మంచి డాన్సర్, యాక్టర్, ఎన్టీఆర్ నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్ నటనతో పలు విధమైన సేవలు చేస్తూ అభిమానులను మరియు అవసరాలతో ఎదురుచూస్తున్న వారికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటూ తన స్పందించే మనసును ప్రజలకు కనుపరుస్తు ఉన్నారు. గతంలో ఎన్నో సార్లు మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది గొప్ప యాక్టర్లు గొప్ప సెలబ్రెటీలు అనాథలైన వారికి వ్యాధులతో బాధపడుతున్న వారికి తమ వంతు సహాయం చేసినట్లు మనం చూశాం.
వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా పలు సమయాలలో అక్కడ ఉన్నవారిని ఆదుకున్న టు గతంలో చాలా సార్లు చూశాం.
తాజాగా మరొక సంఘటన చోటు చేసుకుంది ఆస్పత్రిలో అనారోగ్యం పాలై లేవ లేనటువంటి స్థితిలో ఉన్న ఒక అభిమాని తన చివరి కోరిక గా ఎన్టీఆర్ గారిని కలవాలని కోరుకున్నాడు , ఈ విషయము ఆస్పత్రి సిబ్బంది ఎన్టీఆర్ గారికి తెలిసే రీతిగా చర్యలు తీసుకున్నారు.
దీంతో స్పందించిన ఎన్టీఆర్ గారు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని వీడియో కాల్ ద్వారా పరామర్శించాడు, మరియు ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు, త్వరలో బాగా అవుతావని ఆ సదరు వ్యక్తి లో విశ్వాసాన్ని నింపారు, అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారి ఎంతోమందికి స్ఫూర్తిని ఎన్టీఆర్ అంటే గొప్ప అభిమానాన్ని కలిగిస్తోంది, సినిమాలలో ఆయన డ్యాన్స్ ద్వారా బిగ్బాస్ సీజన్ వన్ లో ఆయన ప్రదర్శించిన మంచి లీడర్ షిప్ గుణం వల్ల మరియు అనేక సార్లు ఆయన చేసిన సేవల వల్ల ఆటోమేటిక్ గా ఎన్టీఆర్ గారికి ఫ్యాన్ అయిపోతున్నారు.