జూనియర్ ఎన్టీఆర్ కండిషన్లు ఒప్పుకుంటే పెళ్లి లేదంటే నో

Trending

కాలం మారుతున్న కొద్ది వివాహ పద్ధతులు కూడా అప్డేట్ అవుతు ఉన్నాయి. ముఖ్యం గా పెళ్లికి ముందు తమ భాగస్వాముల గురించి తెలుసుకోవాలని ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంతమంది మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లలో చూస్తే మరికొంతమంది డేటింగ్ ద్వారా , ఇంకొంత మంది ఇతర పద్ధతులు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎలాగైతేనేం జీవితాంతం కలిసి ఉండబోయే తమ లైఫ్ పార్టనర్ గురించి ముందే తెల్సుకునే ప్రయత్నం చేస్తుంటారు.

ఇదే గాక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎలా ఉండాలో ముందే అంచనాలు వేసుకొని కలలు కంటుంటారు. మారుతున్న కాలం కొలది పెళ్లి చేసుకోబోయే జంటకు ఒకరి ఇష్టల గురించి ఒకరు తెలుసుకోవడానికి ఒకరితో ఒకరు సరదాగా గడపడానికి పెళ్లి కానప్పటికీ పూర్తి స్వేచ్ఛను ఇస్తారు ఇరువురి తల్లిదండ్రులు. ఆ స్వేచ్ఛను సరిగా వినియోగించుకున్న జంట తమకు కాబోయే భాగస్వామి ఇష్టా అహిష్టాలు ముందుగానే తెలుసుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో తాము చేసుకోబోయే వ్యక్తి లో ఏదైనా విషయము ఆటంకంగా అనిపిస్తే తమకోసం మానుకోమని లేదా సరి చేసుకోమని ప్రేమగా విన్నవించుకున్నారు. ఇక కాబోయే దంపతులు మధ్య ఇది తొలి ప్రేమ గనుక ఎంతో ప్రేమతో తమ వైఖరి సరి చేసుకుంటారు.

అమ్మాయి గాని అబ్బాయి గాని తాము చేసుకోబోయే భాగస్వామి ఇలా ఉండాలి అనే కండిషన్లు పెట్టుకొని ఆ కండిషన్లకు ఒప్పుకుంటేనే పెళ్ళికి సిద్ధమవుతున్నారు. అలా కండిషన్లకు ఓప్పుకోనట్లయితే ఎవరి దారి వారిదే అవుతోంది.

ఇలాంటి ఒక సాంప్రదాయం ప్రేమ పెళ్లిళ్లు కంటే ఎక్కువగా పెద్దలు ఏర్పరచిన పెళ్ళిలో చూస్తుంటాం. ఇలాంటి సందర్భం చిన్న పెద్ద అనే తేడా లేకుండా తాజాగా ప్రతి నవ దంపతుల మధ్య తలెత్తుతున్న అంశమే.

ఇక ఇలాంటి కండిషన్ లతోనే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కూడా వివాహం చేసుకున్నారనే విషయం తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి పెళ్లికి ముందు కొన్ని కండిషన్లు పెట్టిందట.

కెరీయార్ లో స్థిరపడుతున్నారు రోజుల్లో ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి ని పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో బహుశా పెళ్లైన కొత్తలోనే తన భర్తతో సరదాగా గడపలేననీ భావించి తన కండిషన్ లలో మొదటి కండిషన్ గా పెళ్లి అయినా రెండు నెలలపాటు తన కెరియర్ కు దూరంగా ఉంటూ తనతోనే గడపాలనే కండిషన్ పెట్టిందట. అలాగే స్నేహితులతో బయట తిరగడం మానేయమన్నారట బయట తినడం వంటివి చేయొద్దని తన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు శ్రద్ధగా వహిస్తానని అన్నారట. మరియు షూటింగ్ కొరకు అవుట్ డోర్ కు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ డ్రెస్సింగ్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తానని పెళ్లికి ముందు ఈ కొన్ని కండిషన్లు పెట్టి ఎన్టీఆర్ ను వివాహం చేసుకున్నది ప్రణతి. ఇక వీరిద్దరికీ అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరూ పిల్లలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *