఇంకో కొత్త మలుపు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని ఇద్దరూ ఖండించనప్పటికీ, ఎన్నో పుకార్లు తమ ప్రేమకథపై ఆఫ్ మరియు ఆన్ స్క్రీన్‌పై నిండి ఉన్నాయి. ఈటీవి ప్లస్‌లోని మరో ప్రసిద్ధ కామెడీ షో పటాస్‌లో విజయవంతంగా పనిచేసిన తరువాత జబర్దాస్త్‌లోకి ప్రవేశించాడు ఇమ్మాన్యుయేల్, హైపర్ ఆది జట్టులో సభ్యురాలిగా వర్షా తన ఎంట్రీ ఇచ్చింది.

జబర్‌దాస్త్ నిర్మాతలు వారి కెమిస్ట్రీని స్క్రీన్‌పై తమ బంధానికి మరింత మసాలా జోడించడం ద్వారా పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు, తద్వారా సుధీర్-రష్మి ప్రేమకథ విషయంలో చేసినట్లుగా వీరి ద్వారా కూడా ఎక్కువ రేటింగ్ పొందాలని చూస్తున్నారు. ఇమ్మాన్యుయేల్ మరియు వర్షల మధ్య ఈ కొత్త జబర్దాస్త్ ప్రేమకథ ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి.

ఇది ఇలా ఉండగా ఈ వారం లో ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ షో యొక్క లేటెస్ట్ ప్రోమో వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది, ముఖ్యంగా యాంకర్ వర్ష విమర్శలు పొందుకుంటుంది. అంతే కాదు శ్రీదేవి డ్రామా కంపెనీ షో ని కూడా తిడ్తున్నారు నెటిజన్లు.అసలు ఏం జరిగింది ,రండి పూర్తి స్టోరీ తెలుసుకుందాం. మనం ఇంత వారకే ఎన్నో ఫేక్ పెళ్లిళ్లు కామెడీ షోల పుణ్యమా అంటూ చూసాం.

అవి ఫేక్ పెళ్ళిల్లే అయిన కూడా తెలుగు రాష్ట్రాల ప్రయక్షకుల ఆదరణ కూడా బాగానే పొందుకున్నాయి. ముఖ్యంగా మాట్లాడాలంటే రష్మీ , సుధీర్ ల పెళ్లి తో ఈటీవీ రేటింగ్ ఒక రేంజ్ లో కి వెళ్ళింది. ఇక దాని తర్వత ఎంతో మంది ఇదే ట్రిక్ ను ఫాల్లో అయ్యారు. ఇప్పుడు ఇమ్మనుయేల్, వర్ష లు కూడా ఇదే ఫాలో అయ్యారు. కానీ ఇప్పటికే ఎన్నో ఫేక్ పెళ్లిళ్లు చూసినా ప్రజలకు ఇలాంటి పెళ్లిళ్లు బోర్ కొట్టేసాయి.

ఇంకెంత కాలం పాత ఐడియాస్ నే ఫాలో అవుతారు అంటూ విమర్శించారు. అంతే కాదు రష్మీ ,సుధీర్ ల పెళ్లి ను కొంత మంది నిజం అనుకున్నారు తర్వాత అది షో ప్రమోషన్ కోసం అని తర్వాత తెలిసి చాలా మంది తిట్టారు. పెళ్లి విలువను ఈ షో మంటగలుపుతుంది అని చాలా విమర్శలు అప్పుడే వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ షో తీవ్రమైన విమర్శలు ఎదురుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *