Jai bheem Lawrence

గత 28 ఏళ్లుగా బాధను అనుభవిస్తున్న జై భీమ్ రియల్ లైఫ్ సిన్న తల్లికి, సంతోషకరమైన వార్త తెలియజేసిన రాఘవ లారెన్స్

Uncategorized

2021లో విడుదలైన బెస్ట్ చిత్రంగా జై భీమ్ సినిమా రికార్డులను బద్దలు కొడుతుంది, ఈ సంవత్సరం విడుదలైన సినిమాలలో అత్యధికంగా 9.8 రేటింగ్ తో భారతదేశంలో నంబర్వన్ సినిమాగా నిలిచింది.

ఈ సినిమాలో ఏ దర్శకుడు సాహసం చేయనటువంటి కులము మతము అనే కాన్సెప్ట్ పైన ఈ సినిమాను తెరకెక్కించాడు, సాధారణంగా ఈ రకం సినిమా తియ్యాలంటే సామాజికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తోంది, వీటన్నిటినీ బేఖాతరు చేసి విజయవంతంగా సినిమాను తీయగలిగాడు దర్శకుడు జ్ఞానవేల్, ఈ విధమైన సినిమాలు కేవలం తమిళనాట మాత్రమే సాధ్యం అన్నట్టుగా భారతదేశం అంతా కూడా దక్షిణ సినిమా పరిశ్రమను తొంగిచూస్తోంది. ..

ఇక ఈ సినిమా సక్సెస్ అందుకున్న తర్వాత సినిమాలోని పాత్రలను ఒక్కసారిగా ప్రేక్షకులకు పరిచయం చేసే పనిలో పడింది చిత్ర బృందం, ఈ చిత్రంలో చిన్న తల్లి గా లీడ్ రోల్ పోషించిన లిజామొల్ జోస్ తన నటనతో ఎంతోమందికి కంటతడి పెట్టించింది, ఆమె నటించిన ప్రతి నిమిషం కూడా నిజ జీవితంలో జరిగిన సంఘటనలు తనలో చూపించి బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చింది, అదే రీతిగా సూర్య కూడా తన పాత్రకు న్యాయం చేస్తూ మంచి వకీలు గా చంద్రు పాత్రను పోషించాడు, ఇక మిగతా ప్రముఖులు రావు రమేష్ ప్రకాష్ రాజ్ వంటి వారు ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు, ఈ సినిమాలో ఒక్కొక్కటిగా కేసు మలుపు తిరుగుతున్న కొద్ది నిజజీవితంలో జరిగిన సంగతులు లాగానే అనిపిస్తూ సాధారణ ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది,

ఇక ఈ చిత్ర బృందం ఈ సినిమాను ఎవరి నిజజీవిత ఆధారాన్ని బట్టి తెరకెక్కించారో బయటపెట్టారు. నిజ జీవితంలో చంద్రు తన జీవితంలో కొన్ని వేల కేసులను ఎదుర్కొని తన చేతనైన మట్టుకు న్యాయం జరిగించాడని తెలుసుకొని ఆ సినిమాకు నిజంగానే ఎంతో కనెక్ట్ అయ్యారు, అదే రీతిగా చంద్రు కంటే కూడా బాధితురాలిగా అన్యాయంగా సొంత వారిని పోగొట్టుకున్న చిన్ని తల్లి ని చూసినప్పుడు ప్రేక్షకుల మనసులో ఆమె పై కలిగిన భావన వర్ణనాతీతం. తెరపై చిన్నితల్లి జీవితాన్ని చూసిన వారందరూ కంటతడి పెట్టేసుకున్నారు.

Jai bheem Lawrence

ఇక అలాంటి వ్యక్తి ఇప్పటికీ మన సమాజంలో ఉంది అని తెలిసి ఆమెపై ప్రజలు తమకు వీలైన సానుభూతిని మరియు దయను చూపిస్తున్నారు. తమిళ పరిశ్రమలో మరో ప్రముఖుడు దర్శకుడు డ్యాన్సర్ అయినటువంటి రాఘవ లారెన్స్ కూడా వాస్తవ జీవితం లోని చిన్ని తల్లి ని చూసి స్పందించాడు, ఆమెకు సహాయపడతానని మాటిచ్చి తన ఉదార గుణం చాటుకున్నాడు, సినిమాల్లో చిన్న తల్లికి ఇల్లు లేకపోవడం ఆ ఇల్లు లేకపోవడం వల్లనే తనకు సమాజంలో గుర్తింపు లేకపోవడం అనేది ప్రధానాంశంగా చిత్రీకరించారు ఇక అదే పాయింట్ను పట్టుకున్న లారెన్స్ నిజజీవితంలో చిన్ని తల్లికి ఇల్లు కట్టి ఇస్తానని వాగ్దానం చేశాడు.

గత 28 ఏళ్లుగా బాధలు అనుభవిస్తున్న ఆ తల్లి బాధ ఇప్పుడు రాఘవ లారెన్స్ ద్వారా సంతోషంగా మారనుందని రాఘవ లారెన్స్ ను అభినందిస్తూ జై భీమ్ సినిమాను మెచ్చుకుంటున్నారు ప్రేక్షకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *