ఈ టీవీ లో ప్రసరమయే పాపులర్ షో జబర్థస్త్.ఒకప్పుడు ఆ షో లో లేడి కమెడియన్లు లేక అబ్బాయిలకి అమ్మాయి వేషాలు వేసేవారు. కని ఈ మధ్య అమ్మాయిల ఆ షో లో బానే రాణిస్తున్నారు. అయితే ఈ మధ్య చాలా స్కిట్ లలో అమ్మాయిల కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అబ్బాయిలకు పోటీగా అమ్మాయిలు కూడా తమ వంతు కామెడీ చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం అబ్బాయిలు అమ్మాయిల వేషం వేసుకొని స్కిట్స్ నీ చేసేవారు,కాగా అది కొందరికి నచ్చలేదు.
ఇది చిన్నగా వెళ్లి పెద్ద విమర్శగ మారింది. ఎది ఫ్యామిలి షో అని చెప్పి అందరి అమ్మాయిలు కించపరుస్తూ ఉన్నారని చాలా మంది విమర్శించారు. ఈ విమర్శలను చూసి మా రామోజీ రావు గారు షో ప్రొడ్యూసర్ ఆయన శ్యామ్ రెడ్డి గారిని పిలిపించి ఈ విమర్శలపై ప్రశ్నించారు.
అప్పటి నుంచి స్కిట్స్ లో వల్గారిటీ కొద్దిగా తగ్గించి షోను కొనసాగించారు. మెల్లిమెల్లిగా ఈ మార్పులు ప్రజలకు నచ్చాయి. పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేసి అలసిపోయిన వారికి ఈ షో కొద్దిగా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇందులో పనిచేసే పర్ఫార్మర్ లకు మరియు యాంకర్లకు జడ్జిలకు భారీగా రెమ్యూనరేషన్ ఇస్తారు. ఇదే క్రమంలో ఈమధ్య లేడీ ఫర్ ఫార్మర్ లు కూడా జాయిన్ అయ్యరు.
పవిత్ర అంటే ఎవరు:
చాలా చిన్నగా ఉన్నా మంచి కామెడీ టైమింగ్ తో తనకంటూ పేరు సంపాదించిన అమ్మాయే ఈ పవిత్ర. చూడటానికి నాలుగడుగులు ఉన్నా ఆమె వేసే పంచులు ఆరడుగుల ఎత్తులో పేలుతుంటాయి. ఈ పవిత్ర ముఖ్యంగా భాస్కర్ మరియు రాఖీల స్కిట్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరియు రాఘవ గారి స్కిట్ లో కూడా మాగి తో పాటు తనకు సమానంగా కామెడీ చేస్తోంది. వర్ష తొ పాటు వచ్చిన పవిత్ర చాలా హంగామా చేస్తోంది.అయితే ఈమె టిక్ టాక్ లో చిన్నచిన్న డబ్స్మాష్ వీడియో లు చేస్తూ అప్లోడ్ చేసేది.
అయితే అంతకు ముందు ఆమె చిన్నచిన్న సీరియల్స్ లో కూడా పని చేసిందని తెలిసింది.కానీ ఆ సీరియల్స్ ల వల్ల తనకు ఎలాంటి గుర్తింపు రాలేదని చెప్పింది. ఈమె చేసే టిక్ టాక్ వీడియోలు జబర్దస్త్ నిర్మాతల కంట్లో పడ్డాయి.అలా పవిత్ర కి జబర్దస్త్ ఆడిషన్ లోకి పిలిచారు. ఆడిషన్లో తన కామెడీ టైమింగ్ ని నిరూపించుకొని అబ్బాయిల తో సహా అందరిని మెప్పించింది. దీనితో వ్యువర్స్ కి పవిత్ర అంటే ఎవరు అనే ఒక క్యూరియాసిటీ వచ్చింది. ఆమె చేసి ఇ కామెడీ టైమింగ్ అందరికి నచ్చింది. ఇలానే చేస్తూ ఉంటే ఈ చిన్న పవిత్రకు కస్త చాలా పెద్ద పెద్ద అవకాశాలు వచ్చేలా ఉన్నాయి.