జబర్దస్త్ ప్రోగ్రాంలో తన మంచి కామెడీ టైమింగ్ ద్వారా పేరును సంపాదించుకున్నారు ఫహిమా. ఆమె జబర్దస్త్ షోతో పాటుగా ఇతర ఈటీవీ ఛానల్స్ లో ప్రసారమయ్యే ఇతర షోలలో కూడా ఫైమా కనబడుతుంటారు.ఒక మారుమూల ఊరు నుండి హైదరాబాద్ సిటీకి వచ్చి ఫహీమా ఈ స్థాయిలో గుర్తింపును సంపాదించుకోవడం చిన్న విషయం కాదు.
తనపై ఎవరు ఎలాంటి పంచ్ లు వేసినా కూడా ఫహీమా స్పోర్టివ్ గా తీసుకుంటూ ఉంటారు.అయితే గతంలో ఈటీవీ ప్లస్ ప్రసారం చేసిన పటాస్ షోలో కూడా ఫహీమా పాల్గొన్నారు.
అయితే ఆమె ఇటీవలే జబర్దస్త్ షోలో కూడా అడుగు పెట్టి బానే రాణిస్తున్నారు. ఈ సందర్భంగా వచ్చే వారం జబర్దస్త్ షో యొక్క లేటెస్ట్ ప్రోమో వీడియోను విడుదల చేసారు నిర్వాహకులు. అయితే ఆ ఎపిసోడ్ లో ఎక్కడ చూసినా ఫహిమానే కనిపిస్తుండడం తో సోషల్ మీడియాలో ఫహిమా బ్యాక్ టూ ఫార్మ్ అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. మరి నిజంగానే ఆ వీడియో చూస్తే అందరూ అదే అంటారు. బులెట్ భాస్కర్ టీంలో మెంబెర్ గా ఉన్న ఫహిమా తన టీం లో పరఫార్మన్స్ అదరగట్టారు. తర్వాత గెటప్ శ్రీను టీంలో కూడా సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది.
ఆ స్కిట్ లో గెటప్ శ్రీను కు కూతురుగా వచ్చి రచ్చ రచ్చ చేసింది.ఆ స్కిట్లో ఆమె ఎంటర్ అయిన తర్వాత గెటప్ శ్రీనుని అందరూ మర్చిపోయారు. ఆమె డైలాగ్ డెలివరీ లో గెటప్ శ్రీనునే దాటేసింది. ఆ స్కిట్ లో ఒక సందర్భంలో గెటప్ శ్రీను ఆమె ‘నాన్న గారు’ అనే డైలాగ్ డెలివరీ కి బాబోయ్ అంటూ నోరెళ్ళబెట్టేసాడు శ్రీను.అంతలా తన ఆల్రౌండ్ పరఫార్మన్స్ తో ఆకట్టుకుంది ఫహిమా.ఈ ఎపిసోడ్ వచ్చే వారం ప్రసారం కానుంది.కానీ ప్రోమో వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది.ముక్యంగా అందులో ఎక్కువగా ఫహిమా టైమింగ్ కి ఫిదా అవుతున్నారు నెటిజన్లు.
అయితే ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పాలంటే ఆమె పేద కుటుంబానికి చెందిన వ్యక్తి మరియు తన అక్కల పెళ్లిళ్ల కొరకు చేసిన అప్పులను తీర్చడానికి ఆమె ఇలా కష్టపడుతున్నారు.ప్రజెంట్ ఈమె ఓ అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు.
కాబట్టి ఈ కామెడీ షోలల్లో వచ్చే అవకాశాల ద్వారా తన కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకొని మంచి స్థాయికి వెళ్లాలని ఫహీమా అనుకుంటున్నారు.తన కుటుంబానికి చక్కటి సపోర్ట్ అందించాలని అనుకుంటున్నారు ఆమె.
అయితే గతంలో ప్రసారమైన పటాస్ 2 షో ద్వారా వచ్చిన పాపులారిటీ తో ఆమెకు జబర్దస్త్ షోలో కూడా అవకాశాలను వచ్చాయి .నూకరాజు మరియు ఇమ్మాన్యుయేల్ టీమ్ లలో ఫహీమా వేసిన స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
ప్రేక్షకుల్లో బాగానే గుర్తింపు ను సంపాదించుకున్నారు ఫహీమా.అయితే ప్రెజెంట్ ఆమె ఒక్క వారానికి 50,000 రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే గతంలో ఫహీమా ప్రేమలో పడ్డారని మరియు కొన్ని కారణాలతో ప్రేమించిన వ్యక్తి ఆమెకి బ్రేకప్ చెప్పాడని తెలుస్తోంది.ఈమెకు ఈ షోస్ తర్వాత లవ్ ప్రపోజల్స్ కూడా చాలానే వచ్చాయని ఆమె ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.