ప్రస్తుతం ఇండియన్ మూవీ ఇండస్ట్రీలోనే ఎక్కువగా పేరున్న రచయిత ఎవరు అని అడిగితే కచ్చితంగా దర్శకుడు రాజమౌళి గారి తండ్రి గారైన విజయేంద్ర ప్రసాద్ అని ప్రతి ఒక్కరు చెప్తారు.ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు.
అతను రాసిన కథలు ఏదో ఒక రికార్డు సృష్టించకుండా ఉండవు.టాలీవుడ్ లో మొదలు పెడితే ఆయన రాసేటి కధల కోసం బాలీవుడ్ లో ఉండే నిర్మాతలు, డైరెక్టర్లు మరియు హీరోలు క్యూ లు కడుతూ ఉంటారు.అయితే ఇంతటి గొప్ప పేరు ఉన్న విజయేంద్ర ప్రసాద్ గారు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనే దాని పై రకరకాల పుకార్లు వైరల్ అవుతూనే ఉన్నాయ్. అయితే తాజాగా అతను ఒక న్యూస్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ గురించి వస్తున్న పుకార్లపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.ఆ ఇంటర్వ్యూలో అందరికి అర్ధం అయ్యే విధంగా అద్దిరిపోయే సమాధానాలు ఇచ్చారు ఈ బాహుబలి రచయిత.
అయితే ఇండియా లోనే అందరూ రచయితలలో విజయేంద్ర ప్రసాద్ గారే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారు అనే పుకార్లు చాలానే ఉన్నాయ్ . కాబట్టి వాటన్నిటికీ అద్దిరిపోయే సమాధానాలు తనదైన శైలిలో ఇచ్చారు రాజమౌళి నాన్న గారు. అయితే తన రెమ్యునరేషన్ గుర్చి మాట్లాడుతూ విజయేంద్ర ప్రసాద్ మిగతా వారు ఎంత తీసుకుంటున్నారో తనకు తెలిస్తే రచయితగా తాను ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్లలో మొదటి స్థానంలో ఉన్నానో లేదో చెప్పగలను.
కానీ నాకు అసలే ఇతరుల పారితోషికం తెలియనప్పుడు నేను అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను అని చెప్పగలను అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.నేను ఎప్పుడు కూడా ఏ ప్రొడ్యూసర్ ని ఎక్కువ అడగలేదు.అంతే కాదు ఎక్కువ మంది నేను చాలా బిజీ గా ఉంటాను అనుకుంటున్నారు కానీ నేను వారు అనుకున్నంత బిజీ గా ఎపుడు లేను. ఒక రచయిత గా కథ రాసి దర్శకుడికి అప్పగించేంతవరకే నా పని ఉంటుంది.
ఇక దాని తరువాత దాన్ని తెరక్కెక్కించడం పూర్తిగా దర్శకుడి చేతిలోనే ఉంటుంది . రైటర్ గా కథ రాయడం వరకే నా పని, తరువాత నేను ఖాళీగానే ఉంటాను. మల్లి దర్శకుడికి నాతో పని పడేంత వరకు నాకు చాలా టైం దొరుకుతది కాబట్టి నేను మీరు అనుకున్నంత బిజీ గా అసలు ఉండను అని ఆయన అన్నారు. ఒక్కసారి దర్శకుడికి కథను అప్పగించిన తరువాత అసలు రచయిత తో పనే ఉండదు, నిజానికి ఉండకూడదు కూడా. కథ ను వీక్షకులకు అర్ధమయ్యే విధంగా వారు ఇష్టపడి మల్లి మల్లి చూసే విధంగా చేయడం పూర్తిగా అది డైరెక్టర్ చేతుల్లోనే ఉంటుంది అని ఆయన అన్నారు.